సోదర ద్వయం …. మహనీయులు – 2020 – జనవరి 25



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి తన భక్తులను “సోదరా!” అని సంబోధించేవారు. సాయికి అందరూ సోదరుల వలే అనగా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలవలె కలసి మెలసి ఉండాలని కోరిక.

ఈజిప్టు నుండి హజ్రత్ యూసిఫ్ సాహెబ్, పాలస్తీనానుండి హజ్రత్ షరీఫ్ సాహెబ్ హజ్ యాత్రకు బయలుదేరారు. దారిలో వారిద్దరు కలుసుకున్నారు.

ఇద్దరకూ దివ్య ఖురాన్ అభిమాన గ్రంధం. వారికి షైక్ కరీముల్లా షాజహాబాదీ గురువైనాడు.

అయన ఉపదేశం పొందిన వీరు తమ దేశాలకు వెళ్ళకుండా, భారత దేశం వచ్చి, ఔరంగజేబు అశ్విక దళంలో చేరి మంచి పేరు తెచ్చుకున్నారు. దళనాయకులైనారు.

వారికి అంతో ఇంతో వైద్యం తెలుసు. అందరకూ ఉచితంగా వైద్యం చేసేవారు. ఔరంగజేబుతోపాటు గోల్కొండ కోట ముట్టడికి వచ్చిన సైన్యంలో వీరూ ఉన్నారు.

గోల్కొండను వశపరచుకొనుట వారికి సాధ్యంకాలేదు. ఔరంగజేబు స్వయంగా వచ్చాడు అక్కడకు.

ఆ సమయంలో మూసీ నదికి వరదలొచ్చాయి పైగా ఎడతెరపిలేని వర్షం. గుడారాలు కూలిపోయాయి. ఒకనాటి రాత్రి పర్యవేక్షణ చేస్తున్నాడు ఔరంగజేబు.

బయట అంతా వర్షం పడుతున్నా, గాలి వీస్తున్నా, దీపాలు ఆరిపోయినా, ఒకే ఒక్క గుడారంలో దీపం వెలుగుతొంది. అక్కడకు వచ్చి చూచాడు.

ఇరువురు వ్యక్తులు ఖురాన్ పఠనం చేస్తున్నారు, బాహ్య ప్రపంచంలో లేరు. వారు చాల పవిత్రులని, మహనీయులని తెలుసుకున్నాడు.

వారు బాహ్య స్మృతికి వచ్చిన తరువాత “మీరు మహనీయులు, నాకు సాయం చేయండి” అని వేడుకున్నాడు పాదుషా.

ఆ సోదర ద్వయం “సరే” అని గోల్కొండ కోటను కాపాడుతున్న ముస్లిం యోగిని అక్కడనుండి పంపివేశారు. ఇక గోల్కొండ కోట “మీ వశమైంది” అన్నారు ఆ సోదరులు. వెంటనే కోట వశమైంది.

పదోన్నతులు, బహుమతులు ఆశించని ఆ సోదరులు ఔరంగజేబు సైన్యం వెంట వెళ్ళకుండా నాంపల్లిలో స్థిర నివాసమేర్పరచుకున్నారు.

ఒకవైపు దివ్య ఖురాన్ పారాయణ చేస్తూ, మరోవైపు ఉచిత వైద్య సేవ చేసేవారు అన్ని మతాలవారికి. దైహిక రుగ్మతలను మందుల ద్వారా తొలగించి, మనశ్శాంతిని ప్రార్థనల ద్వారా ప్రసాదించేవారు.

వీరేకాక వీరి గుర్రాలు కూడా ఇతర పొలాల వంక చూడవు, ఇతరుల పొలాల్లో మేయవు.

ఒకసారి షరీఫ్ సాహెబ్ రోగులకు చికిత్స చేసేందుకు బయటకు వెళ్ళాడు. కొన్ని రోజులు గడిచాయి. ఆయన తిరిగివచ్చే ముందే యూసఫ్ సాహెబ్ తుది శ్వాస పీల్చాడు.

షరీఫ్ సాహెబ్ చింతాక్రాంతుడై, పరుండి, తెల్లని వస్త్రాన్ని కప్పుకుని దేహాన్ని విసర్జించాడు. ఆ దినం జనవరి 25, 1710.

షిరిడీలో సాయి ప్రవేశపెట్టిన ఉర్సువలె మత ప్రసక్తి లేకుండా ఆ సోదరులకు ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. ఆ సోదర ద్వయాన్ని ఆధ్యాత్మికతను, సేవా గుణాన్ని మనలో పెంపొందింపమని ప్రార్థిద్దాం.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles