అరవిందులు …. మహనీయులు – 2020… ఆగస్టు 15



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా స్వాతంత్ర సమరంలో పాల్గొన్నానని చెప్పారు. అరవిందు ఘోష్ ను గురించి ఎవరూ చెప్పనక్కర లేదు.

శ్రీ అరవిందుల 75వ జన్మదినాన భారత స్వాతంత్య్రం సిద్దించింది. అది బరోడా నగరం. ఆ నగరానికి అరవిందులు మరోసారి రాబోతున్నారు. పిలిచి ఉద్యోగాన్నిచ్చిన  బరోడా మహారాజే కన్నెర్ర చేశాడు ఆయనపై.

బరోడా మహారాజు అరవిందుని ఎవరూ కలవకూడదని, స్వాగత సన్మానాలు జరుపరాదని శాసించాడు. విశేషించి ఆ ఆజ్ఞ బరోడా కాలేజీ విద్యారులకు కూడా.

ఎందుకంటే బరోడా కాలేజీలో విద్యార్థుల ఆదరాభిమానాలకు పాత్రుడయ్యాడు అరవిందులు.

అరవిందులు ప్రయాణం చేస్తున్న టాంగా కాలేజీ సమీపించగానే, బిలబిలా విద్యార్థులు కాలేజీ బయటకు వచ్చి, అరవిందులు ఎక్కిన టాంగా గుర్రాన్ని తీసివేసి, ఆ విద్యార్థులే టాంగాను లాగారు.

ఇది చరిత్రలో అపూర్వ ఘట్టం. విద్యార్థులకే కాదు, భారతీయులకు, యావత్ ప్రపంచానికి ప్రేమపాత్రుడు, ఆరాధ్యనీయుడు అయ్యాడు అయన.

యావత్ భారత దేశంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా ఆంగ్ల ప్రభుత్వం గుర్తించింది.

అయన దేశ భక్త ప్రబోధక కవి. జాతీయవాద ప్రవక్త. మనవహితవాది, అంతే కాదు భారత  సాహిత్య నిర్మాతలలో అరుదైన మణిపూస.

అలీపూర్ కుట్ర కేసు తరువాత, శ్రీ అరవిందులు పుదుచ్చేరి చేరుకొని యోగసాధన చేశారు.

తన భవిష్యత్ దర్శనాన్ని దివ్య జీవనంలోను, ప్రతీక కావ్యమైన సావిత్రిలోను ఆవిష్కరించారు.

సామాన్యంగా ఇంట గెలవకుండానే రచ్చ గెలుస్తారు – శ్రీముఖులు. శ్రీ అరవిందులు, ఇంతా బైటా హెలిచారు.

అయన మృణాళినిని వివాహం చేసుకున్నారు. అరవిందుని మామగారు తన అల్లుడైన అరవిందులను గురువుగా, భగవంతునిగా ఆరాధించే వారు.

మృణాళినీ దేవి “పతిః పరమోగురుః”గా ప్రేమించేది. “స్త్రీకి భర్తే గురువు” అనేది అరవింద సిద్ధాంతం.

భర్త యొక్క సర్వ శక్తి భార్య. ప్రతి పురుషుడు భార్యలో తన ప్రతి బింబాన్ని గుర్తించాలి. అదే అతని శక్తి. అరవిందులు పూర్ణ యోగాన్ని చాటారు.

“నలుగురి కళ్ళకు నరుదుగా కనపడే బాహ్య సన్నివేశాలు నా జీవితంలో ప్రధానమైనవి కావు” అంటారు శ్రీ అరవిందులు.

అరవిందులు తన జ్ఞానాన్ని, ధనాన్ని, విజ్ఞానాన్ని అందరకూ ఇచ్చిన మహా దాత.

నేడు ఆగస్టు 15. నేడు అరవిందుల జన్మదినం.

శ్రీ అరవిందులు తన మార్మిక రచన సావిత్రిలో చెప్పినట్లు “ఈశ్వరుని సంతానమైన మనం ఈశ్వరునిగా మనగలగాలి” అని చెప్పారు.

ఆ ఆశయాన్ని నెరవేర్చలేకున్నా, నెరవేర్చేందుకు చేసే ప్రయత్నమే మనము అరవిందులకు ఇచ్చే నివాళి!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “అరవిందులు …. మహనీయులు – 2020… ఆగస్టు 15

PNRaju

Please Divine life and essase on geeta also Savitri written by SriArobindo..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles