Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
1984 లో నేనింకా అప్పటికి షిరిడీ కి వెళ్ళని కారణం గా ”బాబా! ఎన్ని సార్లు ప్రయత్నించినా నేను వెళ్లలేకపోతున్నాను, నువ్వు నాకు కలలో షిరిడీ చూపించావు కానీ నిజంగా నాకు చూడాలని ఉంది, నన్ను షిరిడీ కి తీసుకెళ్ళు బాబా ” అని బాబాను వేడుకున్నాను.
ఆ మరుసటి రోజు ఉదయం లేవగానే పూజలో కూర్చొని, పూజ చేసుకుంటున్నాను. నిరాధారం గా ఉన్న ఇంటి పై నుండి, ” పూజలో ఉన్న నా తల మీద అక్షింతలు పడ్డాయి. అవి బియ్యం అనుకోని , పక్కనే ఉన్న నా భార్యని తిట్టాను.
పూజ లో ఉన్న నా పైన బియ్యం పోస్తావా?” అన్నాను. ఆమె ఆశ్చర్యపోయి. ” ఎందుకండీ నన్ను తిడుతున్నారు? నేనేమీ చెయ్యకుండా” అంటూ బెదిరిపోయింది.
అంతలో నాకు అనుమానం వచ్చి, పైకి చూస్తే పైన ఏమీ కనపడలేదు. వెంటనే ఆ అక్షితలని ఏరి పేపర్లో పొట్లం కట్టి బాబా నన్ను షిరిడీ కి రమ్మంటూ ఆశీర్వదించారు.
ఎంతటి అదృష్టం అని సంబరపడిపోయాను. ఈ వింత చెప్పాలని మా పక్క ఇంట్లో ఉంటున్న అమ్మాజీ గారికి (ఆమె కూడా సాయి భక్తురాలు) చెప్పాలని పూజలోనుంచి లేస్తుండగా అమ్మాజీ అక్కయ్య గారే వచ్చి ” తమ్ముడూ! నాకు రాత్రి ఒక కల వచ్చింది,
ఎవరికైనా డబ్బులు ఇచ్చి వారి ఖర్చుల నిమిత్తం షిరిడీ కి పంపామన్నారు బాబా గారు. నాకు వెంటనే మీరు గుర్తుకువచ్చారు అందుకని నేను మిమ్మల్ని షిర్డీ కి పంపాలనుకుంటున్నాను.
వెంటనే ఈ డబ్బులు తీసుకొని రైల్ టికెట్ తీసుకోండి అని నా చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోయింది. నా ఆనందానికి అంతు లేదు.
ఆహా ఏమి చిత్రం! నా తలపై అక్షింతలు పడటం వెంటనే ఈవిడ వచ్చి షిరిడీ వెళ్ళటానికి డబ్బులు ఇచ్చి వెళ్ళటం, నేను వెంటనే బాబా గుడికి వెళ్లి అక్కడి పూజారికి జరిగినదంతా చెప్పాను.
నేను షిరిడీ కి వెళుతున్నాను, అయితే నేను మీతో వస్తానన్నాడు. అతను ఇద్దరం స్టేషన్ కు వెళ్లి ఆ రోజు గురువారం కు టికెట్స్ లేవు అందువల్ల శనివారానికి తీసుకొని ఆనందంగా ఇంటికి వచ్చేసరికి నా భార్య విచారంగా కూర్చొని ఉంది,
ఎందుకని అడిగితే బాబా నన్ను రమ్మనలేదు, మిమ్మల్ని మాత్రమే తీసుకువెళుతున్నారు, అందుకు నాకు చాలా భాధగా ఉంది అంది.
దానికి నేను బాధపడ్డాను కానీ నాకు భార్యని తీసుకువెళ్ళేటంత స్థోమత లేదు, అది గ్రహించిన నా భార్య ” సరేలేండి బాబా ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళదామని ఇద్దరం సర్దుకున్నాము ”.
ఇంతలో మా అమ్మాజీ అక్కయ్య గారు వచ్చి ” తమ్ముడూ పొరపాటు జరిగిపోయింది అంది, మా గుండె గుభేలుమంది. ఇంతలో ఏం జరిగిందో అని అనుకునేలోగా ” ఏం లేదు మా మరదలిని కూడా తీసుకెళ్ళమనటం మరిచిపోయానంటూ తనకి డబ్బులు ఇచ్చింది ”.
మా ఇద్దరికీ చెప్పారని ఆనందం. స్టేషన్ కి వెళ్లి మరో టికెట్ తీసుకుంటే నా పక్కనే వచ్చింది తనకి సీటు. షిరిడీలో హారతిలో బాబా ని దర్శించిన మా ఇద్దరికీ బాబా మురళీ కృష్ణుడు లాగా దర్శనమిచ్చాడు.
1987 వ సంవత్సరంలో నా భార్యకి విపరీతమైన సుస్తీ చేసింది. దగ్గు, జ్వరం ఒక సంవత్సరం చంటి బిడ్డ తల్లి.
ఆ సమయంలో నేను కనీసం మందు బిళ్ళ కూడా వేయలేని పరిస్థితి. అయినా ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించగా, ఈ అమ్మాయికి అసలు ఏమీ బాగాలేదు చాలా నీరసంగా ఉంది, బెడ్ రెస్ట్ కావాలి అన్నాడు.
అయినా ఒకసారి x – ray తీయాలని చెప్పి , x – ray తీసి, అది చుసిన డాక్టర్ కంగారుపడి, అసలు ఈ అమ్మాయి పరిస్థితి ఏమీ బాగాలేదు, మొత్తం తినేసింది.
ఇది టి . బి చాలా జాగ్రత్తగా ఉండాలి. చంటి పిల్లవాడికి పాలు ఇవ్వవద్దు మందులు బాగా వాడి, తిండి బాగా తినాలి అని చెప్పారు . ఇంక నాకు ఏం చేయాలో తోచలేదు.
బాధపడుతుంటే నా భార్య, ఎందుకండీ ! బాధపడతారు బాబాకి తెలియదా? ఏం చేయాలో. అయినా మీరు మందులు కొనుక్కువచ్చినా నేను వేసుకోను. పరమ పవిత్రమైన విభూధి నీళ్లలో కలిపి తాగి, గుండెలకి విభూధి రాసుకుంటాను అంతే ఆ బాబాయే చూసుకుంటాడు అంటూ మొండి ధైర్యం తో విభూధి వాడటం మొదలు పెట్టింది.
విభూదే నాకు మందు, పరమ పవిత్రమైన ఔషధం, దీనిని మించింది లేదు. నన్ను మాత్రం ఏమీ అనవద్దు.
ఇది బాబా నిర్ణయం గా భావించండి అని అదే విధం గా విభూధి ని అన్నంలోను, కాఫీ, టీలలో, నీళ్లలోనూ వేస్తూ అలాగే జబ్బుతో బాధపడుతూ కాలం గడుపుతోంది.
నేను ఏం చేయలేక నీ ఇష్టం, మన గ్రహస్థితి ఏ రకం గా ఉంటే ఆ రకం గా జరుగుతుంది అని బాబా పై నమ్మకం ఉంచి కాలం గడుపుతున్నాము.
ఒక గురువారం బాబాకి పూజ కార్యక్రమం చేసుకొని ప్రసాదం గా అరటిపండు పెట్టి, అగరబత్తులను ఆ అరటిపండుకు గుచ్చి హారతినిచ్చి బయటికి వచ్చేసాము.
కొంతసేపటికి పూజ గదిలోనుండి విపరీతమైన పొగ బయటికి వస్తుంది అది గమనించి, ఇంట్లో వాళ్ళందరం పూజ గదిలోనికి వెళ్లి చూడగా, అందరం ఒక అద్భుతాన్ని చూసాము.
మేము అగరబత్తులు ఆ అరటిపండుకు పెడితే అది వెళ్లి అద్దం వేసి ఉన్న బాబా ఫోటో మీద పడి ఫోటో అద్దం పగిలిపోయి ఫోటో లో బాబా కంఠం నుండి నాభి వరకు అనగా పొట్ట వరకు కాలిపోయింది. అంత మేర అద్దం పగిలి కింద పడింది. కానీ కింద భాగం, ఫోటో అద్దం అలాగే ఉంది.
ఈ దృశ్యం చూసి మా అమ్మ, నా భార్య, అక్కలు, అందరం ఇంటిల్ల పాది చాలా కంగారుపడి ఏడవటం మొదలుపెట్టారు.
అసలే నా భార్యకి ఒంట్లో బాగా లేదు, మేము ఈ బాధలో ఉంటే బాబా ఇలాంటి పని చేశారేంటిరా బాబూ అని బాధపడి ఇక మా జీవితం అయిపోయింది.
ఇక నువ్వు కూడా కాపాడలేవని రుజువు చేసావా స్వామి! ఇంక మేము మాత్రం ఏం చేయగలం, మీ లీల ఎలా ఉంటే ఆలా జరుగుతుంది లే బాబా అని ఇంటిల్ల పడి ఏడ్చి ఏడ్చి ఉరుకున్నాము.
కానీ మనసులో మాత్రం ఇదేదో అనర్ధానికి సంకేతం అని తోస్తోంది.
ఏది ఏమైనా ఈ విషయం నా శ్రేయోభిలాషులు, బాబా భక్తులకి కొందరికి చెప్పాలనుకొని, అంతలోనే వారేమైనా భయపడతారేమో అని ఒక పక్క బెంగ. అయినా ఇటువంటి విషయం దాచకూడదు అని చివరికి కొందరు బాబా భక్తులకు, పెద్దలకు చెప్పాను.
నేను చెబుతూ ఏడుస్తుంటే వాళ్ళు నన్ను ఓదార్చి, ఇంత మంచి జరిగితే మీరు ఏడుస్తున్నారా! బాబా ని మీరు అర్ధం చేసుకున్నది ఇంతేనా! ఎంత అదృష్టవంతుడివి నువ్వు ఇంత అదృష్టం అందరికీ రాదు అంటున్నారు. నేను ఇలా ఏడుస్తుంటే నన్ను పొగడ్తల తోటి ముంచెత్తుతున్నారు.
నేను అసలే బాధలో ఉన్నానంటే మీరు ఏవో చెబుతున్నారు . వారు ఈ క్రింది విధం గా వివరించారు .
నీకు బాబా చరిత్ర తెలుసు కదా! అందులో చంటి బిడ్డ ని రక్షించడానికి చెయ్యి కాల్చుకోలేదా! ఇలా ఎన్నో తన భక్తులను రక్షించుట గురించి బాబా ఎన్ని రకాల భాధలు అనుభవించ లేదు నీకు గుర్తులేదా!
అలాగే నీకు ఏదో పెద్ద అవాంతరం రాబోతే, తనను తాను కాల్చుకొని నిన్ను కాపాడారు, అంతే కానీ నువ్వు భయపడొద్దు. నీకేం కాదని అందరూ ధైర్యం చెప్పగా నా మనసు కొంత కుదుటపడింది.
The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni
Latest Miracles:
- రిక్షాలో తీసుకెళ్లి షిరిడీ చూపించిన బాబా !
- తనను దర్శిస్తానన్న వెంకటేశ్వర్లు గారి భార్యకు ప్రాణదానమును బాబా చేయుట…Audio
- బాబా పంపిన ఊదీ
- నా సమస్యలను తాను తీసుకున్నానని బాబా చెప్పారు
- నా మేన కోడలిని పెద్ద ప్రమాదం నుండి రక్షించిన బాబా వారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments