అంతర్మధనం…. మహనీయులు – 2020… ఏప్రిల్ 5



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా ఇమాంభాయ్ చోటేఖాన్ తో మాట్లాడుతూ “గులాబ్ మీ ఇంటికి వచ్చింది” అన్నారు.

ఆ భక్తుడు ఇంటికిపోగా అప్పుడే కుమారుడు జన్మించాడని తెలిసింది. బిడ్డడికి గులాబ్ అనే పేరు పెట్టుకున్నారు.

హజ్రత్ కెబ్లకాబ “సుపుత్రునికి జన్మనిస్తావు యోగిరాజు (పీరా నే పీర్) అవుతాడు” అన్నారాయన సోదరుని భార్యకు పుట్టబోయే బిడ్డడి గురించి.

పుట్టిన బిడ్డను ఆ సూఫీయోగి  సన్నిధికి తీసుకుపోయారు. వీడికి గోలమూర్ రహమాన్ అనే పేరు పెడుతున్నాను. నా తోటలో గులాబీ వీడే” అన్నారాయన.

ఆ బిడ్డడు కొంచెం పెద్దయిన తరువాత పశువులను అప్పుడప్పుడు బయటకు తీసుకుపోయేవాడు మేపేందుకు.

“ఇతరుల పంటలను పాడుచేయవద్దు” అని ఆ పశువులకు చెప్పి ధ్యానం చేసుకునేవాడు. ఇతరుల పొలాలలో అవి ఎప్పుడు మేయలేదు.

ఆ బాలుని పశువులు కూడా ఆచరించేటట్లు చేసాడు దైవం. తెల్లవార్లు తన గురువైన కెబ్లాకాబ సన్నిధిలో గడిపేవాడు, ఎలాగంటే నిలబడి.

తల్లిదండ్రులు ఒక రాత్రి వేళ వచ్చి తనను ఇంటికి తీసుకుపోయేవారు. వీలైనంత తొందరగా మరల గురు సన్నిధి చేరేవాడు బాబా భండారీ.

ఆ భక్తుని పేరు గౌసుల్ అజం హజ్రత్ గోలమూర్ రెహ్మాన్ కానీ బాబా భండారీగా ప్రసిద్ధుడు, హిందూ, మహమ్మదీయులు ఈయనకు భక్తులుగా ఉండేవారు.

ఈయన భక్తుడొకడు ఒక ఓడకు కెప్టెన్ (Captain). ఒకసారి ఆ ఓడ సముద్రంలో సుడిగుండంలో చిక్కుకున్నది.

కెప్టెను తన గురువును ప్రార్ధించాడు. గురువు ప్రత్యక్షమై సుడిగుండంలో చిక్కుకున్న ఆ నావను ఢీ కొన్నారు. అంతే. ఆ ఓడ మాములుగా పయనించసాగింది.

బాబా భండారీ అదృశ్యుడైనాడు. అదే సమయంలో భక్తులతో మాట్లాడుతున్న బాబా భండారీ నుదుటి నుండి రక్తం కారింది కొంచెం సేపు.

అక్కడున్న వారికి కారణం తెలియరాలేదు. కొంతకాలం గడిచింది. బాబా భండారీ వద్దకు రక్షింపబడిన ఓడ కెప్టెను బహుమతులతో వచ్చి, తనను, తన ఓడను కాపాడినందుకు కృతఙ్ఞతలు చెప్పాడు.

అప్పడు అక్కడున్నవారికి బాబా భండారీ ఎలా కాపాడినాడో చెప్పాడు. అందరికీ అప్పుడు తెలిసింది అసలు సంగతి.

ఒకనాడు ద్వారకామాయిలో కూర్చున్న సాయిబాబా తన రెండు చేతులతో ఏదో బరువైన దానిని పైకి లేపుతున్నట్లు చేసారు.

వెంటనే బాబా శరీరం నుండి నీరు ప్రవహించసాగింది. ద్వారకామాయి అంతయు ఆ నీటితో నిండిపోయింది. కొంతమంది భక్తులు ఆ నీటిని దోసెట పట్టి తీర్థముగా స్వీకరించగా ఆ నీరు సముద్రపు నీటివలె ఉప్పుగా నుండెను.

దానికి కారణము వారు గ్రహించలేకపోయిరి. రెండు రోజుల తరువాత బాబా భక్తుడైన దారువాలా నుండి ఒక తంతి (టెలిగ్రాం) వచ్చెను.

దానిలో తన నొకలను శత్రువుల బారినుండి రక్షించినందుకు బాబాకు కృతఙ్ఞతలు తెలిపెను. అప్పుడు తెలుసుకున్నారు అక్కడున్న వారందరూ అసలు సంగతి.

బాబా, బాబా భండారీ వేరు కాదు ఇద్దరూ ఒక్కటేనని ఈ సంఘటన తెలుపుతోంది.

బాబా భండారీ ఏప్రియల్ 5, 1937న సమాధి చెందెను. నేడు ఏప్రియల్ 5. వారి ఒక దివ్య బోధను స్మరిద్దాం.

“అంతర్మధనం చేసుకుని, లోపాలను సరిదిద్దుకో. తోటివారితో సామరస్యంగా ఉండు”

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles