Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా తన చివరి ఘట్టాన్ని ద్వారకామాయిలో, అంటే షిరిడీలోనే సమాప్తి చేశాడు.
దత్తావతారుడైన నరసింహ సరస్వతి శ్రీశైల సమీపంలోని కదళీవనాన్ని ఎన్నుకున్నారు. అక్కమహాదేవి కూడా శ్రీశైలంలోని కదళీ వనంలో గల జ్యోతిర్లింగంలో ఐక్యమైంది.
గోదాదేవి బాల్యంనుండి శ్రీరంగనాథుని ఎలా ఎంచుకున్నదో అలాగే అక్క మహాదేవి చెన్న మల్లేశ్వరునే పతిగా స్వీకరించింది.
ఆ దేశపు రాజు కౌశికుడు అక్కమహాదేవిని పట్టపురాణిగా చేసుకోదలచాడు. అందుకు అంగీకరించకపోతే ఆమె తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేయసాగాడు.
పరమశివ చెన్న మల్లీశ్వరునిపై భారము వేసి, తల్లిదండ్రుల ప్రాణ రక్షణకై, ఆమె కొన్ని షరతులను విధించింది కౌశికునికి.
అందులో ఒకటి తన అంగీకారములేనిదే తాకరాదన్నది. ఈ షరతును ఉల్లంఘించిన, ఆమె రాజభవనం నుండి వెడలిపోవును.
ఒకనాడు నియమభంగమగుటచే, వస్త్రములను సైతము త్యజించి రాజభవనమునుండి విశాల ప్రపంచములో అడుగిడినది.
ఆమె అంబరములు ధరింపకున్నను కేశములు ఆమె శరీరమును కప్పెడివి. ఆమె దిగంబరి కాదు, కేశాంబరి.
ఆమె శైవ సంప్రదాయమునకు ముఖ్య కేంద్రమైన కళ్యాణి నగర ప్రవేశం చేయబోతొంది. ప్రభుదేవుడు శైవులందరికి ఆదర్శపాత్రుడు, పెద్దకూడా.
ఆయన అక్కమహాదేవి సచ్చరితను అందరికీ తెలియచేయవలెనని, తన శిష్యుడైన కిన్నెర బొమ్మయ్యను పంపుతాడు.
కిన్నెర బొమ్మయ్య తాను చేయునది మహాపరాధమని తెలిసియు, ఆమెను తాకాడు.
“చెన్నమల్లికార్జునుడు గాక తక్కిన మగవారు అన్నలు నాకు” అంది. పశ్చాత్తాపము చెంది అతడు అక్కడనే సాష్టాంగ ప్రణామం చేస్తాడు.
ఆమె అఖండ వైరాగ్యమును చూచి బసవేశ్వరుడు, చెన్న బసవన్న, నీలాంబిక మొదలగు వారు సంతసించారు. అందరును కలసి ప్రభుదేవుని అనుభవ మంటపమునకు పోయారు.
“చీరను విడిచి కేశముల మరుగేందుకు? ” అని ప్రభుదేవుడు, కావాలని ప్రశ్నించాడు.
“ఇతరులకు కామ భావము కలుగకుండునట్లు చేసినాను” అని అక్కమహాదేవి బదులిచ్చింది.
ఆమె యందుగల వైరాగ్య తేజస్సు చూచి ‘అక్క’ అనసాగిరి. ఆ అనుభవ మంటపమునందు క్షణ క్షణము శివజ్ఞాన చర్చయే.
ఆమె అనేక వచనాలను చెప్పినది. అవి తిరుప్పావైవంటివని భావిస్తారు.
ఆమె చెన్నమల్లికార్జునియందు లీనమగుటకు పోవుచుండ శరణులు, శరణురాండ్రు దుఃఖము నాపుకొనజాలరైతిరి.
కదళీవనము నందామె స్వయం లింగమయ్యేను. సామాన్యంగా ఏప్రియల్ లో వచ్చే శుద్ధ పూర్ణిమ అక్కమహాదేవి జయంతిగా జరుపుతారు.
ఆమె ప్రార్థనలోని ఒక చరణాన్ని స్మరిద్దాం!
“చెన్న మల్లికార్జునా! నన్ను మాయనుండి
తప్పించుము, కరుణించుము…”
“ఆలింపుము నా విన్నపము ఎలా నామొరను వినవయ్యా తండ్రీ!”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- మధ్యముడు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 22
- వారసత్వం …. మహనీయులు – 2020… సెప్టెంబరు 22
- రామ స్మరణం …. మహనీయులు – 2020… అక్టోబరు 22
- సజీవ సమాధి…. మహనీయులు – 2020… ఆగస్టు 22
- ప్రసాదం – దర్శనం మహనీయులు – 2020… జూలై 22
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments