దుర్గాబాయ్ కర్మాకర్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

1913 సం. లో దుర్గాబాయి కర్మాకర్ అనే ఆమె చేతిలో 8 నెలల బిడ్డతో ద్వారకామాయికి వచ్చింది. తన బిడ్డను మశిద్ మాయి నేలపై ఉంచి సాయి బాబా కు నమస్కరించినది. సాయి దర్శనంతో ఆమెకు తన్మయత్వంతో కన్నీరు కారాయి. ఆమె చాల పేదరాలు. తనవద్ద  శిరిడీలో ఉండటానికి ఆమె వద్ద ధనం లేవు.సర్వాంతర్యామి అగు సాయి కి  ఆమె పరిస్తితి తెలుసు కదా! ఆమెతో సాయి “దేనికి భాదపడవద్దు, ఇక్కడ నిన్ను ఏది ఇబ్బంది కలుగాజేయదు.  ఈ ద్వారకామాయి అందరికి మేలు చేస్తుంది. ఇప్పుడే వెళ్లి మూడు రోజుల పాటు ఒక్క మాట మాట్లాడకుండా, అన్నపానీయాలు తీసుకోకుండా ఆ వేప చెట్టు క్రింద కూర్చో. నాల్గవ రోజు ఉదయం అన్ని చక్కవడతాయి” అన్నారు. అప్పుడామె “బాబా నేను చాల బిదరాలను, నాకెవరు అండ లేరు. మూడు రోజులు నేను అన్నపానియలు లేకుండా ఉండగలను, కానీ పాలపై ఆధారపడే నా బిడ్డ ఎలా ఉండగలడు. అందుకని కొంచం పాలు వాడికోసం తీసుకుంటాను” అన్నారు.
అప్పుడు బాబా “వెళ్ళు వెళ్ళు అంటూ పాలు గాని, యింకేమి గాని బిడ్డకు ఇవ్వవద్దు, కేవలం వాడిని పడుకోనివ్వు. అల్లా మాలిక్” అన్నారు. ఆమె కంటి నుండి నీరు కారుతున్నాయి. ఆమెకు ఎటువంటి అనుమానం లేదు బాబా మాటలందు. బాబా మాటలే ఆమెకు కొండంత బలాన్నిచ్చాయి .  మంచి, చెడు ఏది జరిగినా  బాబా మాటలకు కట్టుబడాలని ఆమె నిశ్చయించుకుంది. దుర్గాబాయ్ బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్లి వేపచెట్టు(గురుస్తాన్) క్రింద కూర్చుంది. అటువంటి భక్తులకు బాబా ఆజ్ఞే బలాన్ని చేకూస్తుంది దుర్గాబాయ్ బాబా చెప్పినట్లుగానే ఒక్క మాటైన మాట్లాడకుండా, అన్నపానియలు తీసుకోకుండా కూర్చుంది. కానీ అద్బుతమేమిటంటే ఆమె బిడ్డ కూడా ఆ మూడు రోజులలో పాలకోసం గాని, ఆహారం కోసం గాని ఏడవలేదు. మూడు రోజులలో తల్లిబిడ్డ ఇద్దరు ప్రకృతి పిలుపుకు కూడా వెళ్ళలేదు.
నాల్గవ రోజు వేకువ జామున బాబా దుర్గాబాయ్ వద్దకు వచ్చి రెండు చపాతీలు అమెకిచ్చారు మరియు రెండు రూపాయలు బిడ్డ చేతిలో పాలకోసం పెట్టారు. ఇంక  సాయి ఆమెతో “అనవసరంగా ఎవ్వరితో మాట్లాడవద్దు. వీలైనంతవరకు మౌనంగా ఉండు. నా సేవగా బావించి, ఇతరులను సేవేంచు” అని చెప్పారు. ఈ సంభాషణ జరుగుతుండగా బాలబావ్ అక్కడికి వచ్చారు. అతనికి షిర్డీ లో ఒక హోటల్ ఉన్నది. అతడు బాబాతో  “బాబా! ఈమె భాద్యత నా భుజాలపై వేసుకుంటాను” అన్నారు. అలా తల్లిబిడ్డలకు బాబా పోషణ ఏర్పాటుచేసారు. అప్పటివరకు ఆ బిడ్డకు నామకరణం జరగలేదు. అప్పుడు బాబా రఘునాద్ అని బిడ్డకు పేరు పెట్టారు.
దుర్గాబాయ్ 7 లేక 8 రోజులు షిర్డీ లో ఉండాలని వచ్చింది. ఆ గడువు దాటినా తర్వాత ద్వారకామాయి కి వెళ్లి షిర్డీ విడిచి వెళ్ళడానికి సాయిని అనుమతి అడిగింది.  బాబా “వెళ్ళు నీ స్థానంలో కూర్చో, నేను నిన్ను ఇక్కడికి లాగుకొని వచ్చాను. నిన్ను తిరిగి పంపటానికి తీసుకురాలేదు. ఎవరైతే నా వారో వారినే నేను ఇక్కడకు తీసుకువస్తాను” అన్నారు.
దుర్గాబాయ్ రెండు వేరు వేరు చోట్ల పనిచేస్తూ సంపాదించుకోనేది. ఆమె లేడిబాగ్ కు ద్వారకామాయి కి మద్యలో ఇల్లు కట్టుకున్నారు. రోజు బాబా ఉదయం, సాయంత్రం లెండి కి వెళ్లి వచ్చ్చేటప్పుడు ఆమెకు సులువుగా బాబా దర్శనం ఆమెకు కలుగుతుండేది. ఆమె ముక్కుసూటితనం అందరికి నచ్చేది కాదు. వారంతా ఆమె గురించే చెడుగా మాట్లాడేవారు. అటువంటి వారికీ ఏ సమాదానం దుర్గాబాయ్ చెప్పేది కాదు. ద్వారకామాయి కి పోయి ఓ మూలన కూర్చుని నెమ్మదిగా ఏడ్చేది. ఒకరోజు మద్యాహ్నం బాబా పాదాలు ఒత్తుచు ఇతరులు తన గురించి అనే చెడు మాటలు గుర్తువచ్చి ఆపుకోలేక కన్నీరు పెట్టుకుంది. అప్పడు సర్వజ్ఞుడగు సాయి ఆమె మదినేరిగి “దుర్గా! ప్రజలు ఏమైనా చేయని, ఏమైనా మాట్లాడని, వాటికీ విలువ ఇవ్వవలిసిన అవసరము మనకేమైనా ఉందా? వాళ్లతో మనకు పనేమిటి? కష్టపడి పని చేయు, నీవు చేయవలిసింది చాలా ఉంది. నేను ఇక్కడ నీకోసమే ఉన్నాను. ఎల్లప్పుడు నీ సహాయర్ధమే నేనిక్కడ కూర్చొని ఉన్నాను” అన్నారు. బాబా యొక్క ఈ అద్బుత పలుకులు విని దుర్గాబాయ్ సంతోషంతో పరవశించి పోయింది.
దుర్గాబాయ్ ఎటువంటి పని అయినా తిరష్కరించేది కాదు. యెంత కష్టమైన పని అయిన పూర్తీ చేసేది. ఆమె తన పని పూర్తీ అయిన తర్వాత ఒక కుండలో బియ్యం పోసి ద్వారకామాయికి తీసుకోని వచ్చి పవిత్రమైన బాబా దునిపై పెట్టేది. బియ్యం ఉడికే వరకు, ఆమె బాబా శరీరాన్ని మాలిష్ చేస్తూ ఉండేది. బాబా ఆపమని చెప్పేవరకు మాలిష్ చేసేది. ఆ ఉడికిన అన్నం తో బాబాకు నైవేద్యం తయారుచేసి సమర్పించుకోనేది. దాదాసాహెబ్ ఖాపర్డే ఆమె బాబాకు చేసే అనుపమానమైన సేవకు మెచ్చి, ప్రతినెల ఆమెకు 15 రూపాయలు ఇవ్వడానికి ఏర్పాటుచేసుకున్నారు.
బాబా ‘నిజమైన ప్రేమ’ను మాత్రమే భక్తుల నుండి కోరుకున్నప్పటికి,  దుర్గాబాయ్ కటినమైన నియమ నిష్టలతో బాబాను సేవించేది. ఆమె అంటరానితనం పాటించేది. ఒకసారి దుర్గాబాయ్ బియ్యం దునిపై పెట్టి బాబాకు మాలిష్ చేస్తువుంది. అంతలో ఒక భక్తుడు వచ్చి ధుని మీదనుండి అన్నం కుండను ప్రక్కకు దించి, దునిలోని నిప్పుతో చిలిం వెలిగించుకొని, మరల అన్నం కుండ దునిపై పెట్టారు. అతనికి అంటరానితనం అను భావలుయేమి లేవు. అతనికి ఒక్కటే తెలుసు అది బాబా సన్నిధి. అక్కడ పేద-గొప్ప, ఎక్కువ-తక్కువ, అనే భేదాలుండవు. అక్కడ అంత సమానమే. దుర్గాబాయ్ అటువంటి వారు ఏమి చేసిన ఏమి అనేది కాదు, తను బాబా సేవను విడిచిపెట్టేది కాదు. కానీ తన మనస్సులో ‘నా బిడ్డ భోజన వేళ అయ్యింది. ఎలా ఇటువంటి దిగువ జాతివారు ముట్టిన ఆహారం బిడ్డకి పెట్టేది. ఆ ఆహారం వాడికి ఎటువంటి మేలు చేయదు. నేను ఎప్పుడు దుఖాణానికి  వెళ్లి బియ్యం తెచ్చి, అన్నం వండి బిడ్డకు తినిపెంచేది’ అని అనుకుంటూ దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టుకుంది. ఒక కన్నీటి బొట్టు బాబాపై వెనకవైపు రాలింది. సర్వజ్ఞుడగు సాయి కి ఆమె మనస్సులో ఆలోచనలు, భాధ తెలుసుకదా!
అప్పుడు సాయి “దుర్గా ఏడవవద్దు. నా సన్నిధిలో అంటరానితనం అన్నదానికి స్థానమేలేదు. ఈ మశిద్ మాయి విలువలేనిది కాదు. ప్రజలు ఇక్కడకి వచ్చి కోట్ల జన్మల పాపాలను కడిగేసుకుంటారు. నా స్వహస్తాలతో ఈ ధుని వెలిగించాను. ఈ ధునిలో అగ్ని దేవుడు కొలువైవున్నాడు. అంతటి పవిత్రమైన మంటపై వండబడిన ఆహారం ఒకరు ముట్టినంత మాత్రన అపవిత్రం అయిపోతుందా? ఇటువంటి ఆహారం తినుటవలన నీ బిడ్డకు ఎంతో మేలు చేకూరుతుంది. దయ కలిగి నేను ఈ మాటలు చెప్పుచున్నాను. నాకు ఎవరి యందు ఎటువంటి చెడు అభిప్రాయములు లేవు. ప్రజలు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఈ దునిలోని ఉదీ వారి వ్యాధులు నయమగుటకు వారి నుదట రాసుకుంటారు. వారి అదృష్టాన్ని నేనేమని చెప్పను. అందువలన దుర్గా మనస్సులో ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా! ఈ ఆహారాన్ని రఘుకు తినిపించి, నీవు కూడా తిను” ఈవిదంగా చెప్పుచు ఆమెను ఆశీర్వదించి సరే ఇప్పుడు లెగు, లేచి అన్నాని  తీసుకోని ఇంటికి వెళ్లి నువ్వు, రఘు తినండి అన్నారు.
ఈవిదంగా సాయి తన దృష్టిలో అందరు సమానమని మరియు కులం, మతం మరియు అంటరానితనం వంటి భేద భావాలు గమ్యం చేరడానికి అడ్డంకులని అపూర్వమైన భోధ చేసారు.
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles