Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
ఆ రోజు మార్చి 10, 1911వ సంవత్సరం.
ఇంకా భిక్షకు బయలుదేరని సాయి ఉన్నట్టుండి కోపోద్రిక్తులై తన కఫ్నీని పైకెత్తి చూపుతూ ”ఏం చూడాలి, నేను ఒక ఫకీరును. నా వద్ద ముందర … వెనుక … ఉన్నాయి” అన్నారు. అలా ఎందుకన్నారో ఎవరూ గ్రహించలేకపోయారు.
సాయి నిద్రించే చావడికి కర్టిస్ సాహెబ్ (ఆ రోజులలో మధ్య భారత కమిషనర్), వారి భార్య శ్రీమతి కర్టిస్, మెక్లీన్ సాహెబ్ (నేటివ్ అసిస్టెంట్) మొదలైన వారు వచ్చారు.
వారు వస్తున్నట్లు ముందుగా సమాచారం లేదు. షిరిడీ లో ఏమైనా రాజకీయాలు జరుగుతున్నాయా అని తెలుసుకోవటానికి వచ్చినట్లున్నది వారు అంటారు నీలకంఠరావు.
జోగ్లేకర్ ఆ ఆంగ్లేయుల వెంట వచ్చాడు. నీలకంఠరావు కూ డా వారితో ఉన్నాడు.
వారు వచ్చిన సమయానికి బాబా ముఖం కడుగుకుంటున్నారు. ఆ తరువాత మామూలుగా భిక్షకు బయలు దేరాడు.
బాబా చావడి ముందుకు రాగానే శ్రీమతి కర్టిస్ చావడి నుండి దిగి వచ్చి బాబాకు గౌరవపూర్వకంగా వారి సాంప్రదాయం ప్రకారం చేతులు జోడించి ”మీతో మాట్లాడాలి ” అని అన్నది.
అంటే ఆమె సాయి వద్ద తన హోదాను చూపుకోలేదు. సాయి ”అర్ధ గంట ఆగు” అన్నారు.
ఆమె అలానే నిరీక్షించింది. బాబా భిక్ష పూర్తిచేసుకుని తిరిగి వెళ్ళబోతున్న సమయంలో మరల వచ్చి అడిగింది. ”ఒక్క గంట ఆగు” అని సాయి మరల చెప్పారు. అది సాయి బాబా అల్పాహారం తీసుకునే సమయం.
గమనించవలసిన విషయం ఏమిటంటే, పై రెండు సందర్భాలలోనూ, తనతో మాట్లాడటానికి అధికారులు వచ్చినారని పొంగిపోలేదు, రోజు వారి దిన చర్యను తరువాత పూర్తి చేయవచ్చని వాయిదా వేయలేదు సాయి.
కానీ ఆ వచ్చిన వారికి సమయం ఎక్కువ లేదు. అందువలన వారు సాయిని కలవకుండానే వెళ్ళిపోయారు.
జోగ్లేకర్ రూ.2/-, మెక్లెన్ రూ.5/-, కర్టిస్ దక్షిణగా సాయికి సమర్పింపుమని నీలకంఠరావుకు ఇచ్చారు. సాయి ఆ దక్షిణను మొదట నిరాకరించినా తరువాత తీసుకుని అక్కడున్న ఒక పేద వానికి ఇచ్చారు.
షిరిడీలో ఏం లభిస్తుంది, ఎలా లభ్యం చేసుకోవాలో నీలకంఠరావు ఆ కర్టిస్ దంపతులకు లేఖ ద్వారా (సాయిబాబా అనుమతితో) తెలియచేశాడు.
నీలకంఠరావును సాయి ఆశీర్వదించాడు.
🙏🙏🙏🙏ఏది ఏమైనా షిరిడీ ప్రవేశము, సాయినాథుని దర్శనము శుభప్రదములే!🙏🙏🙏🙏
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- కర్టిస్
- ప్రసాద ప్రాప్తి!…..సాయి@366 ఏప్రిల్ 3…..Audio
- ద్వారకామాయిలో బాలకృష్ణుడు…..సాయి@366 నవంబర్ 10….Audio
- కల్యాణస్థలి …..సాయి@366 మార్చి 21….Audio
- నాథపంచకములో సాయినాథుడు…..సాయి@366 మార్చి 26….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments