Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మేము ఆంధ్రప్రదేశ్ లోనే కాక, మొత్తం ఇండియాలో ఉన్న పుణ్య క్షేత్రాలన్నీ చూసాము.
శ్రీలంకలో శాంకరీ అమ్మవారిని చూడాలని నాలుగు నెలలు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నాము. మేము అలా ఎక్కడికి వెళ్లాలనుకున్నా నాలుగు నెలల ముందుగానే టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళము.
రైలు టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ తీసుకు వచ్చి బాబా పాదాల ముందు పెట్టి,
ఇదిగో బాబా టికెట్స్, నువ్వూ మాతో పాటు ఉండు,మేము వెళ్లి వచ్చేటంత వరకూ ఇల్లు చూసుకో అని, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ వచ్చేంతవరకు నీదే భారం,
ఏ ఆపదలు రానీయకు, ఏ కష్టం కలగకుండా చూడు అంటూ గట్టిగా చెప్పి మేము శరణాగతిగా నమస్కారాలు చేస్తున్నాము అని బాబా పాదాలకి మా తలలు కొట్టుకుని మరీ బయలుదేరుతాము.
మేము తిరుగుతూ విదేశాలకు కూడా వెళ్ళాము. మొత్తం మీద ఒక కోటి ఎనభై లక్షల కిలోమీటర్లు తిరిగాము. ఈసారి కూడా అలాగే బాబాకి చెప్పి బయలుదేరాము.
శాంకరీ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. అక్కడ పూజారి గారు మమ్మల్ని ఎక్కడనుండి వచ్చారు అని అడిగారు.
మేము హైదరాబాద్ నుండి వచ్చాము అనీ, మేము చాలా దేశాలు తిరిగామనీ, అన్ని శక్తీ పీఠాలు చూసామని చెప్పాము.
ఆ పూజారి గారు ”అయ్యా! నేను ఈ గుడిలో అమ్మవారిని మాత్రమే పూజిస్తున్నాను, మీరు అన్ని గుడులూ తిరిగి, అందరి అమ్మలని సేవించి, వస్తున్నారు అంటూ మా ఆవిడ చెయ్యి తన తలపై పెట్టుకుని ఆశీర్వాదం చేయించుకున్నాడు.
అక్కడ నుండి వచ్చేస్తున్నాము. రిజర్వేషన్లు ముందే చేయించుకున్నాము కాబట్టి, మాకు కావాల్సిన లోయర్ బెర్తులు వచ్చేటట్లు చూసుకుంటాము.
రైలు ఎక్కాము బయలుదేరింది, రైలు ఎ. పి బోర్డర్ సూళ్ళూరు పేట వస్తోంది. ఇంకా పూర్తిగా రాలేదు అని అనుకుంటున్నామో లేదో ఒకాయన ఎక్కడ నుండి వచ్చాడో ముస్లింలాగా వున్నాడు, మా దగ్గరికి వచ్చాడు.
తల ఎగరేసి “చూడు ఎ. పి బోర్డర్ వచ్చింది, ఏమన్నావు నువ్వు? ఎ. పి బోర్డర్ వచ్చేదాకా, నీదే భాద్యత అన్నావుగా చూడు వచ్చింది” అన్నాడు.
మాకేమి అర్ధం కాలేదు, మమ్మల్ని ఇలా దాటి వెళ్ళాడు. అప్పుడు మా ఆవిడకి అర్ధమయ్యింది.
ఆ వచ్చింది బాబానే అని గబుక్కున పరిగెత్తుకు వెళ్ళింది, చేతిలోని పరుసుతో ఆయన కనపడితే డబ్బులు ఇద్దామని, ఊహూ ఇంక నాలుగు కంపార్ట్మెంట్ లు దాటివెతుక్కుంటూ వెళ్లినా ఆయన కనపడలేదు.
పోనీ దిగిపోయాడా అని అనుకోవడానికి వీలు లేదు, రైలు వెడుతూనే ఉంది.
ఏ. పి బోర్డర్ వచ్చేదాకా మాతో ఉండు అన్నాం కదా అందుకని ఏ. పి బోర్డర్ వచ్చింది చూడు అంటూ నేను నీ వెనకే ఉన్నానని తెలియజేస్తూ వెళ్ళిపోయాడు.
మేము ఒకసారి ”కురుక్షేత్రం” చూడటానికి వెళ్ళాం. మేము ఎక్కడికి వెళ్లినా దేనికి ఇబ్బంది పడకుండా కావాల్సిన సామానంతా మేము చెరి రెండు బ్యాగులు మోసుకు తీసుకుపోతుంటాము.
మేము ఇక్కడ హైదరాబాద్ లో బయలుదేరాము. అక్కడ స్టేషన్లో దిగాము, బయటికి వచ్చి అన్ని చూసుకుని మరల తిరుగు ప్రయాణంలో రైలు 10వ నెంబర్ ఫ్లాట్ ఫారంలో ఉంది,
మేము 1వ నెంబర్ ఫ్లాట్ ఫారంలో ఉన్నాం, బ్రిడ్జిలు అన్నీ ఎక్కించాలి దిగాలి.
రెండేసి బ్యాగులు బాగా బరువులు అయ్యాయి. మా ఆవిడ ”ఏం బాబా! మేము సామాను మోసుకోలేకపోతున్నాము. మాకు సాయం ఎవర్నైనా పంపకూడదా? అబ్బ చాల కష్టంగావుంది” అని పైకే అనుకుంది.
పైకి అన్నా అక్కడ మన బాష ఎవ్వరికీ అర్ధం కాదుకదా! ఎవరు పట్టించుకుంటారు.
అలాంటిది ఒక పొడుగాటి మనిషి వచ్చి ”ఏదీ? అమ్మా! సామాను ఇలా ఇయ్యి” నేను పట్టుకుంటానంటూ మా ఆవిడ చేతిలోంచి సామాను తీసుకుని, నా చేతిలోంచి కూడా తీసుకుని మోసుకుంటూ పెద్ద పెద్ద అంగలేసుకుంటూ ఫ్లాట్ ఫారాలు అన్నీ దాటించి 10వ నెంబర్ ఫ్లాట్ ఫారం రైలు దగ్గర దింపాడు.
అతనికి ధన్యవాదాలు చెప్పి 10 రూపాయలు ఇవ్వబోతే నేను డబ్బు తీసుకుందామని అమ్మకి సాయం చేయలేదు. నేను అడుక్కునేవాడ్ని కాదు, ఈ అమ్మ సాయం చేయమని “ఓ బాబా ఓ బాబా” అని అరుస్తోంది కదా, అందుకనే నేను వచ్చాను అన్నాడు.
మా ఆవిడ తెలుగులో అంది. ఆయన హిందీలో సమాధానం చెప్పాడు. మా ఆవిడ అనుకున్న మాటలు ఆయనకెలా అర్ధం అయ్యాయి.
అర్ధం అయ్యి సాయం ఎలా చేసాడు. ఆ వచ్చింది బాబా కాకపోతే ఇలా జరిగే అవకాశమే లేదు. పోనీ టీ తాగటానికి అయినా తీసుకో అంటే కూడా డబ్బులు తీసుకోలేదు.
మేము ఇలా యాత్రలన్నీ మూడు సంవత్సరాలలో పూర్తి చేసాము. ఈ ఊరిలో ఒక రోజు ఆ ఊరిలో ఒక రోజు ఉంటున్నాగానీ, మాకు దగ్గులు కానీ, తమ్ములు కానీ, జ్వరం కానీ ఎటువంటి అనారోగ్యం లేదు. అలా మేము సింగపూర్, మలేసియా, గోవా, అన్నీ తిరిగాము. మా బలం బాబా, మా మందు బాబా ఊదీ.
నేను రిటైర్ అయ్యాక నాకు 7 లక్షల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బు యాత్రలకి, విదేశాలు తిరగటానికి ఖర్చు చేస్తుంటే మాకు తెలిసిన వాళ్ళు, మా వాళ్ళు అందరూ ”డబ్బులంతా అలా ఖర్చుచేసుకుంటే రేపన్న రోజు మీకు ఎలా గడుస్తుంది” అని అడిగారు.
”ఏముంది మేము ఇద్దరమూ పాటలు బాగా పాడతాము. ఏ బాబా గుడి ముందు నాలుగు పాటలు పాడితే, వాళ్ళే దయతలచి ఇంత ముద్ద పెట్టకపోరు” అన్నాను.
మరి మందు మాకు సంగతేమని అడిగితే, ‘‘మాకు వేరే మందు మాకులతో పని లేదు బాబా ఊదీ నీళ్ళల్లో కలుపుకుని తాగితే ఎటువంటి రోగమైనా దరి చేరదు” అన్నాను నేను.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- రైలు ప్రమాదం లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన బాబా గారు.(బాబా పైన ఉన్న భక్తి ఎదుటి వ్యక్తిని కాపాడే శక్తి గా మారిన కథ).
- భక్తురాలి ప్రయాణములో తోడుగా వచ్చి, అన్నీ తానై చూసుకున్న బాబా వారు.
- టికెట్స్ లేని ట్రైన్ లో కూడా బెర్త్ లు ఇప్పించిన బాబా …..!
- సొంత ఇంటి కలను, కోరిన వంద రోజులలో సాకారం చేసిన బాబా వారు….
- చిన్న వయసు నుండే సాయి మార్గములో ఉన్న ప్రసాదు—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments