Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఆ తరువాత మందిరంలో శ్రీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ట జరిగింది. అక్కడ పూజలు కూడా ప్రారంభం అయ్యాయి.
అప్పటి నుంచి నాకు ప్రతి రోజు మందిరానికి వెళ్ళటం దిన చర్య గా మారిపోయింది.
స్వతహాగా చంచల స్వభావం గల మనస్సుకి ఏకాగ్రత కలిగించడం కోసం ఒక విగ్రహం కానీ, చిత్రపటం కానీ ఆలంబనగా ఉపయోగపడుతుంది అన్న విషయం అర్థమైన తరువాత ప్రతి రోజు ఇంట్లో పూజ చేయటం బాబా మందిరంలో జరిగే ఆరతులకు హాజరవ్వటం అలవాటయ్యింది.
అంతకు ముందు నాకు ఆరతుల గురించి కూడా ఏమీ తెలియదు. ఎప్పుడూ వినలేదు కూడా. కానీ కొంత కాలము అయ్యేటప్పటికి అరతులు కూడా కంఠతా వచ్చేసాయి. అలాగే మనసుకి, జీవితానికి ఒక క్రమ బద్ధత ఏర్పడింది.
వ్యక్తిగత జీవితంలో కష్టాలు, సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి,
కానీ సాయిబాబా చెప్పినట్లు భారం అయన మీద వేసి, మనం అయన చెప్పిన మార్గం లో పయనించ గలిగితే ఈ సంసారసాగరాన్ని దాటటం చాలా సులభం అవుతుందని నేను గట్టిగా విశ్వసిస్తాను.
నాకు వ్యక్తిగతం గా సాయిబాబా తో అనుభవాలు అంటే ప్రత్యేకంగా చెప్పటానికి పెద్దగా ఏమీ వుండవు. ఎందుకంటే అంతా సాయి మయం గానే తోస్తుంది కాబట్టి అన్నీ ఆయనే చూసుకుంటాడు అని భారం ఆయనమీదే వేస్తూంటాను.
అలాగే అయన ఆశిస్సులు అండదండలు మనకు అందుతూనే ఉంటాయి. ఉదాహరణకి మేము కొంత మంది స్నేహితులం కలసి పిఠాపురం అనే దత్త క్షేత్రానికి వెళ్ళాము.
పిఠాపురం లో ఒక అమ్మవారి శక్తి పీఠం కూడా వుంది. మేము అక్కడికి వెళ్లి, మిగిలిన దేవతా మూర్తుల దర్శనం చేసుకొని, దత్తాత్రేయుని దగ్గరకి వెళ్ళేటప్పటికి ఆ మందిరం మూసేసే సమయం అయింది అని మూసేసారు.
ఆ దత్తాత్రేయుని దర్శనం మాకు అవ్వలేదు. మేము చాలా నిరాశ చెందాము. కానీ సాయిబాబా తనని నమ్మిన భక్తులని ఎప్పుడూ నిరుత్సాహ పరచడు అని ఋజువు చేస్తూ ఒక సంఘటన జరిగింది.
అక్కడ దత్తాత్రేయుని విగ్రహానికి వెండి తొడుగు చేయటానికి ఒక పనివాడు విగ్రహం కొలతలు తీసుకోవడానికి వచ్చాడు.
నిజానికి అది ఆలయం మూసేసే సమయం అయినా, అతనికోసం తెరిచారు. అక్కడ ఉన్న పూజారి గారు మీకోసమే సాయిబాబా అతన్ని పంపించారు, బాగా దర్శనం చేసుకోండి అని మమ్మల్ని ఆశీర్వదించారు.
మేము చాలా తృప్తిగా, ఆనందంగా దర్శనం చేసుకొని తిరిగి వచ్చాము. మన నిత్య జీవితంలో ఇలాంటి సంఘటనలు, నిదర్శనాలు శ్రీ సాయి భక్తులకు సర్వ సాధారణం.
మన దృష్టి అయన వైపు తిప్పాలే కానీ, అయన మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టడు అని నేను చాలా గాడంగా విశ్వసిస్తాను.
ఆ తరువాత కొంత కాలానికి మేము ఇల్లు మారటం జరిగింది. అంతకు ముందు లాగా ఆ ఇంటికి దగ్గరలో సాయిబాబా మందిరం లేదు
కానీ నిత్య పూజలు ద్వారా, గ్రంథ పారాయణం ద్వారా అయన ఉనికిని అనుభవిస్తూ వుండేదాన్ని. ఆ సంవత్సరం గురుపౌర్ణమికి అంతకు ముందులాగా మందిరంలోకి వెళ్ళటం కుదరలేదు.
నేను ఉదయాన్నే లేచి పూజ చేసుకొని TV లో శిరిడి నుంచి ప్రత్యక్ష ప్రసారం వస్తూంటే చూస్తూ కూర్చున్నాను.
ఇంతలో అనుకోకుండా మా దగ్గరి బంధువులు సాయిబాబా మందిరానికి వెళ్ళివస్తూ మార్గమద్యంలో వున్న మా ఇంటికి వచ్చారు.
వారు మందిరం నుంచి తెచ్చిన బాబా ప్రసాదం మాకిచ్చి, నేను పెట్టిన అల్పాహారం వారు తిని వెళ్లిపోయారు.
గురుపౌర్ణమి రోజున బాబాకి ఏమీ నైవేద్యం పెట్టలేకపోయాను అని చింత పడుతున్న నాకు, వారి ద్వారా ఉపశమనం కలిగించారు అని అర్థం అయింది.
ఇలాంటి నిదర్శనాలు మన జీవితంలో అడుగు అడుగునా అయన ప్రసాదిస్తూనే ఉంటారు.
మనం చేయాల్సిందల్లా అయన బోధనలు అర్థం తెలుసుకుని జీవితంలో ఆచరించడం మాత్రమే.
Latest Miracles:
- నేను బాబాకి హారతినిచ్చి చేసిన విన్నపాలు మాత్రమే మమ్మల్ని ఆపద(యాక్సిడెంట్)నుండి కాపాడాయి.
- బంధువులు అందరూ వదిలేశారు మమ్మల్ని.పిచ్చివాళ్ళ లాగ అయిపోయాము.
- ఇలా వచ్చి దక్షిణ స్వీకరించి, ఆశీర్వదించారు, బాబా కాక ఇంకెవరు బాబానే.–Audio
- దారి చూపిన దీన బాoధవుడు
- బాబా పూజల వల్లే వారికి బాగా ధన ప్రాప్తి వచ్చింది, అది మనం కూడా బాబాకి సేవ చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయని సేవ చేసాము.–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments