భక్తురాలి కలలో కనిపించి శిరిడీ రమ్మన్నా సాధువే శిరిడీ ప్రయాణంలో చివరి దాకా ఆమె వెంటే వుండి అన్ని తానె చూసుకున్నారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మళ్ళీ నాకు జూలై నెలలో గురుపొర్ణమికి కొద్ది రోజుల ముందు ఒక కాషాయ వస్త్రాలు ధరించిన సాధువు ఒకాయన కలలో కనపడి శిరిడీ పదండి, శిరిడీ పదండి అన్నాడు.

నేను తెల్లారాక మా వారికి ఈ కల గురించి చెప్పి ఏవండీ! బాబా మళ్ళీ మనలని శిరిడీ రమ్మంటున్నారు కాబోలు అన్నాను.

మా వారు మన దగ్గర అంత స్థోమత లేదు, అయినా ‘మొన్ననేగా వెళ్లి వచ్చాము మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే’ అన్నారు.

నేను విఠల్ బాబాగారితో విషయం చెప్పాను.

మిమ్మల్ని గురుపౌర్ణమికి బాబా శిరిడీ రప్పించుకోవాలి అనుకుంటున్నాడేమో ఇంకా ఆలోచిస్తారు ఏంటమ్మా

ఆయన దగ్గర నుండి పిలుపు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తుంటారు అలాంటిది ఆయన మిమ్మల్ని రమ్మన్నాక ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తారు అని అన్నారు.

బాబా మా దగ్గర అంత  డబ్బు లేదు అన్నాను. అమ్మా ఆ విషయం ఆ పెద్దాయనకి తెలియదా? రమ్మన్నారు వెళ్ళటమే ఎదో ఒకటి చేసి వెళ్ళండి అన్నారు.

సరేనని బయలుదేరుదామంటే మాతో పాటే వేరే కుటుంబం మేము మీతో పాటు శిరిడీ వస్తాం అని వాళ్ళు బయలుదేరారు.

నాకు దారి పొడవునా రైలులో కలలో కనిపించిన సాధువు కనపడుతూనే ఉన్నారు.

రాత్రి అంత కూడా నా ఎదురుగానే ఉన్నారు. మా వారికి చూపించాను. నాకు ఎవ్వరు కనపడటం లేదు అన్నారు.

కనపడకపోవడం ఏమిటి? ఎదురుగా కాషాయ బట్టలతో వుంటేనూ అంటే, ఏమో నాకెవరూ కనపడటం లేదు అన్నారు.

శిరిడీ లో దిగాము మాకు అంత దూరంలో ఆ సాధువు కాషాయ బట్టలతో ఎదురుగుండా కనపడుతున్నారు.

సంస్థానం వాళ్ళ రూముల దగ్గరికి చేరుకున్నాం. అక్కడ గుంపులు గుంపులుగా బ్యాగులు పెట్టుకొని కొంతమంది కూర్చొని వున్నారు ఏమిటో కనుక్కుంటే రూములు లేవుట అన్నారు.

సరే లాకరైనా దొరికితే సామాను అందులో పెట్టుకుందాం అనుకున్నాం.

లాకర్ కోసం పెద్ద క్యూ వుంది. ఆక్యూలో మావారు మాతో కూడా వచ్చినాయన నిలబడ్డారు.

మేము ఒక్కరమే వస్తే ఫర్వాలేదు, మాతో వేరే వాళ్ళు కూడా వచ్చారు. రూములు లేవుఅంటే వాళ్ళేమైనా అనుకుంటారేమోనని అనుకుంటూ అక్కడ నిలబడి ఉన్నాం.

ఈ లోపల ఒక ముస్లిం అతను మా  దగ్గరికి వచ్చి ఎందుకు అక్కడ నిలబడి ఉన్నారు అని అన్నాడు హిందీలో.

మేము వచ్చి రానీ హిందీ లో రూములు లేవు అని, లాకర్ కోసం అక్కడ మా వారు నిలబడి ఉన్నారు అన్న విషయం చెప్పాను.

అయన బాగా పొడుగ్గా ఉన్నాడు, గడ్డం వుంది ఆయన  “పదండి మీకు రూము రెడీగా వుంది అన్నారు.

నేను మా వారిని పిలిచాను. అసలే జనం ఎక్కువగా” ఉన్నారు. నిలబడ్డ ఇద్దరు వచ్చేస్తే కష్టం అని మాతో కూడా వచ్చినాయన్ని లైన్లో నిలబెట్టి మా వారు ఒక్కరే మా దగ్గరికి వచ్చారు.

ఆ ముస్లిం ఆయన మళ్ళీ విషయం చెప్పి రండి రండి అన్నారు. మేము బ్యాగులు తీసుకొని ఆయన వెనకాల వెళ్ళాము.

ఆయన సంస్థానం రూములు దగ్గరికి తిన్నగా వెళ్లి ఒక ఫారం నింపించి సంతకం చేయించి డబ్బులు కట్టించుకొని అక్కడ కౌంటర్లో వున్న అతన్ని తాళం అడిగి అది మా చేతిలో పెట్టాడు.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles