Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
డబ్బాకు అడుగున రంధ్రం ఉన్నా కూడా బాబా తన అభిషేక తీర్ధం కారిపోకుండా అలాగే ఉంచిన సంఘటన గురించి ఒక జ్యుడీషియల్ ఆఫీసరుగారు మైలాపూర్ చెన్నై అఖిల భారత సాయి సమాజ్ వ్యవస్థాపకులైన శ్రీ బీ.వీ.నరసింహ స్వామి గారికి 25.02.1940 న. వ్రాసిన ఉత్తరం.
“బాబా అనుగ్రహం వల్ల నాభార్య ఆరోగ్యం కుదుటపడింది. ఇప్పుడు మీకు వివరింపబోయే సంఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
మీరు మాయింటికి వచ్చినప్పుడు నాభార్య ఉపయోగించడానికి ఒక డబ్బాతో బాబా అభిషేక తీర్ధాన్ని పంపించమని సంస్థాన్ వారికి మీరు ఉత్తరం వ్రాసారు.
అది మీకు గుర్తుండే ఉంటుంది. మీరు వెళ్ళిన కొద్ది రోజులలోనే మాకు అభిషేక తీర్ధం అందింది.
దానిలో కొంత తీర్ధాన్ని ప్రతిరోజు నాభార్య తలమీద చల్లడానికి ఉపయోగించాము. కొద్దిరోజుల తరువాత ఆపేశాము.
చాలా నెలలుగా యింకా మిగిలి ఉన్న అభిషేక తీర్ధం ఉన్న డబ్బాని బల్లమీదే ఉంచాము.
క్రిందటి నెలలో ఆ డబ్బాని అక్కడినుండి తీసి అలమారులో పెట్టాము.
నిన్న మా రెండవ అమ్మాయి ఆ డబ్బాలో నూనె ఉందనుకుని తీయగా గల గల మని శబ్దం వచ్చింది. డబ్బాని పైకి తిప్పి చూస్తే అడుగున చిటికెనవేలు పట్టేటంత కన్నం ఉంది. అందులోనుండి కాస్త నీరు వచ్చింది.
తరువాత అందులోని నీటినంతా ఒక పాత్రలో పోసింది.
డబ్బాలో మూడవ వంతువరకూ తీర్ధం ఉంది. విచిత్రమేమిటంటే డబ్బా అడుగున అంత పెద్ద కన్నం ఉన్నా కూడా తీర్ధం యిన్నిరోజులయినా కారిపోకుండా డబ్బాలో అలాగే ఉంది. ఎంత ఆశ్చర్యం…
అందులోని నీరు ఎంతో స్వచ్చంగా ఎటువంటి వాసనా లేకుండా మొట్టమొదటి సారిగా ఎలా ఉన్నదో అదే విధంగా రుచిగా ఉంది. మాపిల్లల మనసులో మంచి ముద్ర వేసింది ఈ సంఘటన.
ఈ రోజు ఉదయం ఆ తీర్ధాన్నంతటినీ నాభార్య శిరస్సు మీద పోసాము. ఇందంతా చూసిన తరువాత మీకు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.
బాబా అభిషేక తీర్ధం — ఈ సంఘటన మనలో నమ్మకాన్ని కలిగించటానికనేది స్పష్టం. ఆ డబ్బాని మామూలుగా కొద్ది రోజులు పాలరాయి బల్లమీద పెట్టి ఆ తరువాత చెక్క బీరువాలో పెట్టాము. “
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- అభిషేక తీర్దముతొ ఆరోగ్యము చెకూరుట–Audio
- చిన్న వయసు నుండే సాయి మార్గములో ఉన్న ప్రసాదు—Audio
- కంటి సమస్యను తీర్చిన బాబా
- బాబా చూపిన కృప – బాబా దివ్యదర్శనం 2
- అచేతనావస్థలో ఉన్న కుమార్తెను బాబా వారి రాతి వద్ద వదలి వెళ్ళుట…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments