Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
ఒకరోజు షిరిడీ సంస్థానం అధికారి పాఠక్ గారికి ఉన్నట్లుండి 600 మంది భక్తులు వస్తున్నారని వర్తమానం అందింది. కనీసం రూ.1,200/- కావాలి.
ఉన్న డబ్బును అప్పటికే ట్రెజరీలో కట్టేశారు. ఏం చేయాలా అని అంతా ఆలోచిస్తున్నారు.
అంతలోనే ఇద్దరు వ్యక్తులు పాఠక్ దగ్గరకు వచ్చి, ”మాది షిరిడీ, ఈ పైకం రేపు వినియోగించండి” అని ఇచ్చి గబ గబా వెళ్ళిపోయారు.
విచారిస్తే, ఆ వ్యక్తులు షిరిడీ వాసులు కానేకారు. సొమ్ము సమయానికి అందింది.
మూడవ రోజున ఒక భక్తుడు పాఠక్తో ”సాయి అబ్దుల్ వచ్చి మీకు డబ్బు ఇచ్చినట్లు మూడు రోజుల క్రితం కల వచ్చింది” అన్నాడు.
ముల్కీ గ్రామ నివాసి వెంకటరావు. ఒకసారి ఆయన కూతురు ఆపదలో ఉంటే షిరిడీ పోదాము అనుకున్నాడు. కానీ వెళ్ళటం కుదరలేదు.
సరిగ్గా అప్పుడే ఆయనకు సాయిబాబా ఫొటో, ఊది వచ్చాయి షిరిడీ నుంచి. ఊది పెట్టుకుని, సాయిబాబా ఫొటోకు నమస్కారం చేసుకున్నాడు వెంకటరావు.
ఇక వెంకటరావు కుమార్తెకు అదే సమయంలో బలమైన ప్రేరణ కలిగి, ఫలానా రోజున, ఫలానా సమయంలో సాయిబాబాకు పూజ చేసి, ఆశీస్సులు కోరావా? అని ఉత్తరం రాసింది.
సరి చూసుకున్నాడు, అదే సమయంలో ఊది, సాయిబాబా ఫొటో రావటం, తాను ప్రార్ధించటం జరిగింది. ఇక వెంకటరావుకు సాయిబాబాపై నమ్మకం ఎక్కువకాసాగింది.
ఒకసారి ఆయనకు గుండె నొప్పి వచ్చింది. స్పృహతప్పి పడిపోయాడు కూడా. ఆ సమయంలో ఆయనకు సాయినాథుని దర్శనమైంది.
సాయి బాబాయే కాదు మరిద్దరు సాయి సేవకులు కూడా కనిపించారు. ఆ ఇద్దరు సాయి సేవకులు వెంకటరావు కాళ్ళు పట్టసాగారు.
వెంకటరావు వద్దంటే వద్దని ఆ ఇరువురుని వారించసాగాడు. కానీ వారు అంగీకరించ లేదు. కొంత సమయం తరువాత ఆ ముగ్గురు అదృశ్యులయ్యారు.
ఆయన 1918 ఈస్టర్ సెలవలకు (సుమారు ఇవి మార్చి చివరలో వస్తాయి) షిరిడీకి వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకున్నాడు.
అతని ఆశ్చర్యానికి అంతులేదు. కారణం ఆయన కాళ్ళను పట్టిన ఇద్దరు సేవకులు అక్కడ ఉన్నారు.
కలయో?
వైష్ణవమాయయో!
అన్నట్లుంటాయి సాయీశునితో సంఘటనలు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- సంతుల గ్రామం…..సాయి@366 మార్చి 23….Audio
- గృహమే సాయి మందిరం!…..సాయి@366 జూన్ 22….Audio
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 10వ. అధ్యాయము–Audio
- మూకం కరోతి వాచాలం …..సాయి@366 మార్చి 29….Audio
- దర్శనం – నిదర్శనం …..సాయి@366 మార్చి 24…..Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments