బాబా భోదామృతం (శ్రీసంత కథామృతం 57వ అధ్యాయం) పదకుండవ భాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

నిన్నటి తరువాయి భాగం….

రెండవ సాధన –వైరాగ్యం ”ఇహ పర సుఖాల యందు ఏ కోరికా లేనట్టి వారే నిజంగా విరాగులు.

శమం, దమం తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానాలను జ్ఞానులు శమదమాది షట్ సంవత్తని అంటారు. ఇది మూడవది. శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలనే పంచ విషయాలనుండి మనసును నిగ్రహించడం శమం. ఇలా నిగ్రహించినా, విషయ వాసనలు మాసిపోకుండా మనసును బలీయంగా చుట్టుకునే ఉంటాయి. వానిని అదుపులో ఉంచుకోవటం లేదా తొలగించుకోవటం దమం.

తమ తమ ప్రారబ్ద కర్మానుసారం ప్రాప్తించిన దుఃఖానికి అక్రోశించకుండా సహించటమే తితీక్ష. మనసు కాంత కనకాలలో, భార్య బిడ్డలలో, బంధువులలో చిక్కుకుని పోకుండా ఈ ప్రపంచమంతా మాయాజాలం, వట్టి మిధ్య అని నిర్ధారణ చేసుకోవటం ఉపరతి. మనసు గురువు యెడల విశ్వాసంతో ఉండటం శ్రద్ధ. ఆరవది సమాధానం. అంటే సుఖదుఖాలను సమానంగా భావించటం. మనసులో ఏ కొంచమైనా తపన, ఆవేదన లేకపోవటం, చిత్తం నిశ్చలంగా పర్వతంలా స్థిరంగా ఉండటం.

ముముక్షుత్వం అంటే జననమరణాల బంధనం నుండి విముక్తి చెందాలని మనసులో బలీయమైన దృఢమైన మోక్ష కాంక్ష ఉండి, తదితర విషయాలను అసహ్యిన్చుకోవడం. అపరోక్ష జ్ఞానానికి మార్గాన్ని అన్వేషించే వాడు ముముక్షువు. ముముక్షుత్వానికి యోగ్యత అనివార్యం అవసరం.

మోక్షమంటే వైకుంఠమనుకునేవు సుమా! కాదు. మోక్షమంటే కైలాస పురం కూడా కాదు. ఈ మోక్షానికి మార్గం చాలా కఠినమైనది. ఈ విశ్వానికంతా ఆది కారణమైన శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యం చెందటాన్ని మోక్షమని అంటారు. అట్టి శాశ్వతమైన మోక్షాన్ని అనేకరకాల ప్రయత్నాలతో సాధించటమే పురుషుని పురుషార్ధం. మోక్షం తప్ప మిగతా అంతా మిధ్య” అని సాయి భోదించారు.

వారి ప్రవచనాన్ని విన్న నానా చేతులు జోడించుకుని మరల “బాబా! జగత్తుకు ఆధారమై, చరచరాలలో వ్యాపించి ఉండి, చివర జగత్తునంతా తనలో లయం చేసుకునే ఆ శుద్ధ చైతన్యం ఎలా ఉంటుంది” అని ప్రశ్నిచారు.

అందుకు బాబా “మూల కారణమైన పరమాత్మ తత్త్వమే శుద్ధ చైతన్యం. కనిపించే ఈ జగత్తంతా కేవలం భాస మాత్రమే. చైతన్యం ఇది అని, ఇలా ఉంటుందని నిశ్చయంగా చెప్పలేం. కాని చైతన్యం ఉన్నట్లు గా అనుక్షణం సాక్ష్యం లభిస్తుంది. అనుభవం కలుగుతుంది. జగత్తులో చైతన్యం వ్యాపించని స్థానమంటూ ఎక్కడా లేదు. ఎంత వెదకినా చైతన్యం లేని ఒక వస్తువైనా లభించదు.

నిర్దేశించి చెప్పటానికి చైతన్యమని అంటారే కాని దానికసలు నామ రూపాలేవి ఉండవు. వాయువుకు రంగు రూపాలు ఎట్లా ఉండవో, అట్లే చైతాన్యానికి కూడా అవి ఉండవని తెలుసుకో. ఆ శుద్ధ చైతన్యాన్ని పరబ్రహ్మ అని అంటారు. జ్ఞానులు ఆ బ్రహ్మను ఉపాసిస్తారు. ఇట్టి ఉపాసకులను బ్రహ్మవేత్తలు అంటారు.

వృక్షకోటి, ప్రాణి కోటి, జీవ కోటిం, జంతు కోటే అన్నీ ఈ చైతన్యం పొట్టలోనే ఉంటాయి. ఈ సకల దృశ్య జగత్తుకంతా ఆది కారణం ఈ ఒక్క చైతన్య్హమే. ఇది సర్వ వ్యాపకం, క్లేశరహితం మరియు సత్య జ్ఞానానంద రూపం. మనమందరం కూడా దానికంటే భిన్నంగా లేము.” అని తెలియచేసారు.

అప్పుడు నానా “సద్గురు నాధా! సర్వ వ్యాపక బ్రహ్మ క్లేశరహితమని, ఆనందరూపమని, ఆ బ్రహ్మే అన్ని ప్రదేశాలలో వ్యాపించి ఉన్నాడని, అన్ని పాత్రలలో నటిస్తున్నాడని అంటున్నారు కదా. ఇక్కడ నాకో సందేహం. దాన్ని నివృత్తి చేయండి దేవా! జగమంతా క్లేశ యుక్తం. అట్లే అనంతం. చైతన్య గుణాలు దానిలో అనుభవం కావు.

పుట్టుగ్రుడ్డి సృష్టి లావణ్యాన్ని ఎలా చూడగలడు? సత్యమైన చైతన్యం మిధ్యా జగత్తులో ఎలా ఉండగలదు? ఆత్మయే చైతన్యమనుకుంటే ఆత్మ అంతటా ఒక్కటే అన్నది పొరపాటు. ఆత్మ అనేకం. అన్యోన్యంగా ఉన్నవారికైనా తమ తమ ఆత్మల యొక్క సుఖదుఖాల అనుభవాలు పరస్పరం కలగటం లేదు. అలాంటప్పుడు అందరిలో ఉన్నది ఒకే ఆత్మ, ఒకే చైతన్యమని ఎలా అనగలం? శరీరాలు భిన్న భిన్నంగా ఉన్నట్లే ఆత్మ కూడా విభిన్నంగా ఉండాలి కదా! ఆత్మ చైతన్యం కంటే వేరు ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకు?

ఇంకా ఉంది…

source: దాసగణు గారి రచన  శ్రీసంత కథామృతం 57వ అధ్యాయం

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles