Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
1980 సంవత్సరంలో అమర్ నాథ్ యాత్రకి వెళ్ళాలనుకున్నాము. అప్పటికి మేము ఇంకా షిరిడి వెళ్ళలేదు, వెళ్ళాలనుకున్నాము.
అమరనాథ్ యాత్రకి వెళ్ళాలంటే కొన్ని నిబంధనలున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి 1000 మందిని మాత్రమే పంపిస్తారు. ఆ వెయ్యి మందిని కూడా ఊరికే పంపించేయరు. మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి.
జమ్మూ కాశ్మిర్ బ్యాంక్ ఒకటి ఉంది. ఆ బ్యాంకులో ఈ యాత్రకి వెళ్ళేవాళ్ళకి ఫారాలు ఇస్తారు.
ఆ ఫారాలు పూర్తిగా నింపి ఇస్తే, వాళ్ళకి కావాల్సిన కాగితాలన్నీ వాళ్ళు అడిగి తీసుకుని అన్ని సరిపోతే వాళ్ళు అవి తీసుకొని మనకు ఒక కార్డు ఇస్తారు.
కార్డు మనం అమరనాథ్ యాత్రకి వెళ్ళటానికి అర్హత కార్డు అన్నమాట. నేను ఆ బ్యాంకుకు వెళ్ళి అడిగాను. వాళ్ళు ఆ ఫారాలు అప్పుడే ఇవ్వరు ఇంకా సమయం పడుతుంది అని చెప్పారు.
అక్కడ సెక్యూరిటీకి ఒక పదిరూపాలిచ్చి, నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి ఇక్కడ ఫారాలు ఇచ్చేప్పుడు నాకు ఫోన్ చేయమన్నాను.
అతను నాకు ఎన్ని రోజులైనా ఫోన్ చేయలేదు. నేనే మళ్ళీ ఆ బ్యాంకుకి వెళ్ళి అడిగాను. రేపు సోమవారం నాడు ఇస్తారు అని చెప్పారు.
నేను వెళ్ళింది శుక్రవారంనాడు, సరేనని సోమవారం ఉదయాన్నే వెళ్ళి ఫారాలు కావాలని అడిగాను. ఫారాలు లేవు, నిన్ననే ఇచ్చేసాం అన్నారు.
”అదేమిటి? ఇవాళ కదా ఇస్తామన్నారు, నిన్ననే ఇచ్చేశారా” అని అనుకుంటూ ఉంటే ఎక్కడనుంచో ఒకాయన వచ్చి ”నా దగ్గర ఒక ఫామ్ ఉంది” అన్నాడు.
”సరే ఇమ్మ” న్నాను, ఆయన ఇచ్చాడు, మాకు మొత్తం మూడు ఫారాలు కావాలి. ఒకటి నాకు, రెండవది మా ఆవిడకి, మూడవది నా కూతురికి.
నేను బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ బాబా లాకెట్ ఉన్న పూసల గొలుసు మేడలో వేసుకోవడం అలవాటు. ఆ రోజు కూడా అలాగే గొలుసు వేసుకున్నాను.
ఎంతమంది యాత్రకి వెళితే అంతమంది అక్కడ ఉండాలన్నారు. అందుకని ముగ్గురం వెళ్ళాము.
అక్కడ ఒక xerox shop ఉంది . ఉదయం 6 గంటలకి వెళ్ళడం వల్ల అది మూసి ఉంది. అక్కడ ఒక అతన్ని అడిగాను, అతను షాప్ ఎప్పుడు తీస్తారని, అతను ఆ షాప్ ఉదయం 9 గంటలకి తీస్తారని చెప్పాడు.
నేను అతను ఎక్కడ ఉంటాడని అడిగాను. ఎవరో అడ్రెస్ చెప్పారు. నేను బయటికి వెళ్లి ఒక ఆటో మాట్లాడుకుని ఆ షాప్ అతని ఇంటికి వెళ్లి అతన్ని బ్రతిమాలి నాతో తీసుకువచ్చాను, షాప్ తీయించాను.
నా దగ్గర ఉన్న ఫామ్ లని పది కాపీలు xerox తీయించాను. మేము ముగ్గురం అప్లికేషన్ పూర్తి చేసాము. అందులో ఫొటోస్ కూడా కావాలని ఉంది. మేము ఫొటోస్ తీసుకువెళ్ళలేదు.
బయట కంప్యూటర్ ఫోటోలు తీస్తున్నారని తెలిసి బయటకు వెళ్ళబోతున్నాము. అక్కడ నన్ను అటకాయించారు. ఎన్ని సార్లు బయటికి పోతావు. లోపలి వస్తావు అంటూ.
నేను ”బాబా ఏమి చేస్తావో నాకు తెలియదు. ఈ రోజు ఈ అప్లికేషన్స్ ఆఫీస్ లోకి వెళ్లి పోవాలి” అని అనుకున్నాను.
”అరె మీరు బాబా లాకెట్ వేసుకున్నారే అయితే వెళ్ళండి అంటూ అడ్డు తప్పుకున్నాడు.” మేము వెంటనే ఫొటోస్ తీయించుకున్నాము.
తీరా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలన్నారు. ఇప్పటికప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ ఎక్కడి నుండి వస్తాడు. ఏం చేయాలి ? అని అనుకుంటూ ఉండగానే,
నా దగ్గరికి ఒకాయన వచ్చి ”అప్లికేషన్స్ ఉన్నాయా?” అని అడిగాడు. ఆ ఉన్నాయి, కాని “గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలట, వాణ్ణి ఎక్కడినుండి తెస్తాము” అన్నాను.
”అయ్యా! నేను గెజిటెడ్ ఆఫీసర్ నే” అన్నాడు. ఆయన చేత సంతకం పెట్టించు కొని, స్టాంప్ కూడా ఆయన దగ్గర ఉంది, వేయించుకున్నాం.
నా దగ్గర మిగిలిన అప్లికేషన్స్ ఆయనికి ఇచ్చేసాను. అప్లికేషన్స్ ఇవ్వడానికి అందరూ లైన్ లో నిలుచున్నారు. అందరూ నెట్టుకుంటున్నారు.
ఆ నెట్టుకోవడంలో నేను వెళ్లి గేట్లో పడ్డాను. ఈ గొడవలోకి పోలీసులు వచ్చి లైన్ ని సెట్ చేసారు.
”ఇంత జనం ఏంటి బాబా? మా అప్లికేషన్స్ నువ్వే ఎలాగైనా ఆఫీసుకు చేర్చాలి” అని అనుకోగానే,
ఎక్కడినుండో ఒకాయన వచ్చి నా మెడలో బాబా లాకెట్ చూసి దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకుని నువ్వు ఇక్కడఉన్నావేంటి? రా అంటూ తిన్నగా కౌంటర్ దగ్గరికి తీసుకుపోయి తనే మా ముగ్గురి అప్లికేషన్స్ కౌంటర్లో పెట్టి వాళ్ళ చేత కార్డ్స్ ఇప్పించేసాడు.
The above miracle has been typed by Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- బాబాని నమ్ముకుంటే మనం ఆశించినదానికన్నా ఎక్కువే ప్రసాదిస్తారు
- రూమ్ లో మొత్తం దీపాలు మధ్యలో బాబా కూర్చొని ఉన్నారు.
- బాబాని ప్రార్ధించు కష్టం తీరిపోతుంది
- ఏ డాక్టర్ దగ్గరా లేని, ఏ డాక్టర్లు ఇవ్వలేని ఔషధం నా దగ్గర ఉంది. అదే బాబా ఊది.
- బాబాని నమ్మి చెడిన వాడు లేడు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments