Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా షిరిడీకి రావటమే కళ్యాణంలో తాను పాల్గొనటానికి. లోక కళ్యాణం కోసం ఆయన షిరిడీని కళ్యాణస్థలి చేశాడు. షిరిడీలో సాయి భక్తుల వివాహాలెన్నో జరిగాయి.
కోటీశ్వరుడు బుట్టి వివాహం ఇక్కడే జరిగింది.
భక్తుల ఇండ్లలో కళ్యాణాలు జరుగుతున్నప్పుడు, సాయిని ఆహ్వానించటం, బాబా తాను వెళ్ళక పోయినా గాని చివరకు ఊదినైనా ప్రసాదంగా పంపటం చేసేవారు.
ఇక సాయి మహాసమాధి తర్వాత పరిస్థితి ఏమీ మారలేదు. అది నేటికి కళ్యాణస్థలియే.
అదీ గాక అన్నవరము, తిరుపతి, సింహాచలము మొదలగు క్షేత్రముల వలె నిచ్చట గూడ కళ్యాణములు భక్తులు జరుపుటకు వసతులున్నవి.
సిక్కిం రాష్ట్రానికి చెందిన భాయ్ రత్నాభాయ్ కాంట్రాక్టరు కుమారుడు జంషెడ్జీ కూడా కాంట్రాక్టరే.
వీరు పార్శీ మతమునకు చెందిన వారు. జంషడ్జీకి వచ్చిన ఆలోచన ప్రకారము కళ్యాణప్రద కార్యములకు అన్ని వసతులతో ఒక పెద్ద భవంతిని ఆయన నిర్మింప చేసినాడు షిరిడీలో.
అది తన మాతృదేవి జ్ఞాపకార్ధము నిర్మాణము చేసిన ఉత్తముడు. దాని పేరే ”శ్రీ సాయి మంగళ కార్యాలయము”. శ్రీ సాయి మంగళ కార్యాలయమునకు 21 మార్చి, 1971న ప్రారంభోత్సవము జరిపారు. అప్పుడే అది రెండు లక్షల రూపాయల వ్యయముతో నిర్మితమైన కట్టడము.
ఈ భవనమును కొంతకాలము ఎక్కువ సంఖ్యలో వచ్చు భక్త బృందములకు కేటాయించుట జరిగినది. ఇచ్చట వసతి తీసుకున్న భక్తులు, వంటలు చేసుకొనుటకు అన్ని వసతులు కల్పించెడి వారు సాయి సంస్థానము వారు.
పస్తుతము ఇందులో పోస్టు ఆఫీసును ఏర్పాటు చేసినారు.
ఇంతకు జంషెడ్జీ అవివాహితుడిగా ఉన్నప్పుడే అందరికి ఉపయోగపడే ఈ కళ్యాణప్రద కార్యాన్ని చేపట్టినాడు.
సాయి ఎవ్వరితో ఏ పని చేయించ దలచున్నారో, సాయికి మాత్రమే తెలియును. మనము అందరము భక్తుల కళ్యాణప్రద కార్యక్రమములకు సహకరించుచూ కాలము గడిపెదము గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- రాత్రి నిద్రించని సాయి…..సాయి@366 డిసెంబర్ 21….Audio
- (అ)ద్వితీయ సాయీ పత్రిక …..సాయి@366 మార్చి 18….Audio
- ఆనాడు ఈనాడూ అదే సాయి ….. సాయి@366 మార్చి 14….Audio
- గ్రహణం వీడింది.! …..సాయి@366 జనవరి 21….Audio
- దెబ్బకు దెబ్బ…..సాయి@366 నవంబర్ 21….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments