Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-65-1101-తనను దర్శిస్తానన్న వెంకటేశ్వర్లు గారి భార్యకు ప్రాణదానము 3:53
1959 లో వెంకటేశ్వర్లు గారి బ్యార్యకు శరీరమునకు నీరు వచ్చి అపస్మారకముతో ఎక్కిళ్ళు కూడా వచ్చి నరములు కూడా చచ్చుబడి ఇంజక్షను మందు లోపలకు ఎక్కుటలేదు.
డాక్టరు చూచి ఆమెకు అంతిమ సమయము ఆసన్నమైనది చెప్పి వెళ్లిపోయారు.
వెంకటేశ్వర్లుగారికి ఇది ఏమియు పట్టనట్లు కోర్టుకు వెళ్ళివచ్చిరి.
రాత్రి గం:8-00 ల సమయమున బాబా పటము ముందు కూర్చొని ధ్యాన నిమగ్నులైరి.
అట్టి సమయములో అపస్మారకములో యున్న వీరి భార్య ‘బాబా’ అని పిలిచినది.
ఆరోగ్యము కల్గిన దానివలె లేచి కూర్చొని “సాయిశా! ఎందరెందరో వారి (తనభర్త) దగ్గరకు వచ్చి ఊదీ పెట్టించుకుని వెళ్ళుచున్నారు.
ఆయన ఇన్ని సార్లు షిరిడీ వచ్చినా నేను వారితో వస్తాననలేదు.
బాబా! నేనును ఆయనతో పాటు షిరిడీ వచ్చి మిమ్ము(బాబా) దర్సించి ఆనందము పొందాలని అనుకున్నా.
నిన్ను దర్శించే భాగ్యము లేకుండా నన్ను తీసుకుపోతున్నావా?” అని ఆమె భోరున ఏడ్చుచున్నది.
ఆమె ఏడ్పును చూచిన తల్లి అది సంధి (చివరి) మాటలుగా భావించి దుః ఖించసాగినది.
ధ్యానములోయున్న వెంకటేశ్వర్లుగారు శ్రీ సాయిబాబాను ప్రత్యక్షంగా దర్శించుచునే యుండిరి. భార్య మాటలను గమనించుచుండిరి.
పరిస్థితి అంతయు అవగాహనయైనది. అత్తగారి వద్దకు వచ్చి “ఆమె షిరిడీ వెళ్లి బాబాను దర్శించవలెననెడి కోరిక బాబా మన్నించినారు.
బాబా ఆమెకు ప్రాణదానము చేశారు. ఈసారి ఆమెను షిరిడీ తీసుకొని వేళ్ళు బాధ్యత నాపై ఉంచిరి” అని చెప్ప్పినారు.
గుప్పెడు ఊదీని తీసుకొని బాబాను ధ్యానించి ఆమె మంచము చుట్టూ, మంచము పైన ఊదీని చల్లిరి. ఊదీని నీటిలో కలిపి త్రాగించగా తెల్లవారే సరికి జబ్బు తగ్గిపోయినది.
1960 వ సం: విజయదశమికి శ్రీవేంకటేశ్వర్లుగారు ఆమె బాబాను కోరినట్లు షిరిడీ తీసుకొనివెళ్ళి బాబాను దర్శింప చేసిరి.
అప్పట్లో ఏలూరు నుండి ప్రచురించు సాయి సుధ పత్రికకు వ్యాసములు వ్రాసి యుండిరి. శ్రీ కేశవయ్య గారి ఆధ్వర్యములో చీరాల నుండి ప్రచురించిన ‘సాయిలీల’ మాసపత్రికకు సంపాదకులుగా పత్రిక నడిపిరి.
పూలమ్మగారిని కలియువారు, మాతాజీ కృష్ణ ప్రియ ద్వారా బాబా చూపిన లీలను స్వయముగా దర్శించి పుస్తకరూపమున తెలియపరచిరి.
సాయితత్వ ప్రవచనములు చేయుటకు అనేక ప్రాంతములకు వె ళ్ళేడివారు.
1940 నుండి 1960 నాటికి ప్రతి సంవత్సరము షిరిడీ దర్శించుచు అప్పటికి 25 పర్యాయములు షిరిడీ దర్శనము చేసిరి.
మొదటగా 1957 లో వీరు వ్రాసిన సాయిచరిత్ర భక్తుల కందినది.
1964 లో శ్రీ వెంకటేశ్వరులుగారికి షష్టిపూర్తి సందర్భములో వారు వ్రాసిన శ్రీ సాయి సత్యవ్రత పుస్తకంతో పూలమ్మగారు సాయి సత్యవ్రతములను చేయించిరి.
ఇదే తెలుగులో వచ్చిన సాయి సత్యవ్రత ప్రధమ పుస్తకము.
శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము
సంపాదకీయం: సద్గురులీల (డిసెంబర్. – 2014)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- పదవీచ్యుతుడైన పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ షిరిడీ దర్శించగానే పదవి లభించుట–Audio
- రిక్షాలో తీసుకెళ్లి షిరిడీ చూపించిన బాబా !
- ఏదో పెద్ద అవాంతరం రాబోతే, తనను తాను(బాబా) కాల్చుకొని నిన్ను కాపాడారు.
- నా మనసులోని కోరికను గురువు గారి ద్వారా బాబా తీర్చిన వైనం
- బాలాజీ గారి జీవితంలో బాబా ప్రవేశం–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “తనను దర్శిస్తానన్న వెంకటేశ్వర్లు గారి భార్యకు ప్రాణదానమును బాబా చేయుట…Audio”
Kiran
November 1, 2018 at 5:07 pmLakshmi Prasanna garu, meeku baba blessing bagaa vunnayi.. Meeru chadive leelalu vintunte maa eduruga jarugutunnatlu vunnavi. Nenu chala mandi voice vinna kani mee voice and way of saying is excellent. Keep it up. God bless.