Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయి అపార కరుణకు నోచుకున్న కుటుంబాలలో ఒకటి సాయి సచ్చరిత్ర రచయిత హేమాడ్‌పంత్ కుటుంబం ఒకటి.
హేమాడ్‌పంత్ కుమార్తె కృష్ణాబాయి. ఆమెకు 1916లో రాజారాం వాలవాలకర్‌తో వివాహమైంది. కాన్పు కష్టమవుతుందని హేమాడ్‌పంత్ భయపడ్డాడు. అట్లానే జరిగింది.
సాయి ఉండగ దైన్యమేల? సాయి ఆయనకు ధైర్యాన్నిచ్చారు. బిడ్డ జన్మించాడు. పాలు త్రాగడు. పసిబిడ్డను తెచ్చి సాయి చరణాల వద్ద ఉంచాడు హేమాడ్‌పంత్.
అంతవరకు పాలు తాగని ఆ పసిబిడ్డ నోటిలో తన అంగుష్టాన్నుంచాడు సాయి. ఆ పసికందు అంగుష్టాన్నుంచి వచ్చిన పాలను త్రాగాడు! అది సాయి అమృత హస్తం.
ఆ చిన్నవాడు సాయి భక్తుడైనాడు. అనంత ప్రభు వాలవాలకర్ అతని నామం. సాయి అతనికి సిద్ధులను కూడా ప్రసాదించారు.
ఆయన షిరిడీని దర్శించే వాడు. ఒకసారి ఆయన తల్లికి జబ్బు చేసింది. ఇక ఆమె కాలం సమీపించిందని అనంత గ్రహించాడు.
ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించి షిరిడీకి బయలు దేరాడు. ఆమె ఆ మంత్రాన్ని జపించ సాగింది.
అనంత షిరిడీ చేరి సాయి సమాధి మందిరంలో శ్రీ సాయి సచ్చరిత్ర (తన తాత వ్రాసినదే) పారాయణ చేయసాగాడు.
పారాయణ కొనసాగుతోంది. ఒక రోజు పారాయణ చేస్తుండగా తన తల్లి ఆరోగ్యం చరమ స్థాయికి చేరుకున్నదని తంతి వచ్చింది.
”మాతృ దేవో భవ” అని కదా సూక్తి. సర్వసంగపరిత్యాగి అయిన ఆది శంకరులకు ఇటువంటి పరిస్థితే కలిగింది.
తల్లి అవసాన కాలమున నీ వద్దకు వత్తునని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తన యోగ మహిమచే సూక్ష్మ శరీరంతో తన తల్లి వద్దకు చేరాడు ఆది శంకరుడు.
కానీ, అనంతకు అట్టి శక్తులు లేవు. దూరం ఎంతో ఉన్నది. సమయం తక్కువ.
పరబ్రహ్మ స్వరూపి సాయికి తల్లిదండ్రులున్నా లేకున్నా మాతృ దేవికి పెద్ద పీట వేయిస్తాడు భక్తులతో.
వెంటనే సాయి ఒక గుర్రాన్ని తెచ్చాడు. దానిపై సాయి, అనంతలు వాయువేగ మనోవేగాలతో దాదర్‌లో ఉన్న తల్లి వద్దకు చేరి తల్లిని సంతోష పరచాడు. ఆమె సాయిలో లీన మైంది.
అనంత ఆ తర్వాత కాలంలో దేవ్ బాబా అయ్యాడు. దేవ్ బాబా 25 మే, 1994లో సాయిలో ఐక్యం అయ్యాడు.
మనం మనకి జన్మ నొసంగిన మాతృమూర్తికి సపర్యలు చేసి కొంతైనా ఆమె రుణం తీర్చుకుంటే సాయి మనను ఆశీర్వదిస్తాడు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- కడివెడు మజ్జిగ…..సాయి@366 ఆగస్టు 28…Audio
- వీడ్కోలు పలుకులు …..సాయి@366 జూలై 13…Audio
- “సాయి సచ్చరిత్ర” జయంతి…..సాయి@366 నవంబర్ 26….Audio
- సాయి రసాన్ని చూపించిన రసాయన శాస్త్రజ్ఞుడు…..సాయి@366 జనవరి 9….Audio
- ప్రేమ పత్రములు….సాయి@366 సెప్టెంబర్ 15…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments