Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
మొలల వ్యాధిని తగ్గించిన బాబా.
శ్రీశైలం ప్రాజెక్ట్ లోని బాబా మందిరములో నేను ట్రెజరర్ గ పని చేసే సమయంలో మొలలుకు ఆపరేషన్ జరిగింది.
ఆపరేషన్ ఫెయిల్ అయ్యి మొలల నుండి రక్తం కారసాగింది. ఇంజక్షన్ చేసినా తగ్గలేదు.
ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు. కర్నూల్ తీసుకొని వెళ్ళడానికి వెహికల్ మాట్లాడాము.
నేను బాబా ముందర చీట్లు వేస్తె కర్నూల్ వెళ్ళక్కరలేదు అని వచ్చింది.
రక్తం ఆగలేదు. అప్పుడు బాబా కి ఎలా మొక్కుకున్నా, తెల్లవారేలోగా రక్త స్రావం తగ్గకపోతే కర్నూల్ వెళ్ళిపోతాను బాబా అని అన్నాను.
ఆ రాత్రి గం. 9.00 సమయంలో మా పెద్ద బావమరిది శివ ప్రసాద్ కుమారుడు నా గది లోకి వచ్చి అతని చేతితో ఆపరేషన్ స్థానాన్ని తాకినట్లనిపించింది.
గాయం పెద్దదయిందేమో అన్న భయం వేసింది.
ఆ రాత్రి నా కలలో ఒక కర్ర నా గదిలో తిరుగుతున్నట్లు కల వచ్చింది.
అది రమణుల వారి చేతిలోనే కర్ర అయి ఉండవచ్చు లేదా బాబానే నా కర్మఫలాన్ని కర్రతో తరిమేసి యుండవచ్చు అని నా మిత్రుడు జగదీశ్ చెప్పాడు.
అంతే తెల్లవారే లోపు రక్తస్రావం ఆగిపోయింది.
అంతక ముందు రెండు నిముషాలు కూడా మంచం మీద కూర్చోలేని నేను ఆ మరసటి రోజు గురుపౌర్ణమి నాడు మూడు గంటలు గుడిలో కూర్చుని పారాయణ, కీర్తన చేయకలిగాను.
మరొకసారి నాకాల భేణికి దాదాపు రెండు నెలలు కాలు క్రింద పెట్టలేకపోయాను.
నా ధర్మ పత్ని సాయిసత్చరిత్ర పారాయణ పూర్తి చేసిన రాత్రి ఆరతి ఇస్తుండగా కాలు క్రింద పెట్టి నాలుగు అడుగులు వేయకలిగాను.
ఆ ఆనందముతో బాబా మీద పాట వ్రాసి పాడాను.
మరొకసారి బాబా మందిరములో విజయదశమి రోజు రాత్రి 7 -00 గం|| లకు బాబా శాలువాలు డిప్పు ద్వారా భక్తులకి ఇస్తుంటే రెండు శాలువాలు నా కూతుళ్ళిద్దరికి వచ్చినవి. ఇలా రావడం నేను భవిష్యత్ లో బాబా మందిరములో కోశాధికారిగా సేవలు చేసేందుకు సూచన అని అనుకొన్నాను.
1998 లో నేను మూలాధారణలో ఉండగా, బాబాను చూసిన కళ్ళతో వేరొకరిని చూడలేని స్థితిలో ఉండగా ఆ రోజు రాత్రి బాబాగారు ఆంజనేయస్వామిల కనిపించి నా చెవిలో ‘నారాయణ’ అనే మంత్రము ఉపదేశించారు.
నేను ఆ మంత్రానికి సాయి అని చేర్చుకొని సాయి నారాయణ అని జపించడము ప్రారంభించాను.
ఆ రోజు నుండి శ్రీ రాముడు అంటే, శ్రీ కృషుడు అంటే శివుడు అంటే విగ్నేశ్వరుడు అంటే షణ్ముఖుడు అంటే, అర్ధంవడం అనుభవంలోకి వచ్చింది. వీరంతా బాబానే అయి ఉన్నారు అని అనుభవమయింది.
బుద్ధుడు ఆదిశంకరలు రామకృష్ణులు, రమణులు, వివేకానందులు, మలయాళ స్వామి ఇలా అందరూ బాబా నే అయిఉన్నారు అని అనుభవం అవుతూ వచ్చింది.
శ్రీ శైలం ప్రాజెక్ట్ లో శ్రీ సాయినాధుడు, శంఖు చక్రాలతో వెలసి శ్రీసాయి నారాయణులై భక్తులకి కనువిందు చేసారు.
ముందు భాగము … తరువాతి భాగము.
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
Latest Miracles:
- నేను మీకెంతో వాళ్ళకీ అంతే!
- అంతే అటు తర్వాత నాకు జ్వరము రాలేదు—Audio
- అంతే ప్రాప్తి ….. సాయి@366 మార్చి 10….Audio
- దృష్టి ఆమె మీద పడగానే విచిత్రంగా కళ్ళనొప్పి తగ్గి పోయి నీరు కారడం కూడా ఆగిపోయింది–Taarkad-32–Audio
- “బాబా” అని గట్టిగా కేకేశాడు ‘నానా’. అంతే! రెండు అదృశ్య హస్తాలు అక్కడ ప్రత్యక్షమయ్యాయి.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “అంతే తెల్లవారే లోపు రక్తస్రావం ఆగిపోయింది.”
kishore Babu
May 22, 2017 at 9:12 amఈ లీల చదువుతుంటే ఒళ్ళు గగుర్పుడిచినట్లు అనిపిస్తుంది. సాయిదాసు గారు చాల అదృష్టవంతులు. కనపడితే పాదాభి వందనం చేయాలి అనిపిస్తుంది. శ్రద్ధ , సభూరి అంటే ఆలా ఉండాలి అనిపిస్తుంది. సాయి బాబా…సాయి బాబా.
Maruthi
May 22, 2017 at 10:18 amSai Baba…Sai Baba. Jagamantha Sai mayam-ee janulantha Sai Kutumbam, Ekkada vinna sai naamame-ekkada chusina Sai roopame, akkada ikkada akkadanyna-ikkada akkada akkadanyna a roopam apuroopam. Manthralayamuna..RAGHAVENDRUDY,pandaripuramuna..PANDURANGADY,Bhadrachalamuna.. RAMACHANDRUDY,Shiridi lona..SAINATHUDY,Dwarakamayi Lo SAIDEVUDY……………….Annavaramu lo..SATHYADEVUDY,sreesilamu lo..MALLIKHARJUNUDY,Thirupathi lona ..SRINIVASUDY,Shiridi lona..SAINATHUDY,Dwarakamayi lo..SAIDEVUDY, Jagamantha Saimayam
kishore Babu
May 22, 2017 at 10:25 amThank you Sai for your comment…Sai Baba…Sai Baba
సాయినాథుని ప్రణతి
May 22, 2017 at 5:44 pmచాలా బాగునాయి కిషోర్ గారు మీ ఈ లీలలు , ఇంకా సాయి సురేష్ గారివి బడే బాబా గురించినవి ఇంక సురేష్ గారు బాబాతో అనుబందంతో వునవారి లీలలు చదువు తుంటే చాలా బాగునాయి.
kishore Babu
May 23, 2017 at 9:26 amThank you mam…Sai Baba…Sai Baba