Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
బాబా శిరిడీలో ఉన్న కాలంలో మనదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉండేవారు కదా ! సర్ జాన్ కర్టిస్ అనే ఆయన ప్రభుత్వ కేంద్ర విభాగానికి కమిషనర్ గా పనిచేస్తూ ఉండేవాడు . ఆయనకు పిల్లలు లేరు . కనుక బాబాను దర్శించి తమకు సంతానం ప్రసాదించమని కోరడానికి కర్టిస్ దంపతులు శిరిడీ బయలుదేరారు . కానీ వారికి ఎంతో గర్వము ,బాబా పట్ల చులకన భావమూ ఉన్నాయి . బాబా పట్ల నిజమైన భక్తి విశ్వాసమూ లేవు . అయినా పిల్లలకోసం వారు బాబాను దర్శించాలను కున్నారు . ఈ విషయం బాబాకు తెలియకపోతే కదా !
ఆ రోజు మార్చి 10,1911 ,ఉదయం 7 గం॥ లు . బాబా మసీదులో ఉన్నారు . అకస్మాత్తుగా ఆయనెంతో కోపంగా తమ కఫ్నీని పైకెత్తి ,”ఆ దుర్మార్గులు నా దర్శనానికి రావడమెందుకు ? నేను సరైన గుడ్డలు గూడా లేని పేద ఫకీరునేగా !” అన్నారు . బాబా ఎవరిని గురించి కోపగించు కుంటున్నారో అక్కడున్న ఎవ్వరికీ అర్ధంకాలేదు. కొద్దిసేపట్లో కర్టిస్ తన భార్యను తీసుకుని శిరిడీ చేరాడు . వారితో కొద్దిమంది ప్రభుత్వోద్యోగులు కూడా వచ్చారు .
వారంతా ఎంతో దాంభికంగా చావడి చేరారు . ఊరిలోంచి కుర్చీలు తెప్పించుకున్నారు . ఆ పవిత్రమైన చావడిలోనే కుర్చీలలో కూర్చున్నారు . అక్కడ ఉన్న ఒక సాయి భక్తుని పిలిచి “పెద్ద పెద్ద బ్రిటిష్ ఆఫీసర్లు బాబా దర్శనానికి వచ్చారు . ఆయనను తొందరగా తయారవ్వమని చెప్పు “అన్నారు . అప్పుడా భక్తుడు ,”బాబా అంతటి గొప్ప మహాత్ముడు మన కోసం సిద్ధమై ఎదురుచూడాలా ?మనమే ఆయన కృపకోసం ఎదురుచూడాలి . ఆయనతో అలా చెప్పకూడదు “అన్నాడు . ఆ భక్తునికి ,వీరికి ఎంత తేడా !అతడికెంత వివేకం ! మనం కూడా ఎల్లప్పుడు మహాత్ముల కృపకోసం, దర్శనం కోసం ఎదురుచూడాలి గాని మన సౌకర్యం కోసం వారు మనకిష్టమైనప్పుడు దర్శనమివ్వాలని కోరుకోకూడదు .
దురహంకారంతో ,దుష్టత్వంతోనూ ప్రవర్తించే కర్టిస్ లాంటి వారంటే బాబాకు చాలా కోపం . వారు దర్శనానికి వెళ్లేసరికి బాబా అప్పుడే భిక్షకు కెళ్ళి తిరిగి వచ్చారు . అప్పుడు శ్రీమతి కర్టిస్ బాబా దగ్గరకు వెళ్లి ,”బాబా ,మీతో కొద్దిసేపు మాట్లాడాలి !”అన్నది . బాబా ముక్తసరిగా ,”ఒక అరగంట ఆగు !”అని మళ్ళీ వెళ్ళిపోయారు . కొద్దిసేపటికి ఆయన తిరిగీ మసీదుకు వచ్చారు . ఈసారి మరలా బాబాతో మాట్లాడడానికి ఆమె బాబా దగ్గరకు వెళ్ళింది . ఆయన ఆమెకేసి కోపంగా చూసి ,”ఒక గంట ఆగు !” అన్నారు .
బాబా తమలాంటి ‘గోప్పవారితో ‘అలా ప్రవర్తించడం వారికి నచ్చలేదు . అహం దెబ్బతిన్న ఆ దొరలు మరొక గంట గూడా ఆగకుండా ఆయన ఆశీస్సులు తీసుకోకుండానే వెళ్ళిపోయారు . వెళ్లేముందు కర్టిస్ సహస్రాబుద్దేకు రూ. 5/- ఇచ్చి పేదలకు దానం చేయమని చెప్పారు. “నేను చేయాలంటే వీలుకాదు. నేనైతే బాబాకి ఇస్తాను. దానం చేయాలంటే మునుసబుకో, కరణానికో ఇవ్వండి” అన్నారు సహస్రాబుద్దే. కర్టిస్ ‘నీకు తోచినట్లు చేయి’ అని వెళ్ళిపోయారు. మేక్లిన్ దొర రూ. 5/- జోగ్లేకర్ రూ. 2/- అతనికి ఇచ్చి వెళ్ళిపోయారు. అంత కలిపి రూ. 12/- లు బాబాకు సమర్పించారు సహస్రాబుద్దే. బాబా ఒక పేద భక్తునికి ఇచ్చేసారు. రెండు గంటల తర్వాత మద్యాహ్నం సహస్రాబుద్దే మశిద్ కు వెళ్ళినప్పుడు బాబా అతనితో “ఆ గవర్నర్ ఇవ్వవలిసిన రూ. 30/- నాకివ్వు” అన్నారు. అతడు నివ్వెరపోయి “వారిచ్చిన రూ. 12/- తమకే సమర్పించాను. ఆ మిగిలిన రూ. 18/- నన్నివ్వమంటే ఇస్తాను” అన్నారు. “ఆ తెల్ల వెధవలే నాకు రూ. 30/- ఇవ్వాలి. నీ డబ్బు నాకెందుకు?” అన్నారు బాబా.
సహస్రాబుద్దేకేమి అర్ధం కాలేదు. కానీ బాబా మాట్లాడిన ఒక్క మాట కూడా వ్యర్ధం కాదని అతడికి తెలుసు కనుక అతడు వెంటనే శ్రీమతి కర్టిస్ తో మాట్లాడి వివరాలు తెల్పమని జోగ్లేకర్ కు జాబు వ్రాసారు. జోగ్లేకర్ తిరుగు టపాలో జబువ్రాసారు. షిర్డీ లో కర్టిస్ సహస్రాబుద్దేకు పైకమిచ్చే ముందు కర్టిస్ దంపతులు వాదించుకున్నారట. మొదట శ్రీమతి కర్టిస్ ఏదైనా దర్మం చేయడానికి పైకం యివ్వమన్నప్పుడు కర్టిస్ ఒక్క రూపాయి మాత్రమే యిస్తానన్నారట. ‘అది మీ హోదాకు అంతస్తుకు సిగ్గుచేటు. నీవు కనీసం రూ. 25/- అయినా ఇవ్వాలి’ అన్నదాట ఆమె . మేక్లిన్ ఇచ్చిన రూ. 5/- లు కలిపితే మొత్తం 30 రూపాయలే! అదే బాబా కోరినది.
శ్రీమతి కర్టిస్ కు తమపట్ల దృడమైన భక్తీ లేకపోవడం వలన బాబా ఆమె భక్తికి , ఒరిమికి పరీక్ష పెట్టారు. ఆమె ఓడిపోయింది. అందువలన వారికి సంతానం కలుగలేదు . అలా గాకుండా వారు బాబా కృప లభించే దాకా ఓర్పుగా ప్రయత్నించి ఉంటే బాబా వారికి సంతానము ప్రసాదించేవారు . వారిలోని చెడ్డ గుణాలను తొలగించి మంచి మార్గంలో నడిపించేవారు . కనుక మనము మహాత్ముల కృప లభించేవరకు వారిని ప్రార్ధిస్తూ వారి కృపకై ఎదురుచూడాలి . అయితేనేమి బాబాను దర్శించినందుకు కర్టిస్ కు అంతకంటే పై పదవి బొంబాయిలో త్వరలోనే లభించింది.
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- అంతే ప్రాప్తి ….. సాయి@366 మార్చి 10….Audio
- శ్రీ షిరిడీసాయి వైభవమ్ – పూర్ణబ్రహ్మ – పరబ్రహ్మ
- జ్ఞానిని గుర్తించిన జ్ఞాని …..సాయి@366 డిసెంబర్ 1….Audio
- ‘‘ఇది వట్టి ఇటుక అనుకుంటున్నారేమో! కాదు. ఇది గురుప్రసాదం.”
- భక్తురాలి కలలో కనిపించి శిరిడీ రమ్మన్నా సాధువే శిరిడీ ప్రయాణంలో చివరి దాకా ఆమె వెంటే వుండి అన్ని తానె చూసుకున్నారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments