అమెరికా నుండి ఒక సాయి భక్తురాలు–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-196-2512-అమెరికా నుండి 5:09

ఈ రోజు అమెరికా నుండి ఒక సాయి భక్తురాలి కి బాబావారు చూపిన లీల, జరగబోయే పెద్ద ప్రమాదం నుండి ఎలా సూచనప్రాయంగా తెలిపి రక్షించారో చదవండి.

అమెరికా లో మెమోరియల్ డే కి లాంగ్ వీకెండ్ ( అంటే వరుసగా మూడు రోజులు సెలవు) ఉంటుంది. ఆ లాంగ్ వీకెండ్ కు మేము పొకొనోస్ ను  (పొకొనోస్ పర్వతాలను) దర్శించాలనుకున్నాము.

వీకెండ్ కి ముందు నేను సాయిబాబా గుడికి వెళ్ళాను. నా జాబ్ కెరీర్ , నా వ్యక్తిగత జీవితం ఎన్నో సమస్యలతో నిండి ఉంది.

ఏ సమస్యకు  కూడ కొన్ని కారణాల వలన ఒక పరిష్కారం అంటూ దొరకకుండా సమస్య అలాగే సాగుతూ ఉంది.

ఆ ప్రతికూల పరిస్థితుల నుండి బయట పడేందుకు నేను బాబా గారిని వారి ఆశీర్వాదం కోసం చాల రోజుల నుండి వేడుకొంటున్నాను.

ఆ గుడిలో పెద్ద సాయిబాబా విగ్రహం యింకా ఇతర దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఆ గుడిలో స్వరూప సాంప్రదాయ కూడా ఉంది( స్వరూప సంప్రదాయ వర్గం వారు  అద్వైత వేదాంతాన్ని అనుసరిస్తారు. అంటే ఆత్మ ను దర్శించుటయందు మొగ్గు చూపుతారు).

నేను స్వరూప సాంప్రదాయ దగ్గర నిలబడి ప్రార్థిస్థుండగ , ఎక్కడి నుండో ఒక పువ్వు క్రింద పడింది. ఆ పువ్వు ఎక్కడి నుండి పడిందో అని చూస్తూ,  ఆ పువ్వును భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదంగా తీసుకున్నాను.

తర్వాత నేను దాని గురించి మర్చిపోయాను.  మేము మా వీకెండ్స్ ప్లాన్ ప్రకారం అంతా సిద్దం చేసుకుంటున్నాము. బయలుదేరే ముందు నాకు ఒక అసాధారణమైన భావన కలిగింది.

అందువలన నేను ప్రయాణపు పనులు అన్నీ ఆపివేసి బాబా ముందర రెండు చేతులు జోడించి నిలబడ్డాను.  అయినా ఇంకా ఆ భావన పోలేదు.

పూజా మందిరం నుండి చిన్న బాబా ఫోటో తీసుకొని నా పర్సులో పెట్టుకున్నాను.  నేను వంటగదిలోకి వెళ్ళగానే గ్యాస్ వాసన వచ్చింది. ప్రొద్దున్నే వంటగది లోకి ఎవ్వరు అడుగు పెట్టలేదు.

మరి స్టౌవ్ ఎలా ఆన్ అయిందో  (నాబ్ ఎలా తిరిగి ఉందో ) అర్థం కాలేదు.

స్టవ్ ఆపివేసి,  బయలుదేరేముందు మమ్మల్ని కాపాడినందుకు బాబాకి మరలా ఒకసారి ప్రార్ధించాను. మేము జాగ్రత్తగా గమ్యానికి చేరుకున్నాము.

కాని వాతావరణం  బాగాలేకపోవటం చేత రోజంతా కష్టంగా గడిచింది.

నాలో ఇంకా ఆ అసాధారణమైన భావన పోలేదు. రాత్రి నేను నిద్రపోవడానికి ప్రయత్నిస్తుండగా ఒక స్వప్నదృశ్యం  నా కళ్ళకు కనపడి అదృశ్యమయింది.

ఒక పెద్ద ట్రక్ ( సాధారణంగా అమెరికా లో ఉండే పెద్ద కంటేనర్లు ఉండే ట్రక్ లు ) మేము వెళ్ళే దారిలో మా వైపుకు వస్తూ ఉంది.

ఈ దృశ్యం నా కళ్ళ ముందుకు వచ్చి వెళ్ళింది. బాగా అలిసి పోవడం వల్ల బాబాను తలుచుకుంటూ నిద్రపోయాను.

మరుసటి రోజు బోటింగ్ కి (పడవలో విహారానికి) వెడదామనుకున్నాము.

 మా  ఆయన , అమ్మాయి ఇద్దరూ బోట్ లో కూర్చున్నారు. నేను ఆ బోట్ ను నడపాలని ప్రయత్నిస్తుండగా , ఆ బోట్ తలక్రిందులైంది.

నది రెండు అడుగుల లోతు మాత్రమే ఉండటం వల్ల అదృష్ట వశాత్తు మా అమ్మాయి నీళ్ళలో పడి పోలేదు.

తనకి ఫ్యాంటు మాత్రమే కొద్దిగ తడిసింది. మా వస్తువులన్ని నీళ్ళలో పడిపోయాయి.

కాని దీన్ని బట్టి ఒకటి అర్ధమైనది ఏమిటంటే  మాకు ఇంకా ఏదో  చాలా పెద్ద ప్రమాదం జరగబోయేదే , కాని బాబా గుడిలో పుష్పాన్ని ప్రసాదంగా ఇచ్చి మా అందరిని ఆశీర్వదించి , పెద్ద ప్రమాదం జరగకుండ రక్షించారు.

      ఈ సంఘటన జరిగిన కొన్ని వారాలకు దీన్ని గురించి పూర్తిగా మర్చిపోయాము.

గత ఆదివారము నేను ఉద్యోగాల గురించి చూడాలని కంప్యూటర్ ఆన్ చేస్తుండగ, నా మనసుకు “బాబా ప్రశ్నలు జవాబులు” వెబ్ సైట్ ఓపన్ చేయాలనిపించింది.

ఆ వెబ్ సైట్ ఓపన్ చేస్తుండగ నా మనసుకు 311 సంఖ్య  స్పురించింది. ఎందుకో నాకు 311 సంఖ్య చూడాలనిపించింది. నా దృష్టికి మొదట3…1…1  అలా అస్పష్టంగ కనిపించింది.

నేను “బాబా ప్రశ్నలు జవాబులు” వెబ్ సైట్ ఓపన్ చేసి 311సంఖ్య చూడగ దానికి జవాబుగ  “మరణము తప్పింది, సాయిబాబా ను గుర్తుంచుకో”  అని వచ్చింది.

నాకు కొంచెం భయంవేసింది,కాని వెంటనే బాబా వుండగ నాకు భయమేల . నేను బాబాను పూర్తిగా నమ్ముకొని ఉన్నాను  అనుకొని ప్రశాంతం గా ఉన్నాను.

ఆ రోజు రాత్రి నిద్రపోతుండగ, మరలా ఇంతకు ముందు వచ్చిన దృశ్యం  (పెద్ద కార్గో ట్రక్)  నా ముందరికి వస్తున్న దృశ్యం అలా  వచ్చి వెళ్ళింది. బాబా ని తలచుకుంటూ నిద్రపోయాను.

రేపు తరువాయి బాగం ….

సర్వం సాయినాథర్పాణమస్తు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “అమెరికా నుండి ఒక సాయి భక్తురాలు–Audio

Srinivasa Murthy

Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles