భక్తి చాలు – సిద్ధులు వద్దు…..సాయి@366 సెప్టెంబర్ 12…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


ఒకసారి రామకృష్ణ పరమహంసను ఆయన మేనల్లుడు అమ్మ వద్ద ఏవైనా సిద్ధులు కోరుకొమ్మని సలహా ఇచ్చాడు. అమ్మను అడిగాడు.

అమ్మ వెంటనే నాకు ఒక దృశ్యాన్ని చూపించింది. వేశ్య ఒకతె వచ్చి నా వైపు వీపు త్రిప్పి పాదాలపై భారం మోపి గొంతుకు కూర్చుంది.

వయస్సు సమారు 40 సంవత్సరాలు ఉంటుంది. ఆ వేశ్య మల విసర్జన చేయసాగింది. సిద్ధులు ఆ వేశ్య మలం లాంటివని నాకు వెల్లడి  చేసింది అన్నారు రామకృష్ణులు.

సాయి సాహిత్యంలో సిద్ధులు కనిపిస్తాయి అక్కడక్కడా. ఆ రోజు సెప్టెంబరు 12, 1912. అప్పుడే రామచంద్ర ఆత్మారాం తర్కడ్‌  తన మిల్లు నుండి వచ్చాడు.

చల్లటి నీటితో స్నానం చేశాడు. ప్రాణాయామం చేయటం మొదలు పెట్టాడు. గులాబీ రంగు కాంతి కన్పించింది. అది ఎంతసేపటికి తొలగి పోవటం లేదు.

లేచి మరల ముఖం కడుక్కుని వచ్చి ప్రాణాయామం ప్రారంభించాడు. మరల గులాబీ రంగు కాంతి కన్పించింది. అది ముదురు ఎరుపు రంగుగా మారింది.

ఆ దృశ్యం అలానే ఉండి పోయింది తన దృష్టిని ఆ కాంతి మీద కేంద్రీకరించాడు. ఒక నివాసము (గృహము) దగ్ధమగుచున్నది. నిశితంగా పరిశీలించాడు.

అది తాను పని చేసే మిల్లులోని భాగమే. వెంటనే లేచి ”భగవాన్‌, నేను నీ దర్శనం కోసం ప్రాణాయామం చేస్తున్నాను. ఇటువంటి  సిద్ధుల కోసం కాదు. ఇప్పటి నుండి ప్రాణాయామం మానివేస్తున్నాను” అని నిశ్చయించుకున్నాడు.

అప్పుడే మిల్లు నుండి ఒక వ్యక్తి వచ్చి, మిల్లుకు నిప్పు అంటుకుందని చెప్పాడు.

భక్తి మార్గంలో గాని, యోగ మార్గంలో గాని ఏ మార్గంలో నైనా కోరని సిద్ధులు కలుగుతాయి.

ఆ సిద్ధుల వలలో పడితే గమ్యం చేరటమనేది ఉండదని రామచంద్ర ఆత్మారాం విజ్ఞుడు గనుక గ్రహించాడు.

కొంత కాలమైంది. షిరిడీ వెళ్ళాడు. సాయి చరణాలపై తన శిరస్సు ఉంచాడు.

తర్కడ్‌ సిద్ధుల అనుభవాన్ని సాయికి చెప్పలేదు. సాయిబాబా ”ఆ రండ (సిద్ధులు) నిన్ను వదలి పెట్టటం లేదు కదూ. కానీ మనకు అటువంటి రండ (సిద్ధులతో) పనిలేదు”.

అంటే సిద్ధులు వేశ్యల వంటివి. వాటితో (వేశ్యలతో) ముద్దులాట తగదు అని సాయి భావము.

తాను తీసుకున్న నిర్ణయాన్ని అంటే సిద్ధులను సాధించకపోవటాన్ని సాయి బాబా కూడా సమర్ధించాడని తెలిసి సంతోషపడ్డాడు.

భక్తి మార్గంలో అకస్మాత్తుగా తారసపడే లేదా అబ్బే సిద్ధుల వంక చూడరాదు. సిద్ధుల వెంటపడితే అగాధంలో కూరుకు పోయినట్టే.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “భక్తి చాలు – సిద్ధులు వద్దు…..సాయి@366 సెప్టెంబర్ 12…Audio

v karuna

Sai evvaranna navaguruvaram vratham chesina vallu vunte video ni Telugu lo update cheyyamani cheppandi books lo Pooja vidhamn chala padhthi ga cheyyali ani echaaru

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles