శంకరో శంకరః సాక్షాత్ …. మహనీయులు – 2020… మే 17



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఆది శంకరాచార్యుల వారి బాల్యంలో, ఆయన మాతృమూర్తి ఆర్యాంబ తమ నివాసానికి ఎంతో దూరంలో నున్న పూర్ణ నదికి వెళ్ళి స్నానం చేసి, పూజచేసి వచ్చేది.

ఆమె వయస్సు పైబడ్డది. ఒక రోజున ఆమె ఎంతకూ ఇంటికి రాలేదు.

బాలకుడు మార్గమధ్యంలో ఎండవేడిమి తట్టుకోలేక సొమ్మసిల్లిపడిన తల్లికి సేవలు చేసి, తల్లికి శ్రమలేకుండా చేయాలని సంకల్పించాడు.

అంతే! మరునాటి ఉదయానికల్లా పూర్ణానది తన ప్రవాహ మార్గాన్ని శంకరుల గృహ సమీపంలోనే పోయేటట్టు చేసుకుంది. నేటికీ ఆ మార్గం అలాగే ఉంది.

సాయిబాబా కూడా దాసగణు అనే భక్తుడు ఎంతో దూరంలో ఉన్న గోదావరి స్నానానికి పోనక్కరలేకుండా సంకల్పించాడు. గంగా యమునాలు సాయి పాదాలనుండి ఉద్బవించాయి.

ఆది శంకరులు భిక్ష కోసం ఒక పేదరాలి ఇంటికి వెళ్ళారు. ఆ పేదరాలు సిగ్గుపడుతూ ఒక ఉసిరికాయను భిక్షగా వేసింది.

ఆమె దారిద్య్రం, ధర్మబద్ధతతో అది శంకరుల హృదయం కరిగింది. కనకధారాస్తవనమనే లక్ష్మీ స్తోత్రం కల్పించి స్తుతించారు. ఆ పేదరాలి ఇంట కనక వర్షం కురిసింది.

ఆది శంకరులు జీవితములో ప్రతి సంఘటన అద్భుతమే.

ఒక కాపాలికుడు “నీ శరీరం కావాలి. వదిలేయి” అన్నాడు. “నా శిష్యులెవరూ దగ్గరలేని సమయంలో నేను సమాధిలో ఉన్నప్పుడు నా తల నరికి తీసుకెళ్ళు” అని దధీచిలాగా, తన శరీరాన్ని వదిలేయదలచాడు శంకరులు.

సరైన అవకాశం చూసి సుత్తితో శంకరుల శిరస్సు ఖండించబోయే సమయానికి పద్మపాదులు నరసింహస్వామి వలె ప్రత్యక్షమై కాపాలికుని మీదపడి, కోరలతో, గోళ్ళతో అతని ప్రేగులు చీల్చి చంపాడు.

ఆ గర్జనలు విని సమాధి నుండి బయటకువచ్చిన ఆది శంకరులు నృసింహ రూపంలో ఉన్న శిష్యుని చూచి నమస్కరించి, 14 శ్లోకాల నృసింహ శ్లోకం ఆశువుగా చదివి అతన్ని శాంతింప చేశారు.

ఆది శంకరులు పండిత సభను మగధలో జరిపి “నిర్గుణ, నిరాకార పరమాత్మను ధ్యానించటం సామాన్యులకు సాధ్యంకాదు కనుక శైవము, శాక్తము, వైష్టవము, సౌరము, గాణాపత్యము, స్కాందము అనే ఈ ఆరు మతాల్లో దేన్నయినా ఆశ్రయించి వేద విరుద్ధముగాని సగుణోపాసనను చేయవచ్చును” అన్నారు.

సుధన్వ మహారాజు సూచన ప్రకారం దేశం నలుమూలలా నాలుగు శంకర మఠాలు ఏర్పాటుచేసి, గురుశిష్య పరంపరద్వారా ముందు తరాలలో అద్వైత సిద్ధాంతం ప్రచారపు ఏర్పాటు చేశారు.

ఇంకా కంచిలోని కామాక్షి దేవాలయంలో ఆచార్యులు తాంత్రిక యంత్రాన్ని ప్రతిష్టించి, కామాక్షి విగ్రహం బిందుస్థానంగా, అనేక ఇతర దేవాలయాలను నిర్మింపచేశారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదం శంకరుల కోసమే పుట్టిందనవచ్చు. అయన కర్మ యోగి, భక్తి యోగి.

ఆ మహానుభావుడి పట్ల వేదమతంలో విశ్వాసముంచే వాళ్ళందరకూ, అయన ప్రాతః స్మరణీయుడు.

ఆది శంకరులు జన్మించినది వైశాఖ శుద్ధ పంచమి. అదే శంకర జయంతి.

భారత ప్రభుత్వం 17 – 5 – 1989న ఆయన స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది.

“శంకరో శంకరః సాక్షాత్”

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles