Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయక రాజాధి రాజ యోగిరాజ
పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి రామ్
సాయినాధుని కృప తన భక్తుల మీద ఎల్ల వేళలా కురుస్తూ వుంటుంది.
నేను ఎపుడు బాబాను పిలిచినా కానీ,బాబా నాకు సహాయం చేయడానికి వచ్చేవారు.
నేను ఏదైతే అసాధ్యం , ఇది అవ్వదు అనుకున్నానో అది బాబా చేసి చూపించారు.
అలాంటి ఘటనే ఇపుడు మీకు చెప్పబోతున్నాను. నా కూతురి కూతురు (అంటే నా మనవరాలు ) వంశికా 3 సంవత్సరాల వయస్సువున్నపుడు ఆమె ఒక కొడుకుకు జన్మనిచ్చింది.
ఇంట్లో అందరూ సంతోషంతో పండగ చేసుకుంటున్నారు.వాడికి “శ్యామ్” అని పేరు పెట్టాము.
వాడు పెద్దవాడు అవుతున్నాడు కానీ మాట్లాడలేదు.మూగవాడు, సైగలు చేసి అన్ని అర్ధం చేసుకునేవాడు.
ఇలాంటి పరిస్దితిలో వాడికి 2 సంవత్సరాలు వచ్చాయి .ఇంట్లో అందరూ బాధపడేవారు.
వీడికి మాటలు రావేమి అని చాలా ప్రయత్నాలు చేశాం.
ఇంక చివరికి బాబాపై భారం వేసాము .
మా ఇంటికి దగ్గరలోనే సాయిబాబా మందిరం ఉంది.
శ్యామ్(అంటే ఆ అబ్బాయి) మందిరంలో గంట మ్రోగితే మందిరంకు వెళ్దాం అని ఏడిచేవాడు.
అపుడు నుండి మేము షిర్డీ సాయిబాబా మందిరం వెళ్లడం,రావడం జరిగేది.
అంత చిన్నవాడు, తనంతకు తనే బాబాకు నమస్కారం పెట్టి,ప్రసాదం విభూది తీసుకుని వచ్చేవాడు.
నమస్కారం కూడా చేసేవాడు ఎవ్వరు చెప్పకుండా. గురువారం బాబాకు జరిగే పల్లకి యాత్ర చూస్తే సంతోష పడిపోయేవాడు .గంతులు వేసేవాడు.
ఇంక అన్ని బాబాకే తెలుసు, సైగలు చేసి బాబాతో ఏదో మాట్లాడేవారు.
అలాంటి సమయంలో “శ్యామ్” ఒక రోజు వాళ్ళ అమ్మతో షిర్డీ సాయిబాబా మందిరకు వెళ్ళాడు.
ఆశ్చర్యం ఆకస్మాతుగా శ్యామ్ నోట్లో నుంచి “సాయి” అని మాట వచ్చింది.
అప్పటి నుంచి వాడు మాట్లాడం మొదలుపెట్టాడు. నేను ఈ సంఘటన బాబా చమత్కారం అని నమ్ముతాను.
బాబా నాకున్న అన్ని కష్ట,సుఖలల్లో నాతో వున్నారు.
నన్ను అన్ని చింతల నుంచి ముక్తురాలని చేసారు.
అలాంటి సాయినాథుని చరణాలకు నా కోటి కోటి ప్రణామాలు
సద్గురు సాయి నాధార్పణమస్తు
ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ సాయిబాబా నివేదన శివనేశన్ స్వామికి భోజనమగుట.
- నా బ్యాగ్ తప్పిపోయింది అని తెలిసి నాకు కన్నీళ్లు వచ్చాయి బ్యాగ్ లో నా సర్టిఫికెట్స్ ఉన్నాయి.
- సద్గురుసాయి.
- మృత్యు ముఖం నుండి నన్ను కాపాడిన సమర్ధ సద్గురు సాయిబాబా-10
- బాబా ఆశీర్వాదంతో మంచి ఉద్యోగం లభించింది
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
4 comments on “సాయిబాబా అశేషకృప వలన అబ్బాయికి మాటలు వచ్చాయి”
kishore Babu
December 8, 2017 at 8:27 amఈ లీల చాల బాగుంది…భువనేశ్వర్ మాధవి గారికి చాల థాంక్స్….మా బాబు కూడా చిన్నప్పుడు ఎప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు అని చూసినప్పుడు …ఒకసారి…సాయి బాబా అని పలికాడు ఎవరు ఏమి చెప్పకుండా…అది ఎప్పటికి మరిచిపోలేని అనుభూతి.
GKALPANA
December 8, 2017 at 10:38 amandariki baba help chestrhunadu naku appudu help chesthadu plzzz baba help me
T.V.MADHAVI
December 8, 2017 at 9:06 amThank u kishore garu.This is babas work.I m very much blessed with this work. Thank u very much to give me a wondrafull work….SAI RAM.
Sreenivas
December 8, 2017 at 1:38 pmSai Baba…Sai Baba..Sai Baba