Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్
మహారాజ్ కి జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-167-1012-కేశవ్ భగవాన్ గావన్ కర్--6 4:08
డా.కేశవ్ భగవాన్ గావన్ కర్ గారు 79 సంవత్సరాల వయసులో, పవిత్రమయిన ఆషాఢ శుధ్ధ ఏకాదశి, జూన్ 29, 1985 వ.సం.శనివారమునాడు ప్రశాంతంగా మరణించారు.
సాయిబాబా గారు దర్శనమిచ్చిన ఆ పవిత్ర గృహంలో ఆయన తుది శ్వాసతీసుకున్నారు. అన్నా సాహెబ్ గారు తన ఆఖరి గంటలనులెక్కించుకుంటున్నారు. డా.అర్గికర్ ఎమ్.డి. ఆయనను పరీక్షించడానికి వచ్చారు.
అపుడాయన వైద్యునితో ఇలా అన్నారు , “డాక్టర్ (అర్గికర్) నేను సప్త లోకాలను చూడగలుగుతున్నాను.
నాబీజ మంత్రాన్ని జపించుకోమని, పురాణాలలోని కధలను జ్ణప్తికి తెచ్చుకోమని చెబుతున్నారు. సాయిబాబా నాకోసం ఒక భవంతిని నిర్మిస్తున్నారు. అది నాకు కనపడుతోంది…”.
సాయంత్రం ఆయన ఇలా అన్నారు’ “చూడండి, పండరీపూర్యాత్రీకులందరూ అక్కడ నిరీక్షిస్తూ ఉన్నారు.
వారికి భోజన ఏర్పాట్లు చేయండి. మీ దగ్గర డబ్బు లేకపోతే నా వద్దనుంచి తీసుకోండి. వచ్చే గురు పౌర్ణమికి చాలినంత బియ్యాన్ని నిలవ చేసి ఉంచండి.
నా భవంతి తయారుగా ఉంది—“ ఈ విధంగా మాట్లాడుతూ అన్నా సాహెబ్ సాయిబాబా పాదాల వద్ద ఆఖరి శ్వాసతీసుకున్నారు. వందలాది మంది భక్తులు ఆయనను కడసారిదర్శించుకుని తమ గురువుగారికి శ్రధ్ధాంజలి ఘటించారు.
అన్నాసాహెబ్ తో బాబా “నేనెప్పుడూ నీవెంటే ఉంటాను. నువ్వుజీవితాంతం వరకు ఫకీరుగానే ఉన్నా, నీ కుమారులు తమ జీవితంలో అభివృధ్ధిలోకి వస్తారు” అన్నారు.
ఆ తరువాతి సంవత్సరాలలో కీ.శే. గోవింద రఘునాధ్ ధబోల్కర్ అనబడే హేమాద్ పంత్ మనుమడయిన సాయి మహాభక్త్ దేవ్ బాబా అనబడే అనంత్ ప్రభు వలవల్ కర్, డా.సాయినాధ్ కేశవ్ భగవాన్ గావన్ కర్ గారి కుటుంబానికి షిరిడీ సాయిబాబా యే వారి ఆధ్యాత్మిక గురువని చెప్పి , ఆ మార్గంలో వారు పయనించేలా వారికిమార్గదర్శకులయ్యారు.
డా.సాయినాధ్ కేశవ్ గావన్ కర్ గారు తన పెద్దన్నగారయిన ప్రమోద్గావన్ కర్ (డా.కేశవ్ భగవాన్ గావన్ కర్ గారి పెద్ద కుమారుడు) ఇచ్చిన సలహా ప్రకారం తన కుటుంబ సభ్యులు ఇంకా మరికొంతమంది సేవాతత్పరులయిన సాయి భక్తులతో కలిసి 1991 లో“డా.అన్నా సాహెబ్ గావన్ కర్ సాయి సేవా ట్రస్ట్, ముంబాయి” అనేపేరుతో ఒక పబ్లిక్ రిజిస్టర్డ్ ట్రస్టును ఏర్పాటు చేశారు.
ఆ ట్రస్టు భజన సంధ్య, అన్నదానాలు, ఇంకా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను కోజగిరి పూర్ణిమ నాడు షిరిడీలో నిర్వహిస్తూ ఉంది. ములంది(ఈస్ట్) ముంబాయిలో ఉన్న ఈ ట్రస్టు వ్యవహారాలన్నిటినీ మరొక అన్నగారు శ్రీ మోరేశ్వర్ గావన్ కర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు.
1931 వరకు కోజగిరి పూర్ణిమను కాకా మహాజని , డా.యశ్వంత్గావన్ కర్ గారు నిర్వహిస్తూ వచ్చారు.
1931 లో కోజగిరిపూర్ణిమను నిర్వహించే బాద్యతను వారు శాశ్వతంగా, డా.కేశవ్భగవంత్ గావన్ కర్ గారికి అప్పగించారు.
అప్పటినుండి శ్రీ సాయిబాబా సంస్థాన్ వారి సహాయ సహకారాలతో ఆ ఉత్సవాన్నిగావన్ కర్ గారి కుటుంబం వారు నిర్వహిస్తున్నారు.
వారి తాత ముత్తాతల రెండతస్తుల భవనం ‘ఇందిరా నివాస్’ దాదాపువంద సంవత్సరాల పూర్వ కాలం నాటిది. ఇపుడది బొంబాయికిఈశాన్యంగా ఉన్న కుర్లా శివారులో ప్రధాన రోడ్డు ప్రక్కన ఉంది.
ఈభవనం లోనే సాయిబాబా వారు వారి కుటుంబ సభ్యులందరికీ తమదర్శన భాగ్యాన్ని కలిగించారు.
వారి వారసత్వ సంపదైన ఈ ఇందిరానివాస్ ను మూడు సంవత్సరాలలో తిరిగి పునర్వికాసం కలిగించేప్రణాళికను చేపట్టారు.
చిరునామాః
నెం. 158, ఇందిరా నివాస్,
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గిర,
లాల్ బహదూర్ శాస్త్రి మార్గ్,
కుర్లా వెస్ట్, ముంబాయి – 400 070
డా.సాయినాధ్ కె. గావన్ కర్ గారి సతీమణి శ్రీమతి అస్మితాసాయినాధ్ గావన్ కర్. వారికి ఒకే ఒక కుమారుడు డా.ద్యానేష్గావన్ కర్. ఆయన ముంబాయిలో జనరల్ సర్జన్ గా పని చేస్తు ముంబాయి కుర్లాలో ఉన్న తమ ఇంటిలో ప్రశాంతంగా జీవిస్తున్నారు.
డా..కేశవ్ భగవాన్ గావన్ కర్ గారి కుమారుడు డా.సాయినాధ్గావన్ కర్ గారి చిరునామ
డా.సాయినాధ్ కేశవ్ గావన్ కర్
402, సన్నీ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ,
ఎల్.బి.ఎస్.మార్గ్, కుర్లా
ముంబాయి – 400 070
2226508830, 9819817587
dnyaneshgawankar81@gmail.com
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!!
http://telugublogofshirdisai.blogspot.co.ke/2016/04/blog-post_30.html ద్వార సేకరించడం జరిగింది.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- రా, లేచి నా కధలను వ్రాయడం ప్రారంభించు–కేశవ్ భగవాన్ గావన్ కర్-5–Audio
- బాబా అతని మొహం మీద చాలా గట్టిగా ఒక్క చరుపు చరిచారు–కేశవ్ భగవాన్ గావన్ కర్-4–Audio
- కేశవ్ మెల్ల మెల్లగా పూర్తిగా కోలుకున్నాడు–కేశవ్ భగవాన్ గావన్ కర్-2–Audio
- స్వామి శరణానంద నాల్గవ భాగం
- పేరు మార్పు – అంతే …..సాయి@366 జూలై 25…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments