Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
బాబా వారి ఆశీర్వాదానికి మరో నిదర్శనం మీ ముందు వుంచుతున్నాను.
ఇది ఎప్పుడో జరిగింది కాదు. December 2017 లో జరిగింది. మా అక్క (అంటే మా పెద్దమ్మ కూతురు) గారి భర్త అంటే నాకు బావ గారు 2017 December 6 th న స్వర్గస్థులైనారు.
ఆయన గత 6 నెలలుగా lung cancer తో చాలా భాదపడుతుండే వారు, అందరి doctors కు చూపించినారు. అన్ని రకాల మందులు ఇప్పించారు.
4 th stage లో doctors చేసేది ఏమి లేక ఇంటికి పంపేసారు.
ఇంక ఇంట్లో అందరు మానసిక వేదనను అనుభవించారు. ఆయనకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు, అందరికి పెళ్లిళ్లు అయ్యాయి. చక్కని ఉమ్మడి కుటుంబం.
ఇంక last stage లో ఉన్నాడని వాళ్ళు ప్రతిరోజు అందరు సాయినాథ స్థవనమంజరి, సాయి గాయత్రి, సచ్చరిత్ర పారాయణం వదలకుండ చేసే వాళ్ళు అంతె కదా! మనం మానవ మాత్రులం.
మనకు సంబంధించిన ఎవరైనా చావు బతుకుల మధ్య వున్నారంటే భగవంతుడిని వేడుకొంటాము. వాళ్ళు అలాగే చేశారు.
ఆ బాబా ఆశీర్వాదం వల్లనేమో ఆయన రెండు నెలలు ఎక్కువ బ్రతికారు. 6th December న ఇంకా స్వామి పిలుపు వచ్చిందా, అన్నట్లు అందరిని వదిలేసి స్వర్గస్థులైనారు.
అసలు విషయం ఇప్పుడు జరిగింది. అందరు బంధువులు వస్తున్నారు శవాన్ని ఇంక వుంచడం కుదరదు అన్నారు, అన్ని తయారు చేస్తున్నారు.
ఇంతలో శిరిడీ నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఎవరో మా వాళ్ళకు ఎవరికీ తెలియదు. వాళ్ళు అన్నారు, మేము శిరిడీ నుంచి వస్తున్నాం బాబా సమాధికి కట్టే చాదర్ తెచ్చాము.
మాకు శిరిడీలో ఇచ్చారు, మీ ఇంట్లో ఈ చనిపోయిన వ్యక్తికి కప్పాలి. అని ఒక చాదర్, పూలమాల ఇచ్చారు. ఈ లీల చూసి అక్కడ అందరు స్థంభించి పోయారు.
ఆ చాదర్ మా బావ శవం మీద కప్పారు. పూలమాల వేశారు చాలా జనం వున్నందువలన ఎవ్వరూ గమనించలేదు.
తరువాత అందరు వెళ్ళి పోయిన తరువాత ఆ సాయినాథుని కి కృతఙ్ఞతలు చెప్పారు, అప్పుడు స్వస్థులైనారు. బాబానే స్వయంగా ఆయనకు ఉత్తమగతిని ప్రసాదించినందుకు కుటుంబసభ్యులు అందరు బాబాకు నతమస్తకం(శరణాగతి) అయ్యారు.
ఇప్పుడు మీరు బాబా సచ్చరిత్ర చదివితే మేఘ కధ గుర్తు వచ్చిందా! మేఘ స్వర్గస్థులైన్నప్పుడు బాబా అతని శరీరాన్ని నిమిరి ఇలాంటి భక్తుడు ఇంక తిరిగి రాడు, అని బాబా కళ్ళలో కూడా నీళ్ళు పెట్టుకున్నాడు.
నాకు అదే గుర్తు వచ్చింది తిరిగి చూస్తే మన జీవితంలో జరిగే ప్రతి ఘట్టం సాయి సచ్చరిత్రలో వున్నది.మనం గమనించుకోవాలి అంతె.
సర్వం సాయి నాధార్పణమస్తు
మాధవి
భువనేశ్వర్
Latest Miracles:
- running train నుంచి క్రిందపడుతున్న నన్ను బాబావారు కాపాడారు.పిలిచిన వెంటనే సమయానికి వచ్చి బాబావారు తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతారు అని నాకు స్పష్టమైంది.
- బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.
- బండలపై బాబా రూపం
- నేను ఉద్యోగం కోసం వెతికి వెతికి, ఇంక ఒక్కసారి శిరిడీ వెళ్దాం అనుకున్నాను. డబ్బులు వాళ్ళను, వీళ్ళను అడిగి తెచ్చుకొని వెళ్ళాను.
- 2 ,40,000/- రూపాయలు ఎలా వస్తాయి అనుకోని చింతిస్తూ వుంటే బాబా వారు 2 రోజుల్లో అందించారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
10 comments on “మేము శిరిడీ నుంచి వస్తున్నాం బాబా సమాధికి కట్టే చాదర్, ఈ చనిపోయిన వ్యక్తికి కప్పాలి”
kishore Babu
December 31, 2017 at 6:13 pmచాల అదృష్టవంతుడు …బాబా లీలలు ఎప్పుడు ఎలా జరుగుతాయో మనము గుర్తించలేము.
Madhavi
December 31, 2017 at 7:37 pmMay his soul rest in Baba’s feet..sairam
soundarya
December 31, 2017 at 7:53 pmmay his soul rest in Baba feet.
Revanth
December 31, 2017 at 8:14 pmMay his soul rest in peace
Om sai Ram!
Radhika J
January 1, 2018 at 5:46 amOm sairam
TV Gayathri
January 1, 2018 at 2:07 pmSarvam sainadha arpanamasth. It’s a miracle.May his soul rest in peace.
b vishnu Sai
January 1, 2018 at 4:21 pmMay his soul rest in place, om sai ram
T.v.pramada
January 1, 2018 at 5:00 pmSai ram
Vidya
January 1, 2018 at 9:58 pmOm SaiRaam May his soul Rest In Peace
Krishnaveni
January 1, 2018 at 10:58 pmDivine blessings r with him. He has become one with baba l feel baba loved him a lot