బాబా చెప్పినట్లు నడుచుకో



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

కోడూరు కి చెందిన మహతి(రమణి) గారు ప్రమాదకరమైన పరిస్టితి నుండి తమని  బాబా ఎలా కాపాడారో అనే  దివ్య అనుభవాన్ని saileelas.com ద్వారా సాయి బంధువులతో పంచుకోవడానికి నాకు whatsapp లో పంపించారు. ఆమె మాటలలోనే చదవండి. వారికీ బాబా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను.

సాయి సురేష్ గారూ నమస్తే. మీరు అప్లోడు చేసిన బాబా మాట జవ దాటవద్దు అనే సాయి లీల చదివిన తర్వాత నా లైఫ్ లో జరిగిన అటువంటి అనుభవం సాయి బంధువులందరితో పంచుకోవాలని మీకు పంపుతున్నాను. ఆ రోజు జరిగినది తలచుకుంటే అది నాకు పునర్జన్మ అనిపిస్తుంది.

2009వ సంవత్సరం  ఫిబ్రవరిలో నేను, మా అమ్మగారు, నాన్నగారు షిరిడి వెళ్లి, అక్కడ బాబా దర్శనం చేసుకొని ఆనందంగా
షిరిడి నుండి హైదరాబాదు వచ్చాము. బాబా ప్రసాదం తీసుకుని సాయి భక్తులైన నా ఫ్రెండ్స్ కు ఇవ్వాలని వనస్ధలిపురం వెళ్ళాను.

వైదేహి నగర్ మెయిన్ రోడ్ లో వున్నా నెస్ట్ కేర్ ప్లే స్కూల్ ఫౌండర్ గారైన శశికల గారికి ప్రసాదం ఇచ్చి రోడ్ కి అవతలివైపు వున్నా ఇంకో ఫ్రెండ్ కు ప్రసాదమిద్దమని రోడ్ దాటుతుండగా పెద్ద గొంతుతో “అటు వేళ్ళకు ఇంటికి వెళ్ళిపో” అని వినిపించింది. అక్కడ ఎవరూ లేరు. అది బాబా గొంతేనని అర్ధమైంది.

కానీ నేను ఈసారి తప్పక వస్తానని మాట ఇచ్చాను సాయి అది తప్పలేను అన్నాను. మళ్ళీ అలాగే అరిచారు బాబా. నేను వినలేదు. నీ ఊది వుంది ప్రసాదం వుంది నాకేమి కాదు అని మొండిగా వెళ్ళాను.
ఆ ఫ్రెండ్ పేరు రామదేవి. నేను వెళ్ళేప్పటికీ వాళ్ళు సకినాలు అంటే విష్ణు చక్రాల మాదిరిగా వుండే జంతికలు చేసుకుంటున్నారు. అవి ఆయిల్ లో వేసినపుడు పేలిపోయి ఆయిల్ కింద పాలరాతి బండలపై పడుతోంది. ఆమె రమణి గారు మీరు మావైపు వచ్చేయండి మీపై ఆయిల్ పడుతుంది అన్నారు.
సరే అని బ్యాగ్ తీసుకొని నేను రూమ్ చివరికి వస్తున్నాను. నా కాలి దగ్గర వున్నా నూనె నాకు కనపడలేదు. ఒక్కసారిగా జర్రున జారీ వెనక్కు పడిపోబోయానుపడి ఉంటే కరెక్టుగా ఆయిల్ పాన్ లో పడిపోయేదాన్ని.
నేను ఆశ ఒదిలేసుకున్నాను. చూసినవాళ్లు నా పని అయిపోయిందని నేను కాలిపోతానని షాక్ అయిపోయి బిగుసుకుపోయారు. కానీ వెనుకకు పడిపోవలసిన నన్ను రెండు చేతులు ముందుకు తోసివేసాయి. నేను అమాంతం ముందుకు పడిపోయి మౌనం లోకి వెళ్ళిపోయాను.

కొంతసేపటి వరకు అంతా నిశ్శబ్దం ఎవరు ఎవరిని చూడకుండా నిలువు గుడ్లు పెట్టి అలాగే ఉండిపోయారు. తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇంతకీ నన్ను తోసిన చేతులెవరివి అంటే మేము కాదు అంటే మేము కాదు అన్నారు అందరు. అసలు ఆ ప్లేస్ లో ఎవరు లేరు. 

తల ఎత్తి గోడపై చూసాను అక్కడ బాబాది పెద్ద ఫోటో ఉంది. నాకు నోట మాట రాలేదు. రోడ్ పై నన్నువెళ్ళ వద్దని బాబా ఎందుకు హెచ్చరించారో అప్పుడు అర్ధమైంది.

ఇప్పటికీ మేము కలిస్తే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని బాబా కి కృతజ్ఞతలు చెప్పుకుంటాము.

అందుకే ఈ లీలకు గుర్తుగా నేను అంటే బాబా నాచేత రాయించుకున్న సాయి స్తవన మంజరిలో ఒక చరణం ఈ లీల వుంది
“నీవు పోరాదన్న అవతలకు పోయినా
ఎదురొచ్చి ఆపదలనపెవాయా
నీ కోపమున ప్రేమ
నీ తిరస్కారము
స్వీకరమై కనుపించెనయా
ఇదే ఆ చరణం
సాయిరామ్
సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా చెప్పినట్లు నడుచుకో

Maruthi

Sai Baba…Sai Baba

Sreenivas

Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles