Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా పఠింపుమని తెల్పిన ఏకనాథ భాగవతంలో శ్రీకృష్ణుడు ”భక్తులు నా భజన చేస్తున్నప్పుడు, సిద్ధులు తప్పకుండా ఉత్పన్నమవుతాయి. అవి విఘ్నకారకాలు అయినందు వల్ల వాటిని విసర్జించాలి”అంటాడు.
ఇంకా ”జన్మ, ఔషధాలు, మంత్రం, తపస్సు ఇత్యాదికాలతో కూడా సిద్ధులు ప్రాప్తిస్తాయి” అంటాడు. ఏరకంగా సిద్ధులు కలిగినా వాటిని ముందు వెనకలు చూడకుండా త్యజించాలి.
గురువు వద్ద కృష్ణాజీ యోగ విద్యను అభ్యసించాడు. ఆసనాలు, ప్రాణాయామం, కుండలిని శక్తిని మేల్కొల్పుట మొదలైన విద్యలన్నీ నేర్చుకున్నాడు. అయినా తృప్తి చెందలేదు.
మారణం, ఉచ్ఛాటనం, వశీకరణం మొదలైన విద్యలెన్నో తెలుపుమని గురువును కోరాడు. గురువు గారు అయిష్టంగానే అవన్నీ నేర్పారు.
కృష్ణాజీ తనను అభినందించిన వారికి మంత్రాలు చదివి మిఠాయిలు సృష్టించి ఇచ్చేవాడు. తన మంత్ర సిద్ధికి దక్షగా చేతికి ఇనుప కడియాన్ని ధరించేవాడు.
ఇక తన గురువు హిమాలయాలకు పోతూ, శిష్యుణ్ణి సాయి వద్దకు పొమ్మన్నారు.
కృష్ణాజీ సాయినాథుని వద్దకు పోగా ఆ ఇనుప కడియాన్ని తీసివేసి వేయాలని, మంత్ర విద్యా ప్రయోగం ద్వారా పేడలు మొదలైనవి తెప్పించటం మానాలని అన్నారు. కృష్ణాజీ ఇనుప కడియాన్ని పగులగొట్టాడు.
కృష్ణాజీ గురుభక్తికి సాయి సంతసించాడు. తనను (సాయిని) తలచగానే ఊది అతని హస్తములయందు వచ్చునట్లు దీవించాడు సాయి.
కృష్ణాజీని కుశాభావ్ అంటారు. ఆయన తన భక్తుల ఒత్తిడికి లొంగి మంత్ర శక్తులను సద్వినియోగం చేయవలసి వచ్చేది.
రాజ్‌మచికర్ అను వ్యక్తి మనుమడిపై క్షుద్ర శక్తి ప్రయోగం జరిగింది. రాజ్‌మచికర్ కుశాభావ్ వద్దకు వచ్చాడు.
దుష్టశక్తి ప్రభావం వలన శరీరంపైన, గుడ్డలపైన తెల్లని మచ్చలు ప్రతి శనివారం వచ్చేవి. కుశాభావ్ ఆ దుష్ట ప్రయోగాన్ని నిష్పలం చేసే మంత్రాలు చదివి, దత్తాత్రేయుని పూజ నిర్వహించి ఆరతి ఇచ్చాడు.
తరువాత శనివారం అంటే 18 జూలై, 1936న మచ్చలు రాలేదు. ఆ దుష్ట శక్తులను మంత్ర బలంతో తిప్పికొట్టాడు కుశాభావ్.
ఇది సాయికి ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఫిుంచటం కాదు. తనకు కాకుండ ఇతరుల ప్రయోజనానికి చేసే ప్రక్రియను సాయి కాదనడు!
ఎందుకంటే నిరపేక్షకుడైన వాడి ప్రాంగణంలో సర్వ సిద్ధులు కష్టపడి పని చేస్తుంటాయి.
నిరపేక్షకుడి పాద ధూళికి కూడా సిద్ధులు ఎప్పుడూ శిరసా వందనం చేస్తాయి అంటుంది ఏకనాథ భాగవతం.
అట్టి నిరపేక్షత మనకు అలవడు గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- భక్తి చాలు – సిద్ధులు వద్దు…..సాయి@366 సెప్టెంబర్ 12…Audio
- షిరిడీలో ప్రథమ గురుపూర్ణిమ…..సాయి@366 జూలై 3…..Audio
- ద్వారకామాయి నుండి ఊదీ….. సాయి@366 ఫిబ్రవరి 19….Audio
- “నేను అమ్మను…”… మహనీయులు – 2020… జూలై 21
- సరిగ్గా నెలకే!…..సాయి@366 నవంబర్ 15….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments