Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై!!
బాలారామ్ మాన్ కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా నుండెను. అతని భార్య చనిపోయెను. అతడు విరక్తిచెంది కొడుకునకు గృహభారమప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో నుండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని, అతనికి సద్గతి కలుగ జేయవలెనని యీ దిగువరీతిగ జేసెను. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చీంద్ర గడలో నుండుమనెను. బాబాను విడిచిపెట్టి మచ్చీంద్రగడలో నుండుట అతని కిష్టము లేకుండెను. కాని యదే అతనికి మంచి మార్గమని బాబా యొప్పించెను. అచట రోజుకు మూడుసారులు ధ్యానము చేయమనెను. బాబా మాటలందు నమ్మకముంచి మాన్ కర్ గడముకు వచ్చెను. అక్కడి చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతిసౌందర్యమును జూచి సంతసించి, బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానముచేయ మొదలిడెను. కొలది దినముల పిమ్మట యొకదృశ్యమును గనెను. సాధారణముగా భక్తులు సమాధిస్థితియందు దృశ్యములను పొందెదరుగాని మాన్ కర్ విషయములో నట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దృశ్యము లభించెను. అతనికి బాబా స్యయముగా గాన్పించెను. మాన్ కర్ బాబాను జూచుటయేగాక తన నచట కేల పంపితివని యడిగెను. బాబా యిట్లు చెప్పెను. “షిరిడీలో అనేకాలోచనలు నీ మనస్సున లేచెను. నీ చంచలమనస్సునకు నిలకడ కలుగజేయవలెనని యిచటకు బంపితిని. ” కొంతకాలము గడచిన పిమ్మట మాన్ కర్ గడమును విడచి బాంద్రాకు పయనమయ్యెను. పూనానుండి దాదరుకు రైలులో పోవలెననుకొనెను. టిక్కెట్టుకొరుకు బుకింగ్ ఆఫీసుకు పోగా నది మిక్కిలి క్రిక్కిరిసి యుండెను. అతనికి టిక్కెటు దొరకకుండెను. లంగోటి కట్టుకొని కంబళికప్పుకొని ఒక పల్లెటూరివాడు వచ్చి, “మీరెక్కడికి పోవుచున్నా” రని యడిగెను. దాదరుకని మాన్ కర్ బదులు చెప్పెను. అతడిట్లనెను. “దయచేసి నా దాదరు టిక్కెటు తీసికొనుము, నాకవసరమైన పని యుండుటచే దాదరుకు వెళ్ళుట మానుకొంటిని.” టిక్కెటు లభించినందున మాన్ కర్ యెంతో సంతసించెను. జేబులోనుంచి పైకము తీయునంతలో నా జానపదు డంతర్ధానమయ్యెను. మాన్ కర్ ఆగుంపులో నతనికై వెదకెను. కాని లాభము లేకపోయెను. అతని కొరకు బండి కదలునంతవర కాగెను. కాని వాని జాడయే కానరాకుండెను. మాన్ కర్ కు కలిగిన వింత యనుభవములందు ఇది రెండవది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్ కర్ షిరిడీ చేరెను. అప్పటినుంచి షిరిడీలోనే బాబా పాదముల నాశ్రయించి యుండెను. వారి సలహాల ననుసరించి నడుచుకొనుచుండెను. తుదకు బాబా సముఖమున వారి యాశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అత డెంతో యదృష్టవంతు డని చెప్పవచ్చును.
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాలారామ్ ధురంధర్ (1878 – 1925)
- భికాజీ మహేద్జీ
- డాక్టర్ తల్వైల్ కర్ – ఊదీని మించిన మందు లేదు–Audio
- బాబా అతని మొహం మీద చాలా గట్టిగా ఒక్క చరుపు చరిచారు–కేశవ్ భగవాన్ గావన్ కర్-4–Audio
- కేశవ్ మెల్ల మెల్లగా పూర్తిగా కోలుకున్నాడు–కేశవ్ భగవాన్ గావన్ కర్-2–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments