Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తుడు: సాయి మురళి
నివాసం: హైదరాబాద్.
నా పేరు సాయి మురళి. నాకు కోటేశ్వరి అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. వారు గురువు గారిని నమ్ముతారు కాబట్టి వివాహం శిరిడీలో గురువు గారి సమక్షంలో జరిపించుకోవాలని అనుకున్నారు.
మాకు గురువుగారు తెలియదు, కానీ మేము ఒప్పుకున్నాము. అంతకు ముందు 9 సంవత్సరాల నుండి శిరిడీకి వెళదాం అనుకుంటున్నాం కానీ వెళ్లలేక పోయాము.
వివాహం శిరిడీలో అనుకున్నాము. మాతో పాటు పది మంది వచ్చారు. అందరు శిరిడీలో వివాహం అంటే, భోజనాలు టిఫిన్ లకే చాలా ఖర్చు అవుతుంది అని చెప్పారు.
మా దగ్గర కొంత అమౌంట్ మాత్రమే ఉంది, అయినా సరే బాబా చూసుకుంటారులే అని వచ్చాము.
మాకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా చాలా తక్కువ రెంటుతో రూమ్ దొరికింది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం సాయి పథంలోనే ఫ్రీగా చేసే వాళ్ళము.
రాత్రి మాత్రం సంస్థాన్ లో చపాతీ 3 రూపాయలు ఉండేది. అలా 101 రూపాయలతో చపాతీలు మాకు తెలిసిన బంధువులు తెచ్చి ఇస్తే అవి తినే వాళ్ళం.
అలా నాలుగు రోజులు శిరిడీలోనే ఉన్నాము. కేవలం మేము కొనుక్కున్న ప్రసాదాల ఖర్చు తప్పితే, మాకు ఎలాంటి ఖర్చు కాలేదు.
ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అని భయపడుకుంటూ శిరిడీ వచ్చిన మాకు ఏ ఖర్చు లేకుండా సంతోషంగా నాలుగు రోజులు శిరిడీలో ఉండి వెళ్లేలా చేసారు బాబా.
అలా మేము తొమ్మిది సంవత్సరాలుగా అనుకుంటున్నా మా శిరిడీ ప్రయాణంని నా పెళ్లి అనే మిషతో మమ్మల్ని శిరిడీ రప్పించుకున్నారు బాబా.
మరొక అనుభవము:
గురువు గారు(శరత్ బాబూజీ గారు) 2010 లో సమాధి అయ్యారు. అంతకు ముందే గురువు గారి సమక్షంలో నాకు గురు బంధువుతో వివాహమయింది.
కానీ, అప్పటికి గురువు గారి గురించి అంతగా అవగాహన లేదు. 2011 నవంబరులో ఆరాధన ఉత్సవాలకు నేను ఒక్కడినే వెళ్ళాను.
13th ఆరాధన ముఖ్యమైన రోజు. నేను 12th కి వెళ్ళాను. ఉదయం 10 గంటలకి గురుబంధువు బాబా దర్శనంకి వెళ్దాం అంటే తనతో వెళ్ళాను. కరెక్ట్ గా మధ్యాహ్న ఆరతి సమయంలో వెళ్లి ఆరతి అటెండ్ అయ్యాము.
మరుసటి రోజు సాయంత్రం రిటర్న్ అవ్వాలి. సాయి యానాలో కొంతసేపు కూర్చుని తరువాత దర్శనంకి వెళ్దాం అనుకొని నామం జరుగుతుంటే అక్కడ కూర్చున్నాను.
మళ్ళీ బాబా దర్శనం చేసుకోవాలని ఒక పక్క మనసు పీకుతోంది. ఇంకో పక్క నామం బాగుంది, కుర్చోవాలనిపిస్తుంది.
ఇంతలో మేజర్ అంకుల్ వచ్చి, గురువు గారు సమాధి అయిన టైం 1:50 PM కాబట్టి అందరు ఒక పది నిముషాలు నిశ్శబ్దంగా ఉండాలి, అని చెప్పారు.
నాకు ఇక్కడుంటే మళ్ళీ లేట్ అవుతుంది. సాయంత్రం బయలుదేరాలి. మళ్ళీ బాబాదర్శనం అవుతుందో, లేదో? అనుకొని, మళ్ళీ గురువు గారి ఆరాధన కదా! అని మనసులో బాబాని ధ్యానిస్తూ అక్కడే కూర్చున్నాను.
భోజనం అయ్యాక మూడు గంటలకి బయలుదేరి దర్శనంకి వెళ్ళాను. అక్కడ బాబా సమాధిపై బాబా బొమ్మ ఉన్న కాషాయం వస్త్రం ఉంది. పూజారిని, సెక్యూరిటీని ఆ క్లోత్ ఇవ్వమని అడుగుతున్నాను. మొదట వాళ్ళకి అర్ధం కాక అటు ఇటు చూసారు.
ఈ లోపు మెడపై ఏదో బరువుగా ఉన్నట్టు అనిపించింది. సెక్యూరిటీ వాళ్ళు ఏమైనా లాగుతున్నారేమో అనుకున్నప్పుడు అక్కడ ఉన్న పూజారి క్లోత్ ఇచ్చారు. తిరిగి చూసేసరికి నా మెడలో నా అంత పొడవు దండ ఉంది.
ఇక నేను అక్కడ బాబా అని పెద్దగా అరిచి, కళ్ళలో నీళ్లు, వెక్కిళ్లు వచ్చి ఆనందం తట్టుకోలేకపోయాను. ఆనందంతో క్లోత్, దండ తీసుకొచ్చి రూములో పెట్టి ద్వారకామాయికి వెళ్ళాను.
ద్వారకామాయిలో బాబా వాయిస్ వినపడింది. “ఇప్పుడు ఆనందంగా ఉందా” అని.
మరొక అనుభవము:
ఒకసారి నాకు గురువు గారు కలలో కనిపించారు. నాకు పిల్లలు లేరు కదా, అని సంతానం కావాలని అడగాలని ట్రై చేస్తున్న కానీ, మాట రాలేదు.
ఏడుపొస్తుంది. గురువుగారి సమాధి దగ్గర ఇప్పుడు గురువు గారి ఫోటో ఉన్న దగ్గర గురువు గారు కూర్చున్నారు. నాకు ఏమి చెప్పాలన్నా మాట రావట్లేదు, ఏడుపొస్తుంది.
అప్పుడు గురువు గారు నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు, నీకా మాట రావట్లేదు. ఒక పని చేయి ఉత్తరం రాసుకో అంతా బాబా చూసుకుంటారు అన్నారు.
గురువు గారు కాళ్ళు వెనకకి పెట్టుకొని కూచుంటారు కదా! ఆలా కూర్చున్నప్పుడు కాలి బొటన వేలికి ఊధీ ఉంది. గురువు గారి పాదాలకు దండం పెట్టుకుంటున్నప్పుడు ఆ ఊధీ నా నుదుటిన అంటింది.
తరువాత వెంటనే బాబాకి లెటర్ రాసాను. దాదాపు 4 ఇయర్స్ తరువాత ఇప్పుడు నా వైఫ్ ప్రెగ్నెంట్. అంతా బాబాకి ఉత్తరం రాసుకోవడం వల్లే జరిగింది.
మేమెప్పుడూ జీవితాంతం బాబా నామాన్నే అంటిపెట్టుకుని ఉంటాం.
మరొక అనుభవము:
2015 డిసెంబర్ లో నేను నా భార్యతో కలిసి వరంగల్ సత్సంగానికి వెళ్ళాం. అక్కడ మా ఇద్దరి చేత హారతి ఇప్పించారు.
మాతో హారతి ఇప్పిస్తున్నందుకు మొదట నాకు ఆశ్చర్యం వేసింది. కానీ అవకాశం వచ్చింది కదా! అని హారతి ఇచ్చాం.
తరువాత 2016 డిసెంబరులో మళ్ళీ వరంగల్ సత్సంగ్ వార్షికోత్సవం జరగవలసిన డేట్ కి ముందే, నా భార్య ప్రెగ్నెంట్ అని తెలిసింది.
అప్పుడు లాస్ట్ ఇయర్ మీతో హారతి ఎందుకు ఇప్పించామంటే, నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ శుభవార్త వినాలి బాబా, అని బాబాకి మొక్కుకొని మీతో హారతి ఇప్పించాము అని చెప్పారు.
తరువాత సందీప్ అనే గురుబంధువుకు నా భార్య ప్రెగ్నెంట్ అని చెపితే. ఆ విషయం విని అతను నాతో నిజమేనా, నిజమేనా అని అడిగి నాకు ముందే కల వచ్చింది అని ఇలా చెప్పారు.
గత నెల అతను ఆరాధన ఉత్సవాలకు శిరిడీ వెళ్ళినప్పుడు కలలో నా భార్య గురువు గారి దగ్గర నిల్చోని, సందీప్ నేను కన్సీవ్ అయ్యాను అని చెప్పిందట. అప్పుడు ఇది బాబా మిరకిల్, బాబా కృప విశేషం అని మాకు అనిపించింది.
~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~
*** సాయిసూక్తి:
“నా భక్తుల అవసరాలు తీర్చడానికి అప్పుడప్పుడు నేను పరీక్షిస్తూ ఉంటాను. నా పరీక్షలకు తట్టుకోవాల్సి వస్తుంది”.
Latest Miracles:
- పారాయణముతో కాదుఅనుకున్న మా పెళ్లి ఆనందముగా జరిగిపోయిది.
- పెళ్లి చేసి ఉద్యోగం ఇప్పించిన బాబా వారు
- బాబా నే నాకు ఆమె దర్శనభాగ్యం కలిగించారు.
- శిరిడి యాత్రకు బాబా ధన సహాయం
- మనసులో చిన్న అసంతృప్తినైన బాబా తీరుస్తారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments