Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తురాలు: రజని
నివాసం: హైదరాబాద్
సాయి భక్తులందరికి నమస్కారం. నా పేరు రజని. బాబాతో నాకున్న అనుబంధాన్ని మీతో ఇలా పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
బాబా ప్రేమ అనేది తరగని పెన్నిది. అది ఎంత చెప్పినా, ఇంకా ఏదో వెలితిగానే ఉంటుంది.
నాకు వీలైన రీతిలో బాబాతో నాకున్న అనుభందాన్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. నాకు మొదటి నుండి బాబా అంటే ఇష్టం.
మేము హైదరాబాద్ లో వెంగళరావునగర్ లో నివాసo ఉన్నప్పుడు దగ్గరలోని బాబా టెంపుల్ కి ప్రతి రోజు వెళ్ళేవాళ్ళం.
అలా వెళ్తున్న రోజులలో ఒకసారి ఒక నియమంగా ఉదయం బాబా హారతికి, మధ్యాహ్నం మియాపూర్ లోని నాంపల్లి బాబా టెంపుల్ లో హారతికి అటెండ్ అవ్వాలని అనుకుని అలాగే వెళుతున్న రోజులలో ఒకరోజు మధ్యాహ్నం బాబా హారతి ముగించుకుని బయటకు వచ్చి నిలుచున్నాను.
అప్పుడు బాబాలాగా ఉన్న ఒక వ్యక్తి కనిపించారు. చూడడానికి అచ్చు బాబాలాగే ఉన్నారు.
నేను వంద రూపాయలు దక్షిణ ఇద్దామని ఇస్తుంటే తీసుకోను అన్నారు. ఆశీర్వదించుమని పాదాలకు నమస్కరిస్తుంటే అది రియల్ గా బాబానే అనే ఫీలింగ్ కలిగింది.
అచ్చు శిరిడీలో బాబా వేసుకునే పాదుకలలాగానే ఉన్నాయి ఆ పాదుకలు. చేతిలో సటక, భుజానికి జోలె అచ్చు శిరిడీలో బాబా వేసుకునేవే.
నాకు ఇతను బాబా అనే అభిప్రాయం బలంగా అనిపించి ఎలాగైనా దక్షిణ తీసుకోమని బలవంత పెడితే రెండు రూపాయలు తీసుకుంటూ ఉదయం హారతిలోని లైన్ ని ఇలా చెప్పారు.
తమా నిరసి భానుహ గురుహి నాసి అజ్ఞానతా, పరంతు గురుచీ కరీ నారవిహీ కధీ సామ్యతా (సూర్యడు చీకటిని తొలగించినట్లు, గురువు అజ్ఞానాన్ని పారద్రోలుతాడు) అని.
తన చేతిలో నుండి రెండు శిరిడీ ఊధీ పాకెట్స్ నా చేతిలో పెట్టారు.
అది కూడా ఎలాగంటే ఏదో విలువైన వస్తువుని, ఎవరు చూడకుండా ఇస్తూ దాచి పెట్టుకోమని చెపుతారుగా అలా తన చేతిలో నుండి ఊధీ పాకెట్స్ నా చేయి తీసుకుని అందులో పెట్టి మళ్ళీ నా చేయిని గట్టిగా మూసేసాడు.
అలా ఇస్తున్నప్పుడు మా బిడ్డలు మా కోసం ఇష్టపడి ఇంత దూరం వస్తే మేము ఇంత కన్నా ఎక్కువ కష్టపడతాము అని అన్నారు.
అలా అంటున్నప్పుడు బాబా కళ్లలో నుండి నీరు కారుతుంది. మీరు మంచి పని చేస్తున్నారు ఎప్పుడు అలాగే చేస్తూ ఉండండి అని కూడా చెప్పారు.
మేము ప్రతి ఆదివారం మా ఇంట్లో సత్సంగం చేసుకుంటాము దాని గురించే చెపుతున్నారేమో అనుకున్నాను. అలా చెప్పి వెంటనే చాలా వేగంతో అక్కడి నుండి వెళ్లిపోయారు.
మేము బాబాని ఫాలో చేద్దాము అని తనవెంట యెంత స్పీడ్ గా వెళుతున్న కూడా మాకు అందనంత దూరంతో వేగంగా అక్కడ ఉన్నగుట్టల పైకి వెళ్లిపోయారు. మేము తాను వెళ్లిన వైపే చూస్తున్నాం.
ఇంతలోనే గుట్ట పైకి ఎక్కి ఆ చెట్ల మధ్యలో ఒక బండపై కూర్చుని అక్కడ మంట వెలిగించారు. ఆ మంట మాకు కనిపిస్తూనే ఉంది. అలా కొంత సేపు అయ్యాక బాబా మరి కనిపించలేదు.
మామూలు వ్యక్తి అయితే అలా మండు వేసవిలో అంత స్పీడ్ గా గుట్టపైకి ఎక్కగలిగే వారు కాదు, అలా మధ్యాహ్నం 1:30 గంటలకి అలా దుని వెలిగించినట్టు మంటలు వెలిగించేవారు కాదు.
మళ్ళీ బాబా వేసుకున్న దుస్తులు, పాదుకలు, సటక అన్ని కూడా శిరిడీలో బాబా వేసుకున్నటువంటివే. ఇక్కడ ఈ కాలంలో అలాంటివి ఎవరు వేసుకోరు. కనుక అలా వచ్చింది బాబానే అనుకున్నాము.
ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్లతో చెపితే తరువాత రోజు బాబా మంటలు వెలిగించిన చోటు చూడాలని గుట్టపైకి ఎక్కి ఆ చెట్ల మధ్యలో ఎక్కడ చూసినా అక్కడ అంతకు ముందు మంటలు వెలిగించిన గుర్తులు కనుగొనలేకపోయారు.
నేను బాబాని కనిపించినప్పుడు ఏమి అడగలేకపోయాను. నేను ఎప్పుడు బాబాని ఏమి అడగను.
నాకు ఎలా అడగాలో, ఏం అడగాలో సరిగా తెలియదు. అందుకే అప్పుడు బాబాని సరిగా అడగలేకపోయాను.
కానీ మనం అడగకున్న బాబా ఇస్తారు. కానీ మనం కూడా బాబాని అడగాలి, అడగడం నేర్చుకోవాలి అని అప్పుడు అనిపించింది.
~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~
***సాయిసూక్తి:
“నా భక్తుల ఇంట్లో అన్న వస్త్రాలకు ఎప్పుడు లోటు రానివ్వను”.
Latest Miracles:
- ఇలా వచ్చి దక్షిణ స్వీకరించి, ఆశీర్వదించారు, బాబా కాక ఇంకెవరు బాబానే.–Audio
- ముసలమ్మ రూపం – దక్షిణ–Audio
- సశరీరులుగా బాబా దర్శనం …………సాధనతో సాధ్యం ……..!
- కష్టాలలో ఉన్న భక్తుని ఆధ్యాత్మిక మార్గంలోనికి తీసుకొని వచ్చిన అవధూతల దర్శనం…Audio
- బాబా అడిగి చెల్లించుకున్న దక్షిణ వైనం!!–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments