Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
తెల్లారింది.బాబా అనుమతి కోసం నమూనాను పట్టుకుని ద్వారకామాయికి చేరుకున్నారు ముగ్గురూ(బాపూ సాహెబ్ బూటీ,శ్యామా,కాకాసాహెబు దీక్షిత్). నమూనాను బాబా చూశారు. బాగుందని మెచ్చుకున్నారు. ఆశీర్వదించారు.
‘‘ఈ భవనంలో చుట్టూ గదులుంటాయి బాబా. మధ్యలో మందిరం ఉంటుంది. ఆ మందిరంలో కృష్ణుణ్ణి ప్రతిష్ఠిద్దాం.’’ అన్నాడు బూటీ.‘‘తప్పకుండా అలాగే చేద్దాం. బూటీవాడాలో గోపాలకృష్ణుడు ఉండాల్సిందే.’’ అన్నారు బాబా.
బూటీవాడా! తాను నిర్మించబోయే భవనానికి నామకరణం జరిగిపోయింది. ఆనందించాడు బూటీ.‘‘ముందు మందిర నిర్మాణం పూర్తిగానీ, పూర్తయితే కృష్ణుడు తనంత తానుగా వచ్చి కూర్చుంటాడక్కడ.’’ అన్నారు బాబా.
ఆ మాటతో ముందుకురికాడు బూటీ. ద్వారకామాయి పక్కనున్న స్థలాన్ని కొనుగోలు చేశాడు. భవన నిర్మాణం ప్రారంభించాడు. ఒక పక్క భవన నిర్మాణం జరుగుతూంటే మరో పక్క మందిరంలో ప్రతిష్ఠించేందుకు కృష్ణుని విగ్రహాన్ని చెక్కించే ప్రయత్నాల్లో పడ్డాడు బూటీ.
బూటీవాడా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. లెండీతోటకు వెళ్ళేటప్పుడల్లా బాబా నిర్మాణ పనుల్ని పర్యవేక్షించేవారు. అవసరమయిన సూచనలు అందజేసేవారు.ఒకరోజు బూటీవాడాని పర్యవేక్షిస్తూ మందిరం లోనికి ప్రవేశించారు బాబా.
అక్కడ శ్రీకృష్ణుణ్ణి ప్రతిష్ఠించేందుకు నిర్మించిన వేదికను చూశారు. బాగుంది అన్నట్టుగా మెచ్చుకోలుగా కళ్ళు పెద్దవి చేశారు. తర్వాత మెల్లగా వెళ్ళి వేదికను అలంకరించారు. కూర్చున్నారక్కడ.
‘‘అక్కడ ఆ స్థలంలో శ్రీకృష్ణుణ్ణి ప్రతిష్ఠిస్తాం బాబా.’’ అన్నాడు బూటీ.‘‘ప్రతిష్ఠాపన అయిపోయింది. ఇక నుంచి ఇదే నా స్థానం.’’ అన్నారు బాబా.‘‘బాబా’’ అంటూ బూటీ, శ్యామా చేతులు జోడించి, నమస్కరించారు. వారికి శ్రీకృష్ణ దర్శనం అయింది.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- మీరు కూడా నాతో పాటే అక్కడకి(బూటీవాడా) రండి. మీరూ నేనూ అందరం అక్కడే ఉందాం.
- మందిర నిర్మాణం – మారిన మనసులు-Audio
- ‘‘ద్వారకామాయి పక్కనే ఓ వాడా నిర్మించు. దాని మధ్యలో ఓ మందిరాన్ని కూడా నిర్మించు.”
- ఒడిదుడుకులు లేకుండా బాబా మందిర నిర్మాణం పూర్తి అవుట.
- ‘‘ఇది వట్టి ఇటుక అనుకుంటున్నారేమో! కాదు. ఇది గురుప్రసాదం.”
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments