సర్వే జనా సుఖినోభవంతు! …. మహనీయులు – 2020… మార్చి 18



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా వలె మహనీయులందరూ జాతీయ, అంతర్జాతీయ విఖ్యాతులుగా ఉండనక్కరలేదు. అంత మాత్రాన ఆ మహనీయులది తక్కువ స్థాయికాదు.

సాయిబాబా వద్దకు దర్వేషులు రోగంతో బాధపడుతున్న పులిని తీసుకువస్తారు.

దానికి అంతకు పూర్వము సాయితో అనుబంధము లేదు. సాయిని దర్శించిన క్షణమే కన్ను మూసింది.

సర్వేశ్వరానంద పర్యటనలో ఉన్నారు. ఆయనకు సేవచేస్తూ ఓకే ఆవు ఉండేది. ఆ గోవు చివరి దినాలు దగ్గరపడ్డాయి.

తన చివరి ఘడియలలో తానూ సేవించిన సర్వేశ్వరానందుని కన్నులార చూడాలని ఆ మూగజీవి తపన. అది ఎలుగెత్తి పిలవలేదు కదా!

అసలు పిలవనవసరం ఉందా? సర్వేశ్వరానందులు పర్యటనను రద్దుచేసుకుని ఆశ్రమానికి వచ్చి, ఆ గోమాతలకు ప్రదక్షిణలు చేసి, రుద్రాక్షతో దానిని స్పృశించి, దాని కన్నులలో కన్నులుపెట్టి చూడగా, దాని జీవము సర్వేశ్వరునిలో కలిసింది.

మూగజీవి కోర్కెను అలా తీర్చారు సర్వేశ్వరానందులు. ఈ సంఘటన రమణ మహర్షికి, శ్రీ లక్ష్మి అని పిలువబడే గోమాతకు ఉన్న బంధాన్ని మరోసారి గుర్తు చేస్తుంది.

సర్వేశ్వరానందగిరిగారి పూర్వనామం సాంబశివా రెడ్డి.

సన్యాసం తీసుకోవాలనే ఆకాంక్షతో తల్లిని అనుమతి అడగగా, ఆ తల్లి నా జన్మ రహస్యం, నీ వలన జరిగే లోక కళ్యాణం గూర్చి చెప్పమన్నది. అయన చెప్పాడు.

ఆమె సంతృప్తిచెంది అంగీకరించింది. ఎర్రమల కొండ గుహలో 13 నెలలు అక్షర లక్షలుగా గాయత్రీ మంత్రం జపించి, సిద్దులైనారు.

నిర్వికార నిర్గుణ రూపైన శ్రీరాజరాజేశ్వరిని ఉపాసించి, సాక్షాత్కారం పొందారు. ఆయనను బాలయోగి అనేవారు. అప్పటికి ఆయన వయస్సు 13 సంవత్సరాలే.

నారాయణపురంలో కటకం వచ్చి త్రాగుటకు నీరు, పశువులకు మేత లేకుంటే, ఆ గ్రామా ప్రజలు సర్వేశ్వరానందులను ఆశ్రయించారు.

ఆయన వర్షం కురిపించి, అక్షర జ్ఞానం లేని జానపదులను, తన దివ్య బోధలచే అంతర్ముఖులను చేసినారు.

ఒకచోట నాగుపాము పడగపై కప్ప నిర్భయంగా ఉన్న ప్రదేశం చూచి, ఆ స్థలమునే ఆశ్రమ స్థానంగా చేసుకున్నారు.

ఉమామహేశ్వరంలో పూజారులు సర్వేశ్వరానంద స్వామిని శివుని అభిషేకించటానికి గంగను ప్రవహింపచేస్తారా? అని అడిగారు.

అభిషేకము కోసం గంగను ప్రవహింపచేయుటయే గాక, శివపార్వతుల కళ్యాణం కోసం తాళిబొట్టును సృష్టించి ఇచ్చారు సర్వేశ్వరానందులు.

మహాపురుషులకు కావలసింది లోకకల్యాణం.

సర్వేశ్వరానందగిరి స్వామి మార్చి 18 (2003)న లోకేశ్వరునిలో లీనమైనారు.

సర్వేజనా సుఖినోభవంతు!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles