Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా సర్వ మతములను ఆదరించాడు. ఏ ఒక్క మతాన్ని తిరస్కరించ లేదు. అంటే అన్ని మతాలవారు సహనంతో జీవించాలని సాయి తన జీవితమంతా తెల్పటానికి ప్రయత్నించాడు.
సాయిబాబా వద్దకు బడే బాబా అనే ముస్లిం వస్తుండే వాడు. ఆ బడే బాబా ఒక హిందువును మహమ్మదీయ మతంలోనికి మార్చాడు.
ఆ వ్యక్తికి ఇబ్రహీం అనే పేరు పెట్టాడు. సాయి వద్దకు ఇబ్రహీంను తెచ్చి విషయం చెప్పాడు.
సాయి ఇబ్రహీం చెంపపై కొట్టి ”నీ తండ్రిని మార్చు కున్నావా?” అని అడిగాడు. ఈ సంఘటనతో సాయి మత మార్పిడిని ఖండించారని తెలుస్తుంది.
వామన్ ప్రాణ్ గోవింద్ పటేల్ మొదటిసారిగా షిరిడీకి వచ్చాడు. వామన్కు కాంతిలాల్ అనే స్నేహితుడుండే వాడు.
వామన్కు, కాంతిలాల్కు చక్కటి అందమైన బైబిల్ గ్రంథాలను క్రైస్తవ మిషనరీ బహుకరించింది.
ఆ సమయంలో. మిషనరీ వాళ్ళు కాంతిలాల్ను వలలో వేసి మతం మార్పిడి చేశారు.
ఈ సంగతి వామన్ ప్రాణ్ గోవిందకు షిరిడీలో ఉండగానే తెలిసింది. షిరిడీ నుండి వెళ్ళిన తరువాత కాంతిలాల్ను కలిశాడు వామన్.
”ఏం చూసి నీవు బాప్టిజం స్వీకరించావు? స్వధర్మంలో ఏ లోపం కనిపించింది? అలాగే వారి క్రిస్టియన్ ధర్మంలో ఎక్కువ ఏం కనిపించింది?” అని వామన్ ప్రశ్నించాడు. ఇంకా..
శ్రేయాన్ స్వధర్మో నిగుణః పర ధర్మాత్స్వనుష్టితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పర ధర్మో భయావహః భగవద్గీత 3 అ – 35 శ్లో.
భావార్థం: మంచి పద్ధతులతో ఆచరణలోనికి తీసుకు వచ్చిన పర ధర్మం కన్నా గుణము లేనిదైననూ మన ధర్మం అత్యంత ఉన్నత మైనది. స్వధర్మంలో మరణం సంభవించిననూ మేలే.
ఇతరుల ధర్మం భయానక మైనది. ఆచరణకు అనుచితమైనది. ఇలాంటి మతమార్పిడికి విరుద్ధం అని కూడా వామన్ చెప్పాడు కాంతిలాల్తో.
కాంతిలాల్ ”మన ధర్మంలో ఇలాంటి గ్రంథం ఉందని నాకు తెలియదు” అన్నాడు.
వామన్కు పరిస్థితి అర్థమైంది. యువకులకు కృష్ణుడు ప్రసాదించిన భగవద్గీతలాంటి అమూల్యమైన గ్రంథాలను గూర్చి తెలియకపోవటం వలననే వేరే దారి తొక్కుతున్నారు అనిపించింది.
ఈ విషయాన్నే సాయి వామన్కు తెలిపారు. జూలై 17, 1959నాడు (అస్తిత్వ విషయాలలో) భగవద్గీతలోని కొన్ని మౌలిక సిద్ధాంతాలను యువకులకు తెలియచేస్తే వారి అజ్ఞానం నశిస్తుందని సాయి తన అంతరీక్ష వాణి ద్వారా ”పార్ధా” అని సంబోధించి గూఢంగా తెలిపినట్లు గ్రహించాడు.
గీతా తత్వాన్ని అందరికి అర్థమయ్యేలాగా తెలపాలి.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- అదా కారణం!…..సాయి@366 ఆగస్టు 1…Audio
- వామన్ శశి ఇస్లాంపూర్ కర్…..సాయి@366 జూన్ 3….Audio
- కూలీ రెండు రూపాయలు ….. సాయి@366 మార్చి 15…Audio
- బాబాకి నేనిచ్చిన దానికన్నా పదుల, వందల రెట్లు దక్షిణ ఇచ్చిన వారెందరో వున్నారు–Audio
- వామన్ తాత్యా
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments