Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio prepared by Mr Sri Ram
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
నెల్లూరు నుండి ఇందిరా బాలాజీ రావు గారు సాయి తనకి కలిగించిన దివ్య అనుభవాలను సాయి బంధువులందరితో పంచుకుంటున్నారు. సాయి తనను నమ్ముకున్న వారిని ఎంతలా అండగా ఉండి నడిపిస్తారో చదివి ఆనందించండి.
నా పేరు ఇందిరా వాణి. మా నాన్నగారు టీచర్. నాన్న దగ్గరకు ట్యూషన్ కి, వచ్చే పిల్లలందరితో స్నేహం చేసేదాన్ని. నేను ఆరవ తరగతి చదువుతున్నాననుకుంటా.
అప్పటి నుండే, నాకు తెలియకుండానే బాబా తో, బంధం మొదలయ్యింది. ఉమాదేవితో నా పరిచయం మొదలయ్యింది. వాళ్ళ నాన్న గారు పల్లపోతు ఉమామహేశ్వరరావు గారు.
వీరు రైల్వేలో, A. E గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన పని చేసింది మహారాష్ట్ర లో. స్వగ్రామం చీరాల అవటం వలన మా ఊరికే వచ్చేసారు.
బాబా పట్ల ఆయనకు ఎనలేని ప్రేమ, విశ్వాసం. ఆయన ఆస్తిలో సగభాగం బాబా కోసంఖర్చు చేసారు. రోజులో చాలా భాగం బాబా ఫోటో ఎదురుగా కూర్చుని ధ్యానం చేస్తూ వుండేవారు.
అప్పుడు బాబా ని చూసి ఎవరో స్వామీజీ అనుకున్నా. ఆయన మాకు రోజూ ప్రసాదం పెట్టేవారు. చాలా హారతిపాటల బుక్సు యిచ్చి అందరికీ పంచమనేవారు.
అలామొదటిసారి ఆయన చేతిమీద గా, నేను బాబా హారతి బుక్ తీసుకున్నా. ఆచిన్నబుక్ ఇప్పటికీ నాదగ్గరపదిలం.
🌺ఆతరువాత మాఇంట్లో యింకో రైల్వే వాళ్ళు అద్దెకి దిగారు. వారు మన్వాడ స్టేషన్ మాష్టర్ గా పని చేస్తూ గుండెపోటుతో చనిపోయారు.
ఆయన భార్య శారదమ్మ. బంధవులంతా మాఇంటిపరిసరాలలో వుండటం వలన మాఇంట్లో అద్దెకి దిగింది.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, బాబా దగ్గరకు నేను చేరటానికి, నన్నుఆయనదగ్గరకుచేర్చుకోవటానికి ఆయన ఏర్పరచిన మార్గం తెలియచేయటానికే.
ఆమె పూర్తిగా సాయి భక్తురాలు. ఏకాంత వాసి. నాలుగు హారతులు యిచ్చేది. దీంతో నాకు అర్దం అవ్వటం మొదలయ్యింది. నేను 7th. Class కి వచ్చాను.
ఆ అమ్మమ్మ నాకు రోజు సాయి లీలలు కథలుగా చెప్పేది. నేను అడిగే దాన్ని-“అమ్మమ్మ బాబా ఏంటి ముసలాయన గా వున్నారని”. ఆమె నాకు చెప్పిన సమాధానం
“ఈయనదేవుళ్ళందరికీ తండ్రి “ అందుకే పెద్దాయనగా కనిపిస్తారని మీరు పిల్లలుకాబట్టి మీరేమడిగినా ఆయన ఇస్తారని చెప్పింది..
ఎంతగా ఆమాటలు నాపై ప్రభావం చూపించినాయంటే, ఏం కావాలన్నా, యింట్లో అమ్మని ఎలా అడుగుతామో అలాగే తాత నాకిది కావాలని మనసులోనే ఆయన్నిఅడిగి అర్దించే దాన్ని. నేననుకునేవి అన్నీ ఎలాగో జరిగేవి. ఆవిధంగా బాబా తో నాబంధం మొదలయ్యింది.
అర్దం తెలియకుండానే అమ్మమ్మ గారితో కలిసి హారతులు అన్నీపాడేదాన్ని.. అర్దం తెలుసుకున్న తరువాత హారతులు ఇష్టంగా పాడేదాన్ని.
నేను B. A. Pass అయ్యాను. నాన్న కు B.ed చదివించటం ఇష్టం లేదు. అన్నయ్యకు చదివించాలని. నాన్నా నా పోరుపడలేక Rank తెచ్చుకో చూద్దాం అన్నారు.
నేను హిందీ M. A కూడా చేశాను. నాకు ర్యాంకు రావాలి నా కృషి నేను చేస్తా. నీ అండ కావాలని బాబా కి చెప్పుకున్నా. ఎంట్రన్సు రాశాను. సీట్లు 65. రాసిన వాళ్ళు 8వేల మంది. రిజల్టు వచ్చింది.
ఆశ్చర్యం – నాకు 23వ Rank. నాకింకా బాగా గుర్తుంది నాబుక్ లోదాచుకున్న బాబా ఫోటో ముద్దు పెట్టుకొని ఆనందంతో ఏడ్చాను.
తప్పించుకుందామనుకున్న నాన్నకు చదివించక తప్పలేదు. కాలేజీవాళ్ళు కట్టాల్సిన ఫీజు D. D తీసి సర్టిఫికెట్లు ఫోటోలు యిచ్చన Date లోపు పంపమన్నారు.
బాబా అనుమతితో అన్నీ పంపాను. అసలు కథ యిక్కడ మొదలు. ఒక నెలపైన గడిచింది. ఎప్పుడు Join అవ్వమంటారోనని ఎదురుచూపులు. ఆరోజు పాత బుక్సు సర్దుతున్నాను. ఒక బుక్ లో నేను collage కి పంపాను అని అనుకున్నfees D. D ఫోటోస్ చూసాను.
అంతే అవి పెట్టకుండానే, సర్టిఫికెట్లు మాత్రమే పంపాను అని అర్ధమైంది. టైమ్ అయిపోయింది. ఇప్పుడు ఏంచేయాలి?
బాబా దగ్గర ఏడ్చాను నువ్వు యిచ్చిన అవకాశం చేజార్చుకున్నానే అని బాధపడ్డాను. మూడురోజులు గడిచాయి. బాబా తో తప్ప ఎవరితో మాట్లాడలేదనే చెప్పాలి.
నాల్గవ రోజు post లోఒక కార్డు వచ్చింది. అది హిందీలోవుంది. దానిసారాంశం:-🌺సాయి రామ్ మీరెవరో నాకు తెలియదు. మీ rank చూస్తే 23. మీరు డి. డి. ఫోటోలు పంపకుండా కేవలం సర్టిఫికెట్లు మాత్రమే పంపారు. బహుశా మర్చిపోయారనుకుంటాను. ఇలా రూల్స్ విరుద్దంగా మీకు తెలియచేయకూడదు.
మీరు సాయిభక్తులని నాకు అర్దం అయ్యింది మీరు అప్లికేషన్ ఫామ్ పై సాయి రామ్ అని వ్రాసి దానిని రబ్ చేయటం గమనించాను.
నేను సాయి భక్తుడినే. మీరు వెంటనే డి. డి. ఫోటోలు తీసుకుని రండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఈసీట్లకు సంబంధించిన వర్కంతా నేనే చేసేది. సాయి రామ్ “. అని వుంది.
🌺 నాపరిస్తితి ఎలా వుండి వుంటుందో ఊహించండి. బాబా తో నేనేమి మాట్లాడలేదు. కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. బాబా ని కళ్ళనిండా చూస్తూ నిలబడ్డాను.
ఆయన నన్ను చూసి నవ్వినట్టనిపించింది. కాలేజీకి వెళ్ళి అన్నీ కట్టేశాము. మాకు తెలియచేసిన సార్ ని కలిసాము. ధన్యవాదాలు చెబితే నాచేత చేయించిన బాబా కి చెప్పండి అన్నారు
🌹కాలేజీ చేరాను. నా తోపాటు నాకు తోడుగా నాతండ్రి ఫోటో తీసుకువెళ్ళా. బిఇడి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాను. నా వివాహం ఆయన అనుమతితో నే జరిగింది.
మావారు పెళ్లి కి ముందు నుండే సాయిదాసులు. ఒకేగూటి పక్షులను ఒకదరికే చేర్చారు సాయి. మళ్ళీ ఈ పిచ్చిది ఎక్కడ కంప్లైంట్ చేస్తుందనుకున్నారేమో. ఇది నా సాయితో నా అనుబంధం.
నా చివరి మజిలీ ఆయనే కావాలని కోరుకుంటాను. అందరికీ సాయి రామ్. ఇందిరా బాలాజీ రావు.. నెల్లూరు
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సమస్యలలో ఉన్న తన తోటి సాయి భక్తులకు సచ్చరిత్ర, సహస్రనామ పారాయణ ద్వారా పరిష్కారం చూపించిన రాజేశ్వర రావు గారు
- సాయి దాసు గారు బాబా ను ఆశ్రయించకముందున్న స్థితి.
- సాయి రక్షణ (ఇందిరా గారి అనుభవాలు)
- అమెరికా నుండి ఒక సాయి భక్తురాలు–Audio
- సుబ్బారావు గారు సాయి మందిరమును ఏర్పాటుచేయుట—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments