Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తుడు: సురేష్ గౌడ్
నివాసం: యల్.బి.నగర్
నా పేరు సురేష్ గౌడ్. నేను L .B నగర్ లో ఉంటాను. నా జీవితంలో అద్భుతమైన లీల జరిగింది. దానిని మీతో పంచుకోవడానికి బాబా అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉంది.
ఇది 20 సంవత్సరాల క్రితం జరిగింది. నేను మా బావమరిది ఇద్దరం కలిసి ఒక బిజినెస్ ని మొదలు పెట్టాం. అంతా సజావుగానే ఉంది.
వ్యాపారం బాగానే అభివృద్ధి చెందింది. కాలక్రమేణా మా బావమరిదికి, నాకు మధ్యన మనస్పర్ధలు వచ్చాయి. ఇక నాకు కలిసి ఉండడం ఇష్టం లేక బిజినెస్ నుండి పక్కకు తప్పుకున్నాను.
ఏమితోచని స్థితి. కొత్తగా పెళ్లయింది ఖాళీగా ఉన్నాను. మనస్సు ఏమి బాగోలేదు.
పక్కకు జరిగాక కేవలం ఏడు వేలు మాత్రమే మిగిలాయి. ఏం చేయాలో అర్ధం కాక బాబా గుడికి వెళ్లి బాబా కాళ్ళు పట్టుకుని గట్టిగా నా మొర చెప్పుకున్నాను.
బాబా ఏం చేస్తావో నాకు తెలియదు నా దగ్గర ఏడు వేలు ఉన్నాయి వీటికి పదింతలుగా చేసినాకు బిజినెస్ పెట్టివ్వు భారం అంతా నీ మీదనే వేస్తున్న అని చెప్పి ఇంటికి వెళ్ళాను.
కొన్ని రోజులు గడిచాయి. నా బంధువులలోన ఒకరు చిట్టి మొత్తం ఎత్తుకుని తీసుకొని నీవు బిజినెస్ పెట్టుకో తర్వాత నాకు ఇవ్వు అంటూ నాకు డబ్బులు ఇచ్చారు.
ఆశ్చర్యం ఏమిటంటే నేను వారిని డబ్బులు అడగలేదు. బిజినెస్ పెట్టుకున్నాను, చాలా బాగా వృద్ధిలోకి వచ్చింది.సంతోషంగా ఉన్నాం.
ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు షాప్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి అంతా సిద్ధం చేసుకున్నాము.
అంతలో ఒక ముసలాయన కాషాయ వస్త్రం ధరించి అచ్చం బాబా లాగే ఉన్నారు. నా దగ్గరకు వచ్చి దక్షిణ అడిగారు.
“నేనే నీకు అన్నం పెట్టాను. నాకు తెలియదు నాకు నువ్వు డెబ్భై రూపాయలు ఖర్చు చేసి అన్నం తినిపించాలి” అన్నారు. పది రూపాయలు ఇచ్చి వెళ్ళు తినుపో అన్నాను.
అప్పట్లో అంటే ఏడు రూపాయలకు భోజనం హోటల్లో దొరుకుతుంది. కానీ తాను డెబ్భై రూపాయలు అడుగుతున్నందున ఇవ్వను వెళ్ళువెళ్లు అన్నాను.
నేను ఇచ్చిన అన్నం తింటూ నాకు అన్నం పెట్టవా? “అంటే నువ్వు నన్ను నమ్మటం లేదా!” అని అంటూ నేను కూర్చున్న కుర్చీ వెనక బాబాగారి ఫోటోకి ఉన్న దండలో నుండి ఒక పువ్వుని తీసి చేతితో నలిపి విభూతిగా మార్చారు.
“ఇంకా నమ్మట్లేదా!” అని మళ్ళీ ఇంకో పువ్వు నలిపి మళ్ళీ విభూతిగా మార్చి నా నుదుటిన పెట్టారు. అయినా కానీ ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు అనుకున్నా.
“ఇంకా నమ్మవా” అంటూ మూడోసారి కూడా పువ్వు నలిపి విభూతిగా మార్చి చూపించారు. “నాకు అన్నంకు డెబ్భై రూపాయలు ఇవ్వు నీకు అంతా మంచి జరుగుతుందని” చెప్పారు.
కానీ, ఒక మాయ చేత బాబాని గుర్తించలేకపోయాను. ఆయన బయటకు వెళ్ళిపోయాక అప్పుడు నాకు అన్పించ్చింది.
ఒకవేళ నిజంగా బాబానేమో! మోసం ఏం లేదేమో అనుకుని బయటకు వచ్చాను. కానీ క్షణంలో ఆయన మాయం అయిపోయారు .
ఏడు వేలను డెబ్భై వేలుగా మార్చి నాతొ బిజినెస్ పెట్టించారు. అందుకే ఏడు రూపాయల భోజనం కోసం డెబ్భై రూపాయలు అడగడానికి వచ్చారు.
కానీ నేను తనని గుర్తించలేక పోయాను. అందుకే బాబాకు గుడిలో అన్నదానం కోసమని నాకు తోచినంత సహాయం చేస్తూ అప్పుడు ఇవ్వని దక్షిణ ఇప్పుడు ఇలా ఇస్తూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నాను.
~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~
***సాయిసూక్తి:
“ఎల్లప్పుడూ నా పై దృష్టి నిలుపు,నా నామాన్ని స్మరించు”.
Latest Miracles:
- దారి చూపిన దీన బాoధవుడు
- ఈ మధ్య నేను బాబా ను నమ్ముకున్నాను , అప్పటి నుండే నాకు ఈ భోగం
- ఎన్నో క్లిష్ట పరిస్థితుల నుండి నన్ను బయటపడేసిన బాబా వారు …..!
- బాబా పేరును మాత్రమే ఉంచి ప్రారంభించిన నా కొత్త వ్యాపారం సక్సెస్ అవ్వుట
- భర్త చనిపోయి కష్టములొ ఉన్న భక్తురాలికి, పని నేర్పించి మంచి ఉద్యోగం ఇప్పించిన బాబా వారు…..
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments