Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయ పడతాను.
15 -10 -1918 బాబా మహా సమాధి చెందిన తరువాత కలిగిన భక్తుల స్వానుభవాలు. (సాయిభక్తులైన శ్రీ శివనేసన్ స్వామి వారి ప్రేరణతో సాయి భకులైన శ్రీ రామలింగం స్వామి ఆంగ్లంలో వ్రాసిన “EMBRASIA IN SHIRDI ” అను గ్రంధము నుండి గ్రహింపబడినది.
నా పేరు సోమరాజు, నివాసము: బెంగుళూరు
నేను సైన్యంలో ఉద్యోగం చేస్తూ పదవి విరమణ చేశాను. 1940 వ సంవత్సరం నుండి బాబా భక్తుడిగా వున్నాను. నాకు 10 మంది సంతానము. వారిలో ముగ్గురు పిల్లలు ఒకే కాన్పులో జన్మించారు. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా వున్నారు.
నా దగ్గర బాబా యొక్క చిన్న ఫోటో ఒకటి ఉండెను. నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ఫోటోను పూజించే వాడిని.
1941 లో నేను శెలవుపెట్టి జబల్ పూర్ నుండి బెంగుళూరుకి మా ఇంటికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు విజయవాడలో రైల్వేస్టేషనులో శ్రీ బి.వి.నరసింహస్వామి గారిని కలిశాను.
అయన వచ్చి నా ప్రక్కన కూర్చున్నారు. వారు బాబా గురించి మాట్లాడారు. తరువాత నన్ను ఆశీర్వదించి నాకు ఒక అణా నాణేమును ఇచ్చి పూజలో పెట్టుకొని రోజూ పూజించమన్నారు.
బెంగుళూరు చేరుకొని మా అమ్మానాన్నలతో నరసింహస్వామి గారిని కలిసిన విషయము చెప్పి, జరిగినదంతా చెప్పాను, మరియు మా అమ్మతో బాబాను పూజించమని వేడుకున్నాను.
తరువాత ఒకరోజు సాయంత్రం నేను సినిమాకు వెళ్ళాను. అప్పుడు 7 గం : సమయంలో ఒక సాధువు మా ఇంటి వాకిట్లోకి వచ్చారట.
అప్పుడు జోరున వర్షము కురుస్తుండినది. ఆ సాధువు తెల్లటి వస్త్రములను ధరించివున్నారట. బాబావలె తలకి గుడ్డ చుట్టుకొని వున్నారట.
ఆయన మా వాకిట ముందు నిలబడి పెద్దగా “ఎవరూ బయటికి రావద్దు, ఇక్కడ నల్లత్రాచు వుంది అని అన్నారట”.
అప్పుడు మా అమ్మ ఆయనను అనుకోకుండా ‘బాబా’ అని సంభోదించి అది అక్కడ ఏమిచేస్తోంది అని అడిగిందట.
మా అమ్మ ఆయనను బాబా అని ఎందుకు సంబోధించిందంటే ఆయన వస్త్రధారణ బాబాలాగే వుందికనుక.
అప్పుడు ఆయన “వాకిలి బయట పాము పడగవిప్పి వుంది. తొందరగా వెళ్ళిపోతుంది. అప్పటి దాకా ఎవరూ బయటకు రావద్దు” అని అన్నారట.
వారి గొంతు విని మా ప్రక్క ఇంటి అయన వాళ్ళ వాకిలి తలుపు తీసుకొని బయటకు వచ్చాడట. ఆయన కూడా పడగ విప్పిన పామును చూశాడట.
బాబా పాముకు పాలు పోయామని మా అమ్మకు చెప్పారట. మా అమ్మపాలు పోస్తే తాగి వెళ్ళిపోయింది.
మా అమ్మ ఆ సాధువును ఇంట్లోకి రమ్మని ప్రార్ధించింది. కానీ ఆయన రాలేదు.
మా అమ్మని కొంచెం అన్నం పెట్టామన్నారు. అన్నం తిన్న తర్వాత కొంచెం డబ్బులు అడిగారు.
మా చిన్నచెల్లలు వెంటనే లోపలి వెళ్లి ఐదురూపాయలు తెచ్చి ఇచ్చింది.
ఆ తరువాత ఆయన చుట్టుకోవడానికి ఒక గోతం అడిగారు.
మా అమ్మ, మా నాన్నతో ఒక గోతం ఇవ్వమని చెప్పింది. మా నాన్న ఒప్పుకోలేదు.
అప్పుడు ఆ సాధువు “పూజ గదిలో యాబై గోతాలున్నాయి. అందులో ఒకటి నాకు ఇవ్వవచ్చు కదా? అని అన్నారట.
అందుకు మా అమ్మ నాన్న ఈనాకెలా తెలుసనీ ఆశ్చర్యపడ్డారట.
మా నాన్న ఒక గోతం ఇచ్చారట. ఆయన బయట రాయి మీద కూర్చొని చుట్టతాగి, పిడికెడు భస్మాన్ని ఆ రాయి మీద పోశాడట. తరువాత “నేను మరలా ఇంకొకరోజు వస్తానని” వెళ్లారట.
మా చిన్న చెల్లలు వెనుకనే రోడ్డు చివరిదాకా వెళ్ళి వచ్చిందట.
నేను, నా సోదరి, నా సోదరుడు సినిమా చూసుకొని ఇంటికి వచ్చేసరికి జోరున వర్షం వచ్చుచున్నది.
వాకిలంతా నీటితో నిండిపోయినది. మా అమ్మ సాధువు వచ్చిన విషయం మరియు జరిగినదంతా చెప్పింది.
మేము ముగ్గురం రాయి వద్దకు వెళ్ళి భస్మం ఉందోలేదోనని చూశాము. చాలా ఆశ్చర్యం.
అంత వానలో కూడా ఆ భస్మం కొట్టుకుపొకుండా, తడవకుండా, పొడిపొడిగా అలాగే వుంది.
మా నాన్న గారు ఒక పోలీసు ఆఫీసర్ అయినప్పటికీ, సాధువును బాబాగా నమ్మారు.
అయన చేసిన లీలకు చాలా ఆశ్చర్యపడ్డారు. అప్పటి నుండి సాయిబాబాను పూజించసాగారు.
బాబా తన భక్తులకు విశ్వాసం కలగచేయడానికి చేసిన లీలే కదా ఇది.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయ పడతాను.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- పాము కాటునుండి బాబా వారు కాపాడుట.
- భక్తురాలు నైవేద్యం గా పెట్టిన కిచిడి, దక్షిణను మారు రూపంలో వచ్చి స్వీకరించిన బాబా వారు
- బాబా ఏదో రూపంలో తమ ఇంటికి వస్తారు అని భావించిన భక్తుల నమ్మకాన్ని నిలబెట్టిన బాబా వారు
- మా ఇంటిలో జ్యోతి (పూజ) పెట్టించుకోమని వేరే భక్తురాలి రూపంలో వచ్చి చెప్పిన బాబా వారు….
- ఆటోవాని రూపంలో వచ్చి భక్తున్ని భోపాల్ గ్యాస్ దుర్ఘటన నుండి కాపాడిన బాబా వారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “సాధు రూపంలో బాబా వారు వచ్చి పాము బారినుండి కాపాడుట”
kishore Babu
September 10, 2017 at 11:16 amSai Baba…Sai Baba…Sai Baba.