”మనం బాబా దగ్గరికి వెడుతున్నాము, ఆయన్నే కోరుకో నీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వాలని”



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా పేరు జ్యోత్స్న. మాది కర్నూలు. మేము వ్యవసాయం చేసేవారం. మాది వ్యవసాయం కుటుంబం  కాదు.

మా వారికి వ్యవసాయమంటే ఇష్టం. MBA  LLB చదువుకున్నారు. బాగా కష్ట పడి పొలం లో పనిచేసారు కానీ అంతగా లాభం ఉండేది కాదు.

లాభం సరిగా లేకపోవటాన, పిల్లల చదువుల కోసమూ అక్కడ వ్యవసాయం వదిలేసి హైదరాబాద్ చేరుకున్నాము.

ఇక్కడికి వచ్చాక ఉద్యోగ ప్రయత్నాలు  చాలా చేసారు కానీ ఎటువంటి ప్రయత్నాలు ఫలించలేదు.

ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారే కానీ మంచి ఉద్యోగం అంటూ రాలేదు.

మా వారు ఒక జ్యోతిష్కుడు దగ్గరికి వెళ్లి తన జాతకం చూపించుకున్నారు. ఎప్పుడు ఉద్యోగం వస్తుంది? వస్తుందా! రాదా! తెలుసుకుందామని.

ఆయన, ఈయన జాతకం మొత్తం పరిశీలించి కొంచెం గురు బలం తక్కువగా ఉంది. మీ కోరికలు ఫలించాలంటే గురు అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అందువలన మీరు తప్పనిసరిగా ఒక గురువును ఆశ్రయించండి అని చెప్పారట.

మా వారు అది విని మాకు దగ్గరలో అంటే నాలుగు KM దూరంలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్లి పూజ చేయించారు.

అప్పటి నుండి అప్పుడప్పుడు బాబా గుడికి వెడుతూ ఇప్పుడు ప్రతి గురువారం వెడుతున్నాం.

అలా బాబా తో మా పరిచయం. అంతకు ముందు మాకు బాబా ఎవరో తెలియదు. వెంకటేశ్వర స్వామి గుడికి, శివాలయానికి, ఆంజనేయస్వామి గుళ్ళకి వెడుతూ ఉండటం తప్ప మాకు బాబా తెలియదు.

ఆ తర్వాత మా వారికి ఉద్యోగం దొరికింది. నాలుగు సంవత్సరాలుగా మేము షిరిడి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాము.

మాకు ఎలా వెళ్లాలో కూడా తెలియదు. పిల్లలు కాస్త పెద్ద చదువులకి వచ్చాక ఒకళ్ళకి కుదిరితే, ఒకళ్ళకి కుదరక కొంత ఆలస్యం జరుగుతూ వచ్చింది.

ఈ సారి ఎలాగైనా వెళ్ళాలి అనుకుని మాతో కూడా ఎవరైనా వచ్చినా బావుంటుంది లేక తెలిసిన వాళ్ళు ఎలా వెళ్లాలో చెప్పినా ఫరవాలేదు అనుకున్నాము.

మా వారి ఆఫీస్ లోనే పని చేసే సాయి మల్లిఖార్జున ఇది వరకే చాలా సార్లు షిరిడి వెళ్లి ఉన్నాడని, అతను తరచు షిరిడి వెళ్తుంటాడని ఎవరో అన్నారు.

మా వారు అతన్ని కలిసి మేము షిరిడి వెడదాము అనుకుంటున్నాము.  ఎలా వెళ్ళాలి? ఎక్కడ దిగాలి? అక్కడ ఎలా ఉంటుంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారట.

అతను నేను త్వరలో వెళ్ళబోతున్నాను. మేము ఏడాదికి ఎంత లేదన్న ఎనిమిది పది సార్లు వెడుతుంటాం అని చెప్పాడు.

మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పండి అప్పుడు నేను మీతో వస్తాను. ఎప్పుడు రిజర్వేషన్ చేయించుకుంటారు అని అడిగారట. మా వారు డేట్స్ చెప్పారు.

శని ఆది వారాలు కలిసేటట్లు నాలుగు రోజులు అనుకున్నాము. అతను రిజర్వేషన్ చేయించారు. ఇంటికి వచ్చి ఫలానా తారీఖున మనం షిరిడి వెడుతున్నాము అని పిల్లలతో చెప్పారు మా వారు.

మా అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. వాడేం మాట్లాడలేదు. మా అమ్మాయి 9 th క్లాస్ చదువుతోంది.

ఒకటే గొడవ మొదలు పెట్టింది. ”ఆ తారీఖుల్లో అయితే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి” నాన్నా అంది. ఎగ్జామ్స్ అంటే యూనిట్ టెస్ట్ లు అదేం ఫరవాలేదు.

అంతే కాదు ఈ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రాకపోతే సెక్షన్ మార్చేస్తారు. ఆ సెక్షన్ లో బాగా చెప్పరు. బాగా చదవని వాళ్ళు ఆ సెక్షన్ లో ఉంటారు.

నాకేంటి నేను బాగా చదువుతాను. ఆ సెక్షన్ లోకి నేను వెళ్ళాను అంది. నువ్వు బాగానే చదువుతావు గా మళ్ళీ సారికి మంచి మార్కులు చూసి నిన్ను మళ్ళీ ముందు సెక్షన్ లోకి మారుస్తారు లేవే అంటే కాదు. ఒకసారి మార్చారంటే మళ్ళీ మళ్ళీ మార్చారు.

అంతే అలాగే ఉండి పోవాలి అంటూ పేచీ మొదలు పెట్టింది . నేను వచ్చి మీ టీచర్ తోటే మాట్లాడతాను. కానీ టికెట్స్ క్యాన్సిల్ మాత్రం చెయ్యను అన్నారాయన.

ఇంకా ప్రయాణం పది రోజులుంది. అది రోజూ స్కూల్ నుండి రావడం  పరీక్ష రాయకుండా అయితే టీచర్స్ ఒప్పుకోరు అమ్మ అంటూ పేచీ పెట్టడమూ, నేను మా వారికి చెప్పడము  ఆయన ససేమిరా ఆనడము జరుగుతూనే ఉంది.

దాని బాధ చూసి పోనీ మరోసారి వెళ్ళొచ్చుగా ఎందుకంత పంతం మీరు క్యాన్సిల్ చేయొచ్చుగా అంటూ నేను మా వారితో విసుక్కున్నాను.

ఆయనేమీ మాట్లాడకపోవడం ఇదేమో ఏడుపు నేను ఇంకా దీనితో అన్నాను ”మనం బాబా దగ్గరికి వెడుతున్నాము  ఆయన్నే కోరుకో నీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వాలని దండం పెట్టుకో ” అన్నాను దాన్ని ఊరడించడానికి.

మా అమ్మాయి నిజం గానే బాబా కి దండం పెట్టుకోవడం మొదలు పెట్టింది. రేపు ప్రయాణం అంటే కూడా  మా అమ్మాయి ఏడుస్తూనే ఉంది. నేను మా వారిని విసుక్కున్నాను.

తీరా బయలు దేరే సమయం రానే వచ్చింది. నేను మా అమ్మాయి అయిష్టం గానే బయలుదేరాము.

స్టేషన్ కి వెళ్ళాము. రైలు రెడీ గా ప్లాట్ ఫారం మీద ఉంది . అందులో మా వారు మా తోటి వచ్చిన వాళ్ళు మా పిల్లలు అంతా ఎక్కారు.

మాతో కూడా సాయి మల్లిఖార్జున అతని తో పాటు మరో అతను కూడా మా తోటే ప్రయాణం అయ్యారు.

అతను మేము కూడా షిరిడి కి మొదటి సారి వెళ్ళటం  నేను రైలు ఎక్కబోయాను. నేను కొత్త చోటుకి ప్రయాణం అవుతున్నాం కదా అని కొత్త చెప్పులు వేసుకొని బయలు దేరాను.

ఒక కాలి చెప్పు రైలుకి ప్లాట్ ఫారానికి మధ్యలో పడిపోయింది . మధ్యలో అంటే పూర్తిగా పడిపోలేదు మధ్యలో గట్టు లాగా ఉంది  దాని పైన పడిపోయింది.

మా వారు అది దొరకదు తీయడం కష్టం మరో చెప్పు కూడా వదిలేయి. రైలు వెళ్ళిపోయాక ఎవరైనా రెండు చెప్పులు తీసుకెళ్లి వాడుకుంటారు అన్నారు.

నాకు మనసు ఒప్పటం లేదు. ఇదేమిటి బాబా నిన్ను చూడాలని ఇన్ని రోజులకి బయలు దేరి వస్తుంటే ఇలా జరుగుతుందేంటి. ఏమిటీ పరీక్ష అనుకున్నాను.

ఇంకా బయలు దేరడానికి సమయం ఉంది. ఇంతలో చిప్స్ పాకెట్స్ ఒక పెద్ద కవరులో పోసుకొని 16 , 17 సంవత్సరాలు ఉంటాయి అతను ఆ భోగి ఎక్కాడు.

అతన్ని చూస్తూనే నాకు అతను సాయం చేస్తాడని అనిపించింది. అతను చూడడానికి అమ్ముకునే వాడి లాగా లేడు. అయినా నేను బాబూ రైలు కి ప్లాట్ ఫారానికి మధ్యలో చెప్పు కాస్త పడిపోయింది చూస్తావా బాబూ అన్నాను.

అతను రైల్లో నుంచి తొంగి చూసాడు. అందులో దిగడానికి ప్రయత్నిచాడు. మా వారేమో ఎవరో ఏమిటో పాపం ఈ లోగా రైలు కదిలి పోయిందంటే ఆ అబ్బాయి ఇరుక్కుపోయి ఉండిపోతాడు.

చెప్పుల కోసం ఇంత రిస్క్ అవసరమా అని తిడుతున్నారు. అతనికి తీయడం వీలు కాలేదు. మళ్ళీ భోగీ లోకి వచ్చి అమ్మా ఈ బ్యాగ్ చూస్తూండు నేను ఇప్పుడే వస్తాను అంటూ రివ్వున పక్క ప్లాట్ ఫారానికి దూక్కుంటూ వెళ్ళిపోయాడు.

ఎంత స్పీడ్ గా వెళ్ళాడో అంతా స్పీడ్ గాను తిరిగి ఒక కర్రతో వచ్చాడు. ఆ కర్రను ఉపయోగించి ఒక్క ఉదుటన నా చెప్పు బయటికి లాగాడు.

అమ్మా ఇదిగోనమ్మా అంటూ ఆ చెప్పు నా ముందు ఉంచాడు. మా వారు అప్పటికే నాకు వాడు తీస్తే పాపం వాడికి 50 రూపాయలు ఇమ్మనమని చెప్పాడు.

నేను పర్స్ లో నుంచి డబ్బులు తీసాను ఇద్దామని ఉండు బాబూ ఇదిగో అంటూ ఇవ్వబోయాను. నాకు డబ్బులు వద్దమ్మా నేను అలాంటి వాడ్ని కాదు.

నాకు డబ్బులు వద్దు అంటూ వెళ్ళిపోయాడు. అసలు చిప్స్ అమ్ముకునే వాడే అయితే వాడు అంత పుష్టి గా, అందంగా ఉండడు. అమ్ముకునే వాడు డబ్బులిస్తే వద్దు అనడు.

అమ్ముకోటానికి వచ్చిన వాడు ఈ బోగీ లో కూడా అమ్మాలి గా అవేమీ అతను చేయలేదు సరికదా అతని రూపం వర్చస్సు చాలా తేజోవంతంగా ఉంది.

నేను షిరిడీ రావడానికి మా అమ్మాయి మూలంగా విసుక్కుంటున్నానుగా అందుకని నేను ఉన్నాను మీ అందర్నీ కాపాడటానికి అంటూ తానే చెప్పు అందులో పడేటట్టు చేసి తానే వచ్చి అది బయటికి తీసి నాకో అద్భుతం అక్కడ చూపించాడు.

నాకు చాలా అద్భుతం అనిపించింది. మరు నాటికి మేము షిరిడీ చేరాము.

మేము వెళ్లే నాటికి షిరిడీ లో మాకు సాయి మల్లిఖార్జున వాళ్ళ పెద్దమ్మ , పెదనాన్న మరియు (మరో జంట) వారి స్నేహితులు లక్ష్మి మరియు నరసింహారావు గారు  (గ్రంథ కర్తలు) మాకు అక్కడ కలిశారు.

అందరు ఒకర్ని ఒకరు పరిచయం చేసుకున్నాము. ఆ రోజు మేము శని సింగణాపురం వెళ్ళాము తిరిగి వచ్చి సాయంత్రము బాబా దర్శనం చేసుకున్నాము.

మరునాడు అందరమూ 9 మంది కలిసి ఒక వ్యాన్ మాట్లాడుకొని జామ్నెరు వెళ్ళాము ఇది 31 – 7 – 2016 న జరిగింది.

నిజంగా మా తొలిసారి ప్రయాణం గుర్తుండి పోయేటట్టు అయింది. మాకు లక్ష్మి నరసింహారావు గారు అక్కడ షిరిడీ లో కలిశారు.

వాళ్ళు గత పది సంవత్సరాలు గా ఏడాదికి 2/3 సార్లు షిరిడీ వస్తున్నారే కానీ ఏనాడూ షిరిడీ దాటి మరో ఊరు చూడలేదు.

అక్కడే పారాయణ దర్శనం, హారతులు చేసుకుంటూ ఉండేవారట . అలాంటిది మా తోటి కలిసాక జామ్నెరు వెడదామని ఉమామహేశ్వర రావు అంకుల్ అనగానే వాళ్ళు బయలుదేరారు.

మాకైతే దాని గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే నేను సచ్చరిత్ర పారాయణ చేసి ఉండలేదు.

బయలు దేరాము, బయలు దేరే ముందే అందరికి భోజనాలకి ఇబ్బంది లేకుండా ఉండాలని ఉమా మహేశ్వర రావు గారు హేమ గారు కర్రీస్ రూము లోనే ప్రిపేర్ చేసి తీసుకొని బయలు దేరాము.

భద్ర మారుతీ, మినీ తాజ్ మహల్, ఘృషణేశ్వర్ చూసుకొని టిఫిన్స్ చేసి జామ్నెరు బయలుదేరాము.

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles