నేను మీకెంతో వాళ్ళకీ అంతే!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

‘‘నీ కోరికను కాదంటానా మహల్సా, త్వరగా ద్వారకామాయికి రా, నన్నేరకంగా నువ్వు అలంకరించాలనుకుంటున్నావో ఆ రకంగానే అలంకరించుకుని ఆనందించు.’’ బాబా మాటలు గదిలో ప్రతిధ్వనించాయి.

‘‘బాబా’’ అంటూ చేతులు జోడించాడు మహల్సా. నిద్రపోలేదు మరి. అప్పటికప్పుడే స్నానం చేసి, మంచిగంధం తీయడంలో మునిగిపోయాడు.తెల్లారింది. పరుగు పరుగున ద్వారకామాయికి చేరుకున్నాడు మహల్సా. బాబాని దర్శించుకున్నాడు. అయనకి ఆనందంగా చందనం పూశాడు.

‘‘సంతృప్తిగా ఉందా?’’ అడిగారు బాబా. ఉన్నదన్నట్టుగా తలూపాడు మహల్సా. నాటి నుంచి రోజూ బాబాకి మహల్సా చందనం పూసి ఆనందించేవాడు.

ఇది కొందరు ముస్లిం భక్తులకు నచ్చలేదు. బాబాని వారంతా ముస్లింగా భావించడమే దీనికి కారణం.బాబాకి చందనం పూసేందుకు మంచిగంధం తీసుకుని, ద్వారకామాయిలో అడుగుపెడుతున్న మహల్సాని ఓనాడు ముస్లిం భక్తులు అడ్డుకున్నారు.

‘‘మహల్సా! బాబా మా మనిషి. ముస్లిం. ఆయన ముఖానికి మాకిష్టంలేని చందనం పూశావో, గొడవలయిపోతాయ్‌. జాగ్రత్త.’’ హెచ్చరించారు.‘‘అదికాదు భయ్యా…’’ ఏదో చెప్పబోయాడు మహల్సా.

‘‘వద్దు. నువ్వేమీ చెప్పొద్దు, మేం చెప్పింది గుర్తుంచుకో, చాలు.’’‘సరే’నన్నట్టుగా తలూపాడు మహల్సా. గంధాన్నిదాచిపెట్డాడు. వట్టి చేతుల్తో వచ్చి, బాబాని దర్శించుకున్నాడు.

‘‘గంధం ఏది?’’ అడిగారు బాబా.జవాబుగా భయం భయంగా అక్కడ నిల్చున్న ముస్లిం భక్తుల్ని చూశాడు మహల్సా. బాబాకి అంతా అర్థమయింది.

‘‘రా, నాకు గంధం పూయి. ఎవరడ్డొస్తారో చూద్దాం.’’ అన్నారు బాబా.‘‘వెళ్ళు, గంధం తీసుకుని రా.’’ ఆదేశించారు మహల్సాని. దాచి పెట్టిన గంధాన్ని తెచ్చేందుకు ముందుకు నడిచాడు మహల్సా. పరిస్థితి చేతులు దాటి పోతున్నదని గ్రహించారు ముస్లిం భక్తులు. బాబాతో ఇలా అన్నారు.

‘‘బాబా నువ్వు ముస్లింవి, హిందువువి కాదు, అది గుర్తుపెట్టుకో.’‘‘నేను ముస్లిం అని మీకు చెప్పానా?’’‘‘నన్ను కన్నదెవరో మీకు తెలుసా? నేను ముస్లింని కాను. అలా అని హిందువు అనుకుంటే పొరబాటే! నాకు కులాలూ, మతాలూ లేవు.

నేను మీకెంతో వాళ్ళకీ అంతే! ఎవరిష్టం వాళ్ళది. మహల్సా నాకు చందనం పూస్తాడు. నేను పూయించుకుంటాను.

అడ్డు చెప్పొద్దు. చెప్పారో, మీరు చెప్పడం కాదు, నేను చెబుతున్నాను, గొడవలయిపోతాయి.’’ అన్నారు బాబా. వేలెత్తి చూపించి మరీ హెచ్చరించారు.

తప్పయిపోయిందన్నట్టుగా తలలొంచుకున్నారు ముస్లిం భక్తులు. గంధాన్ని పట్టుకుని మెల్లగా మెల్లగా వస్తున్న మహల్సాని కేకేశారు బాబా.

‘‘తొందరగా రావయ్యా! చందనం పూయవయ్యా.’’వచ్చాడు మహల్సా. బాబాకి చందనం పూసి, ఆయన్ని తృప్తిగా చూసుకున్నాడు.

 

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “నేను మీకెంతో వాళ్ళకీ అంతే!

prathibha sainathuni

E leela chaduvutunte inni rojulu baba photokinenu gandam to alankarinchina rojulu gurtostunnai…

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles