Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా ఏ సాంప్రదాయమునకు చెందిన వారో కూడ నిర్ణయించుట కష్టమే.
దత్త పంచకములలోని వారని దత్త సాంప్రదాయము వారు తెలుపగా, నాథ పంచకములలోని వారని నాథ సాంప్రదాయీకులు భావిస్తారు.
నాథపంచకములోని అయిదుగురు:
1)పరమహంస శీలానాథ్,
2)గజానన్ మహారాజ్,
3)నర్సింగ్ మహారాజ్ (గోపాల్‌దాస్),
4)మాథవనాథ్ మహారాజ్,
5)సాయిబాబా (షిరిడీ).
మాధవనాథ మహారాజు చైత్ర శుక్ల ప్రతిపదము నాడు అంటే 26 మార్చి, 1857 నాడు జన్మించారు. 1936లో దేహత్యాగము చేశాడు.
ఈయన సాయినాథుని జన్మ విశేషాలను కూడ తెలిపారు. ఈయన గుప్తానాథ్ మహాసమాధి గల బాలాజీ మందిరంలో బ్రహ్మ జ్ఞానాన్ని పొందారు. 13 సంవత్సరాలు భారతదేశాన్ని పర్యటించారు.
మాధవనాథుల వారు యోగమునకు, నామ సంకీర్తనమునకు ప్రాధ్యాన్యం ఇచ్చేవారు.
అనేక మహిమలను చూపారీ మాధవనాథుడు. మనసును లేదా అంతరంగాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేవారు.
ఇంకను మాటలు, చేతలతో ఇతరులను కష్టపెట్టరాదు అనేవారు. సాయిబాబా కూడ అదే అనే వారు పదే పదే.
ఇతరుల మనసు నొప్పించిన, తనను నొప్పించినట్టే అనెడి వారు. ఇతరులను భౌతికముగా బాధిస్తే, తనను బాధించినట్టే అనెడి వారు.
ఒకసారి సాయి భక్తుడైన రేగేతో నీవు మొదిసారి సాయిబాబాను కలసినప్పుడు నేనక్కడే ఉన్నాను, అని అక్కడ జరిగిన సంభాషణను పూసగుచ్చినట్లు చెప్పారు మాధవ్‌నాథ్ అంటే సత్పురుషులు సూక్ష రూపంలో కలుసుకుంటూనే ఉంటారు.
అలాగే వారిలో వారు మూడవ వ్యక్తి ద్వారా సందేశాలను పంపుతారు. మాధవనాథ్, లక్ష్మణరావును సాయి వద్దకు పంపారు. కారణం చెప్పలేదు.
కానీ ఆ ఇరువురికే అర్థమవుతాయి – ”నేను సంచుల బంగారాన్ని గాడిద వీపుపై వేశాను. దొంగలు దొంగిలించారు. కర్ణ రంధ్రాన్ని కంసాలి చేయాలి. ఈ మాయా ప్రపంచంలో జీవించటం కష్టం. దీన్ని నా సోదరుడు మాథంవనాథ్‌కు చెప్పు” అని ఈ సందేశాన్ని అక్ష్మణరావు ద్వారా పంపాడు సాయి.
అసలు తాను ఏ సందేశాన్ని అయినా సాయి నుండి తేవాలని మాధవనాథులు లక్ష్మణరావును పంపలేదు.
అలా ఉంటారు ఆ సోదరులు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- పాట పాడుమా! ….. సాయి@366 మార్చి 1…..Audio
- భగవానుని లీల…..సాయి@366 మే 26….Audio
- సోదరా! నన్ను మరచిపోకు!! …..సాయి@366 ఆగస్టు 13….Audio
- సర్వ దేవతా నిలయం ….. సాయి@366 మార్చి 9….Audio
- సాయీ రమణీయం….. సాయి@366 మార్చి 3….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments