Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భరత్ రావు గారి అనుభవములు మొదటి భాగం
నా పేరు భరత్ రావు. నేను B D L లో పని చేసి రిటైర్ అయ్యాను. నేను హైదరాబాద్ లోని కొత్తపేటలో కుటుంబంతో నివాసం ఉంటున్నాను.
2003 వరకు నాకు బాబా గారు తెలియదు.శివారాధన చేసేవాడిని, శివ క్షేత్రాలకి మాత్రమే వెళ్ళేవాడిని. నేను రోజు ఉదయం 5 గంటలకి డ్యూటీ కి వెళ్ళాలి.
Dilsukhnagar పోలీస్ స్టేషన్ దగ్గర నేను రోజు బస్సు ఎక్కాలి. ఆ పరంపరలోనే ఒకరోజు ఉదయాన్నే మెలకువ వచ్చింది,లేచాను,
కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి, పూజ, దీపారాధన అన్నీ పూర్తి అయి నేను డ్యూటీకి బయలుదేరి వెళ్ళిపోయాను.
Dilsukhnagar చేరుకున్నాను అప్పుడు సమయం చూసుకుంటే 4 గంటలు అవుతోంది. అంటే ఆ రోజు నేను సమయం చూసుకోకుండా చాలా తొందరగా లేచి నా పనులన్నీ చేసుకుని ఆఫీస్ కి బయలుదేరేసానన్నమాట.
ఇంకా బస్సు రావడానికి సమయం ఉంది. ఈ లోపు ఏమి చేయాలా అనుకుంటూ ప్రక్క సందులోకి దారి తీశాను.
అక్కడ ఒక గుడి కడుతున్నారు, లోపలికి తొంగి చూసాను. పాలరాతి విగ్రహంలో ఒకాయన కూర్చుని ఉన్నాడు. (అది సాయిబాబా గుడి) నెమ్మదిగా లోపలి వెళ్ళాను.
ఇంతలో హారతి మొదలు అయింది. హారతిని అంతా దీక్షగా తిలకించాను. అది అయ్యాక వెన్న నైవేద్యంగా పెట్టారు. ప్రసాదం స్వీకరించి బయటకు వచ్చాను.
ఆఫీస్ వాన్ వచ్చింది. నేను ఆఫీస్ కి వెళ్ళిపోయాను. ఆ రోజంతా నాకు ఆయన విగ్రహం ఆ హారతి మనసులో మెదులుతూనే ఉంది. మనసంతా నిండిపోయినట్లు అయింది.
ఒకరోజు పని మీద పుస్తకాల షాప్ కి వెళితే అక్కడ భరద్వాజ మాస్టర్ గారు రాసిన శ్రీ సాయి లీలామృతం పుస్తకం నాకు కనిపించింది.
యధాలాపంగా ఆ పుస్తకం కొనుక్కుని వచ్చాను. దానికి నీట్ గా అట్ట కూడా వేసి షేల్ఫ్ లో పెట్టాను.
చాలా రోజుల దాకా నేనా పుస్తకం తెరవనే లేదు. ఒకరోజు ఎందుకో ఆ పుస్తకం చదవాలి అని బుద్ధి పుట్టింది. ఆ పుస్తకం తెరచి చూసాను.
అందులో ఒక గురువారం రోజు పారాయణ మొదలు పెట్టమని ఉంది. మరునాడే గురువారం ఉదయం కొంత, సాయంత్రం ఆఫీస్ నుండి తిరిగి వచ్చాక నియమంగా స్నానం చేసి మరికొంత సేపు చదువుతూ చాలా శ్రద్దగా వారం రోజులలో ఆ గ్రంధం పూర్తి చేసాను.
బుధవారం పూర్తి అయింది. గురువారం ఉదయం నేను బాబా గుడికి వెళ్దామని బయలు దేరాను. అలా అప్పుడపుడు గుడికి వెడుతూండే వాడిని.
మా ఇంటి సందు మలుపు తిరుగుతూండగా నడి రోడ్డు మీద ఒకాయన కూర్చుని ఉన్నాడు.
నేను చూసి ఆయనతో “ఏమండి, ఇలా నడి రోడ్డు మీద కూర్చుంటే ఏదో ఒక వాహనం వచ్చి గుద్దేస్తుంది. ప్రక్కకి కూర్చోండి” అని అన్నాను.
ఆయన “ఇటు నా మిత్రుడు వస్తాడు అందుకే కూర్చున్నాను అన్నాడు”. నేను ముందుకి అడుగులు వేస్తున్నాను కొంచెం దూరం వెళ్ళగానే “ఓ మిత్రమా, ఓ మిత్రమా” అంటూ అరిచాడు ఆయన, నేను వెనుకకి తిరిగి చూడలేదు.
ఆ తరువాత నాలుగు రోజులకి మా ప్రక్కింటి రమణ గారు రాత్రి 11 గంటలకి వచ్చారు. ఆయనని ఆ సమయంలో చూసి కంగారు పడి,
“ఏమండి ఏమైనా అవసరం అయిందా? డబ్బు ఏమైనా కావాలా? వదిన గారికి ఒంట్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా? హాస్పిటల్ కి వెళ్ళటానికి కారు ఏమైనా కావాలా అని అడిగాను.
ఆ చుట్టూ పక్కల వాళ్ళు ఏదయినా డబ్బు అవసరం అయినా అవసరానికి కారు కావలసి వచ్చినా నన్ను అడుగుతూ ఉంటారు. ఆ పరంపరలోనే నేనే అన్ని ప్రశ్నలు వేసాను.
ఆయన “అదేమిలేదు భరత్ రావు గారు నాలుగు రోజుల క్రితం మీరు ఆ రోడ్డు మీద ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ విషయం అడుగుదామని అనుకుంటూంటేనే రోజూ గడచిపోతుంది.
ఈ రోజు ఇంత రాత్రి సమయం అయినా విషయం కనుక్కుందామని వచ్చాను. ఇప్పుడు చెప్పండి ఎవరితో మీరు మాట్లాడుతున్నారు?” అప్పుడు “నేను కనపడ్డాను కదా నాతో మాట్లాడినాయన మీకు కనపడలేదా? అని అడిగాను.
“అబ్బే ఎవరూ లేనిదే మీరే ఎవరో ఉన్నట్లుగా రోడ్ పైన ఎందుకు ప్రక్కకి కూర్చోండి, ఏవైనా వాహనాలు వచ్చి గుద్దేస్తాయి అని చెపుతున్నారు. అని అన్నారు.
“మీరు మరీను రమణ గారు – అంత పెద్ద మనిషి నాకు కనపడగా లేనిది, మీకు కనపడలేదా ?” అని కొట్టిపారేశాను.
నేను నమ్మలేదు, మనసులో, ఆయనకు కనిపించకపోవడం ఏమిటి? అని అనుకున్నాను.
మరో వారం తరువాత ‘శ్రీ సాయి లీలామృతం’ పుస్తకానికి అట్ట బాగా మాసిపోయి కనిపించింది. మరో అట్ట వేద్దామని ఉన్న అట్టని తీశాను.
అంతే! నా వొళ్ళు గగుర్పొడిచింది. నేను సంబ్రమాశ్చర్యాలలో మునిగిపోయాను.
ఎందుకంటే ఆ అట్ట మీద సాయిబాబా చిత్రం ఉంది. అది ఎలా ఉంది అంటే – నేను ఆ రోజు ఒక మనిషి రోడ్డు మీద కూర్చుని ఉండగా చూశాను కదా! అచ్చం ఆ మనిషి ఎలా కూర్చుని కనిపించాడో ఇప్పుడు ఈ అట్ట మీద శ్రీ సాయి నాకు అలానే కనిపించారు.
అంటే నేను ఆ రోజు చూసింది సాక్షాత్తు ఆ సాయినాధుడడేనా! ఆయన నన్నేనా మిత్రమా అని పిలిచింది అని మనస్సు చాలా ఉప్పొంగి పోయింది.
The above miracle has been typed by: Shiv Kumar Bandaru.
భరత్ రావు గారి అనుభవములు రెండవ భాగం తరువాయి……
Latest Miracles:
- భక్తురాలు అయిష్టముగా వెళ్లిన తీర్థయాత్రలో, బాబా వారు కలలో కనిపించి “నేను నీ కూడానే ఉన్నాను” అని అభయం ఇచ్చుట.
- తనకు ఆరోజు నైవేద్యం పెట్టలేదని భక్తుని కలలో కనిపించి గుర్తుచేసిన బాబా వారు
- స్వయంగా బాబా వారి పేరు మీద ఉన్న కాకడ ఆరతి టికెట్స్ మాకు ఇచ్చారు.
- సస్పెన్షన్ లో ఉన్న 10 రోజులు బాబా సేవ లో గడిపిన భక్తునికి, తిరిగి ఉధ్యోగాన్ని ప్రసాదించిన బాబా వారు
- నైవేద్యం ఏమి పెట్టలేదని బాధపడుతున్న భక్తురాలి కలలో కనిపించి బీసీ బెల్ బాత్ అడిగిన బాబా వారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments