నా తోడుగా ఉండి – సప్త సముద్రాల అవతలున్న నన్ను కాపాడారు–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తురాలు: కిరణ్మయి

నివాసం: యూ.ఎస్.ఏ


This Audio Prepared by Mrs Lakshmi


సాయి బంధువులందరికి నమస్కారం. నా పేరు కిరణ్మయి. నేను బాబా భక్తురాలిని అని మీకు పరిచయం చేసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.

బాబా భక్తురాలిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ప్రస్తుతం అమెరికా (యూ.ఎస్.ఏ)లో ఉంటున్నాను.

నా జీవితం లో జరిగిన ఒక లీల ద్వారా బాబా ఎప్పుడు మనతోనే ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఆ లీలను మీతో పంచుకుంటున్నాను.

అది బాబానే నాతో మీ అందరికి చెప్పిస్తున్నారని భావిస్తున్నాను. నా పెళ్లి చూపులకి వచ్చినప్పుడు మా అత్తగారికి, మా ఆయనకు నేను నచ్చాను.

వాళ్ళు వచ్చే ముందు మా అత్త  బాబాకు చెప్పి, బాబా ఈ సంబంధం కుదరాలని, కుదిరితే “సచ్చరిత్ర” పారాయణం ఒక్క రోజులోనే చేస్తానని మొక్కుకున్నానని నాతో చెప్పి నన్ను కూడా పారాయణం చేయమన్నారు.

మా పెళ్లి జరిగిపోయింది. మా వారు అమెరికాలో ఉంటారు. నేను అక్కడకు వెళ్ళడానికి పాస్ పోర్ట్  విషయంలో కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా బాబా అన్ని సక్రమంగా చేసారు.

అమ్మ, నాన్నని, పుట్టి పెరిగిన దేశంను వదిలి వెళ్లేముందు బాబాకి చెప్పుకున్నాను.

బాబా అన్నీ వదిలి వెళ్తున్నా, నాకు తోడుగా, నీడగా ఉండి నన్నురక్షించు. నన్ను నువ్వే చూసుకో, ఇక నా భారం నీ మీదనే వేస్తున్నానని చెప్పి,  అమెరికాకు వెళ్ళాను.

బాబా దయవలన కొన్ని నెలలకు ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయింది.

అత్తా మరియు అమ్మ వాళ్ళు అందరు సంతోష పడ్డారు… కానీ ఇక్కడ తొమ్మిది నెలలు ఎలా గడుస్తాయి బాబా.

ఇక్కడ ఒక్కదాన్నే ఉండాలి. ఎవరు ఉండరు. నాకు అనారోగ్యాంగా ఉంటే ఎవరు చూసుకుంటారు

నన్ను అని మొరపెట్టుకున్నాను.

బాబా నా మొర ఆలకించారో ఏమో తొమ్మిది నెలలు ఎలా గడిచాయో తెలియలేదు. ఎలాంటి అనారోగ్యం లేకుండా బాబా నా పక్కన ఉండి నన్ను చూసుకుంటారన్న ధైర్యం. తొమ్మిది నెలలు నిండాయి.

డెలివరీ టైం వచ్చింది. హాస్పిటలుకు తీసుకువెళ్లారు. నాకునొప్పులు రావడం లేదు. డాక్టర్ C -SECTION  చేయాలి, ఆపరేషన్ చేయాలి తనకి నార్మల్ డెలివరీ అవదు అని చెప్పింది.

కానీ నేను బాబాకు చెప్పాను. బాబా ఆపరేషన్ అయితే నేను చేయించుకోలేను.

తరువాత అన్ని పనులు ఒక్కదానినే చేసుకోలేను. నార్మల్ డెలివరీ అయ్యేలా చూడు, నా పక్కన చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు అని ఏడ్చేసా.

డాక్టర్గారు ఆపరేషన్కు అన్ని సిద్ధం చేస్తున్నారు. రెండు గంటల తరువాత నాకు ఆపరేషన్ అని చెప్పి వెళ్లారు.

అద్భుతం, ఆశ్చర్యం బాబా మహిమ చూడండి. నాకు నొప్పులు మొదలయ్యాయి. నేను ఆ క్షణంలో కూడా బాబానే తలచుకున్నాను. నొప్పులు ఎక్కువయ్యాయి డాక్టర్లు ఆశ్చర్యపోయారు.

ఆమెకు నార్మల్ డెలివరీ అయ్యేలా ఉంది సిజేరియన్ అవసరం లేదని చెప్పారు.

ఒక గంటలోనే నార్మల్ డెలివరీ అయ్యింది. నాకు నొప్పులు వస్తున్నప్పుడు ఆ బాధ కూడా కలగకుండా ఒక గంటలోనే అన్ని జరిగిపోయాయి.

మగబిడ్డ ఆ బాబానే ఇచ్చారు. నాకు ఇంతకన్నా అద్భుతం ఇంకొకటి ఉండదేమో. నేను బ్రతుకుతున్న బ్రతుకు, అనుభవిస్తున్న ఈ జీవితం సాయిబాబా నాకు ఇచ్చిన బిక్ష. ఏమి ఇచ్చి నేను ఋణం తీర్చుకోగలను.

కేవలం “సచ్చరిత్ర” చదవడం వలన బాబా నాకోసం సప్త సముద్రాల అవతలున్నా నిన్ను కాపాడతాను అన్న మాటను నా ద్వారా రుజువు చేసారు.

ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    ~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

***సాయిసూక్తి:

నువ్వు నా వైపు ఒక అడుగు వేస్తే, నేను నీ వైపు పది అడుగులు వేస్తాను”.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles