బాబాగారు నానుంచి థన్యవాదములు తీసుకునుట



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

బాబాగారు నానుంచి థన్యవాదములు తీసుకునుట

బాబా చరిత్రలో మనకు, ఎవరన్న దక్షిణ పంపినప్పుడు మర్చిపోతే, అడిగి తీసుకునే వారని మనకు తెలుసు. అలాగే నానుంచి నేను చెప్పమన్న థన్యవాదములు తీసుకున్న లీల గురించి మీకు వివరిస్తాను.

మనము యెప్ప్పుడూ సాయి నామ జపం చేస్తూ ఉండాలి. మనలని ఎప్పుడూ కాపాడేది అదే. సవకల సర్వావస్తలలోనూ ఆ నామ జపం వల్ల బాబా గారు మనలని రక్షించడానికి సిథ్థంగా ఉంటారు. యెందుకంటే ఆపద సమయాలలో కూడా అప్రయత్నంగా మన నోటి వెంట బాబా అని మనం అనగానే మనలని ప్రమాదపు అంచుల నుండి బయటపడేస్తారు.

ఇటువంటి విషయాలన్నిటిని కూడా సాయి బంధువులమైన మనము,  ప్రతివారం సత్సంగములలో చర్చించుకుంటూ ఉండాలి. యెక్కడయితే సత్సంగము జరుగుతూ ఉంటుందో అక్కడ బాబాగారు వచ్చి కూర్చుంటారు.

మేము సత్సంగ సభ్యులందరమూ ప్రతి శనివారం సా.4 గంటలనుంచి సాయత్రము 6 గంటల వరకు సత్సంగము చేస్తూ ఉంటాము.  ఒకసారి మేము సత్సంగము చేస్తూ కనులు మూసుకుని నామజపం 108 సార్లు చేస్తూ ఉన్నాము. ఆ సమయంలో ఒక భక్తురాలికి శ్రీమతి భేబీ సరోజిని గారికి బాబా గారు వచ్చి కూర్చునట్లుగా కనిపించింది. ఈమేకు బాబా గారు అంతకుముందు కొన్నాళ్ళ క్రితం కలలో కనపడి రొట్టెలు అడిగారు. అప్పటినుంచి ఆమె వారి ఇంటికి దగ్గరలో ఉన్న బాబా గారికి ప్రతిరోజు రాత్రి రొట్టెలు ఇస్తూ ఉంటారు.

మా సత్సంగ సభ్యులమందరమూ కూడా ప్రతి సంవత్సరము షిరిడీ వెడుతు ఉంటాము. రెండు సార్లు నేను వారితో వెళ్ళడం కుదరలేదు. ఒక సంవత్సరము నవంబరు 10 తారికున మేమందరము షిరిడి ప్రయణం పెట్టుకున్నాము. నేను, నా భార్య కూడా షిరిడీ ప్రయాణానికి వారితో పాటుగా రిజర్వ్ చేయించుకున్నాము.

కాని అనుకోకుండా కొన్ని పరిస్థితులు బాబా గారే కల్పించడం వల్ల మా మనవడి బారసాల విజయవాడ వద్ద నున్న పల్లెటూరిలో జరిగిన తరువాత మా ఊరు నరసాపురం వెడదామనుకున్నము. కాని, తిరుగు ప్రయాణంలో విజయవాడలో ఆగి, నరసాపురం వెళ్ళవలసిన వారం వెంటనె హైదరాబాదు వెళ్ళడం జరిగింది. అక్కడే నాకు హార్ట్ ప్రోబ్లం బయటపడి నవంబరు 2 న ఆపరేషన్ జరిగింది.

10 తారికున నేను డిస్చార్జ్ అయ్యి మా పెద్ద అక్కగారి ఇంటికి వచ్చాను. సరిగా ఆ రోజు మా సత్సంగము వారందరూ షిరిడీ వెడుతున్నారు. ఆరోజు రైలు స.4.30 కి సికింద్రాబాద్ వస్తుందని తెలుసును కాబట్టి మాసత్సంగము ప్రారంభించిన శ్రీమతి మీనాక్షి గారికి షిరిడీలో బాబా గారికి నా ధన్యవాదములు తెలుపమని ఫోను చేసి చెప్పాను. ఆమె, నా క్షేమ సమాచారములు అడిగి అలాగే చెపుతానని చెప్పారు.

వారందరూ షిరిడీ వెళ్ళాగానే, బాబా గారి దర్శనానికి వెళ్ళారు. సామాన్యంగా మనకి యెప్పుడు గుడిలోకి వెళ్ళగానే ఆసన్నిథిలో మిగతా విషయాలు యేమీ గుర్తుకు రావు. అలాగే మీనాక్షి గారు కూడా బాబా  గారికి నేను థన్యవాదములు చెప్పిన విషయం మరిచిపోయారుట.

ఆమె కనులు మూసుకుని బాబా గారి సమాథి వద్ద నమస్కారము చేస్తున్నప్పుడు, ఆమె మనొనేత్రం ముందు, మా సత్సంగ సభ్యులువున్న వరుసలో మొదట నేను నుంచుని వున్నట్లుగా కనిపించానట. అప్పుడు ఆమెకు నేను చెప్పమన్న విషయం గుర్తుకువచ్చి బాబా గారికి నా థన్యవాదములు చెప్పినారట.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles