మనం సాయిబాబా గురించి యెందుకు రాయాలి–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

ఈ రోజు నా స్నేహితురాలొకామె నన్ను చాలా విచిత్రమైన ప్రశ్న ఒకటడిగింది. ఆమె నన్నిలా అడిగింది..  నువ్వు సాయిబాబాని గురించి యెందుకు రాస్తున్నావు.

యిప్పటికే నెట్లో చాలా బ్లాగులు, వెబ్ సైట్లు వున్నాయి, నువ్వు కూడా యింటి దగ్గిర యెందుకంత శ్రమపడతావు…అని….

ఒక విథంగా ఆమె కరెక్టే.. ఆమె ప్రశ్న కూడా మంచిదే, నేను ఆ ప్రశ్నకి సమాథానం చెప్పదలచుకున్నాను.

మొట్టమొదటగా బాబా గురించి రాయడానికి నేను ధైర్యం చేయను, బాబాయే నా చేత రాయిస్తున్నారు,

మనం యెంతోమంది ప్రేక్షకుల మధ్య రంగస్థలం మీద ఆడుతున్న ఒట్టి తోలుబొమ్మలం మాత్రమే…దానికి మహా నిర్ణేత…సాయి.

యిక రెండవది, నేను సాయిబాబా మీద బ్లాగ్స్ తయారు చేస్తాను.. ప్రపంచవ్యాప్తంగా నేను ఉచితంగా సాయి సచ్చరిత్రలు పంపుతున్నాను… ఉచితంగా ఊదీ పంపుతాను… ఇంకా.. అలా… అలా…

ఈ విశ్వంలో ప్రతీ సాయిభక్తుడి గృహానికి సాయిబాబా చేరాలి..

మానవులందరూ తమ జీవితంలో ఒక్కసారయినా సచ్చరిత్రను చదవాలనీ..

కారణం ఒక్కసారి చదివితే కనక వారు మారతారు..  వారి ప్రవర్తనలోను, ఆలోచనలోను.. ప్రవృత్తిలోను.. .వారు అనుకూలంగా ఆలోచిస్తారు.. వారికి దయార్ద్ర హృదయం ఉంటుంది..

వారు యితరులని మోసం చేయరు… వారు అసత్యమాడరు… ఇవన్ని నేను అనర్గళంగా ఈ కారణాలన్ని చెపుతూనే ఉన్నాను.

అప్పుడు కారులో నాపక్కన కూర్చున్న నా స్నేహితురాలు ఏడుస్తోందని గమనించాను. అటువంటి ప్రశ్న అడిగినందుకు క్షమించమని అడిగింది.

ఆమె అడిగింది కరెక్టే, ఆమే కాదు, మనమందరమూ కూడా సాయిబాబా గురంచి మనమెందుకు రాయాలి, చదవాలి అని ఆలోచిస్తాము..

అటువంటివారందరికీ నేను ఒకటే చెపుతున్నాను ఒక్కసారి సచ్చరిత్ర చదవండి అప్పుడు ఈ ప్రశ్న మరొకసారి అడగండి.

ఆయనలో నమ్మకముంచుకుంటే బాబా మీ జీవితాన్ని మారుస్తారు. ఒక్కసారి శ్రీ సాయిబాబా పాదాలవద్ద శరణాగతి చేస్తే ఏ సాథనలోను మీ కాలాన్ని వ్యర్థం చేసుకోనక్కరలేదు.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “మనం సాయిబాబా గురించి యెందుకు రాయాలి–Audio

సాయిరాం. మనం నిమ్మిత్త మాత్రులమే. ఎవరితో ఏమి చేయించాలో బాబాగారికి తెలుసు. “నేను” అనే అహం మనకు లేదుకాబట్టి శ్రీ సాయిసచ్చరిత్ర ఈ రోజు 48 అధ్యాయాలు టైపు చేయించి మరీ పోస్ట్ చేయిస్తున్నారు. అంతా బాబాగారి ఆశీర్వాదముతో, సంకల్పముతో జరుగుతున్నది. అదే నేను చేస్తున్నాను అని అనుకుంటే “మామిడి పూత” లా ఎప్పుడో రాలి పోయేవాడ్ని. జై సాయిరాం.

kishore Babu

you are great Sir…When We avoid “I”..Then everything Baba will take care…Sai Baba…Sai Baba.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles