డాక్టర్స్ ఆందోళనగా వచ్చి చూచి బ్రతుకుతాను అనే నమ్మకం లేదని పెదవి విరిచి వెళ్లారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

బ్రతికి యుండనిమ్మని కోరిన భక్తుని బ్రతికించుట

శ్రీ సాయి బాబా కలలో దర్శనమిచ్చినప్పటినుండి షిర్డీ వెళ్లి బాబాను దర్శించుకోవాలనే కోరిక కలిగి చరిత్ర 7 వ సరి పారాయణ చేస్తుండగా 7 – 4 -2006 వ తేదీన షిర్డీ బయలుదేరి శ్రీ రామనవమి రోజున శ్రీ సాయి బాబాను దర్శనము చేసుకొని ఆనందించాను.

తరువాత నా కుటంబములో అనేక కష్టాలు తొలిగి చాల అనుభవాలు కూడా  కలిగాయి అంటూ ఇలా చెప్పారు.

“4 -12 -2006  న పారాయణ ముగించి నిద్ర పోయిన వెంటనే బాబా స్వప్న దర్సనమిచ్చి నేను నిన్ను తీసుకొని పోతానన్నారు.

ఆ కలలోనే బాబా! నేను భార్య, పిల్లల భాద్యతలు నేరవేర్చేవరకు బ్రతికి ఉండనివ్వమని బాబాని కలలో ప్రార్థించాను.

ది 5 – 2 -2007 న మస్వగ్రామైన కోడూరు నుండి మోటార్ సైకిల్ మీద విజయవాడ వస్తూ గేదె ను గుద్దించాను.

మోటార్ సైకిల్ మీదనుండి క్రింద పడిపోయాను.

ఎడమచేతి మణికట్టు విరిగినది. మోకాలు చిట్లినది. వెంటనే నన్ను నాగార్జున హాస్పిటల్ లో చేర్పించారు

ఆక్సీజన్ పెట్టి, కట్లు కట్టి ఐ.సి.యూ. లో పెట్టారు.

అంతక ముందు బ్లడ్ ప్లెషర్ లేని నాకు బ్లడ్ ప్రెషర్ 40 కి పడిపోయింది.

డాక్టర్స్ ఆందోళనగా వచ్చి చూచి బ్రతుకుతాను అనే నమ్మకం లేదని పెదవి విరిచి వెళ్లారు.

నా దగ్గరే ఉన్న బాబా ఊది నోటిలో వేసుకున్నాను.

నేను చెప్పగా నా భార్య ముత్యాలంపాడు బాబా గుడికి వెళ్లి భర్తను బ్రతికించమని సాయి బాబా కు అభిషేకము మరియు పూజ చేయించి 11  కొబ్బరికాయలు సమర్పించింది. 

అలానే మా స్వగ్రామం కోడూరులో నున్న సాయి మందిరములో యున్న బాబాకి అభిషేకము చేయమని ఫోన్ చేయించాను. మరల ఒక గంట తర్వాత డాక్టర్ వచ్చి టెస్ట్ చేసినాడు.

అప్పుడు నాగుండె యధావిధిగా పనిచేయడం ప్రారంభించింది.

డాక్టర్స్ అంతా ఆశ్చర్య పడ్డారు.

నిజముగా బాబానే నన్ను బ్రతికించారు అనడంలో ఎటువంటి సందేహము లేదు.

మా అబ్బాయి ఉద్యోగానికి మధ్యవర్తికి ఇచ్చిన 70 వేల రూపాయలకు ఉద్యోగము రాలేదు.

పోతుందిఅనుకున్న డబ్బు ఇప్పించమనే కోరికతో బాబా ను పూజించగానే ఆ డబ్బలు తిరిగివచ్చినవి.

నిరంతరము మా దంపతులకు బాబా సేవ తప్ప వేరేది లేదు.

బాబా జీవిత చరిత్ర 100 సార్లు చదివాను. గురుచరిత్ర 50  సార్లు చదివాను.

బాబా గారి లీలలు లక్ష కరపత్రాలు ప్రింట్ చేయించి పంచి ఉన్నాను. బాబాని నమ్మిన వారికి కానిదేమి ఉండదని మా విశ్వాసం అని అంటారు తాతయ్యగారు.

సంపాదకీయం: సద్గురులీల

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “డాక్టర్స్ ఆందోళనగా వచ్చి చూచి బ్రతుకుతాను అనే నమ్మకం లేదని పెదవి విరిచి వెళ్లారు.

Maruthi

Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba. Sri Sathchidananda Samardha Sadguru Sainath Maharaj Ki Jai.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles