Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శ్రీ సాయి సచ్చరిత్ర – సాయి విశ్వవిద్యాలయం: ఉజ్వలా బోర్కర్
చంద్రబాయి బోర్కర్ యొక్క మనుమరాలు, ఉజ్వలా బోర్కర్ కూడా చాలా సాయి అద్భుతాలను అనుభవించారు. సాయి అద్భుతాలలో ఒకటి శ్రీ సాయి సచ్చరిత్ర, అది సాయి విశ్వవిద్యాలయం, సాయిబాబాయే దాని ఛాన్సలర్!
ఉజ్వలా బోర్కర్ మాట్లాడుతూ, “మాధవరావు దేశపాండే, బయిజాబాయి, తాత్యా కోతే పాటిల్, లక్ష్మీబాయి షిండే, కాకాసాహెబ్ దీక్షిత్, చంద్రబాయ్ బోర్కర్ మరియు ఇతర సాయిభక్తులు వారి వారి జీవితాల్లో ఎలా పురోగతి సాధించారు అని తెలుసుకొని నేను గోవిందరావు దభోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్ర అనే విశ్వవిద్యాలయంలో మే 18, 1974న ప్రవేశం పొందాలని నిర్ణయించుకున్నాను.”
ఈ విశ్వవిద్యాలయం స్థాపించడానికి బాబా దభోల్కర్ ను ప్రోత్సహించారు. ఇది 53 తరగతి గదులను (అధ్యాయాలు) కలిగి ఉంది. ఆశ్చర్యకరంగా ఈ విశ్వవిద్యాలయం యొక్క నిర్మాత దభోల్కర్ మొదట్లో బాబా ఈ విశ్వవిద్యాలయం యొక్క ఛాన్సలర్ (కులపతి)గా అంగీకరించడానికి సిద్ధంగా లేడు. అతను నేర్చుకున్న దానిని బట్టి ఏవైనా ఫలితాలను ఒకరి స్వంత ప్రయత్నాల ద్వారా పొందవచ్చని నమ్మేవారు. అతని మనస్సు అహంతో నిండి ఉండేది.
కాకాసాహెబ్ దీక్షిత్, నానా చందోర్కర్, భాటే మరియు నూల్కర్ – ఈ విద్యార్థులు దభోల్కర్ ను ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఈ విద్యార్థులు మట్టి రోడ్డు మీద కూడా బాబాకు సాష్టాంగనమస్కారం చేస్తారు. ఇదంతా చూస్తూ అతను ఆశ్చర్యపోయాడు, కానీ ప్రభావితం కాలేదు. “దీక్షిత్ ప్రపంచాన్ని పర్యటించారు, ప్రపంచ సాహిత్యాన్ని చదివారు, అయినా అతను ఎందుకు ఇంత దిగజారాడు?” అని అనుకున్నాడు. ఈ ఫకీర్లో ఈ తెలివైన వ్యక్తులు ఏమి చూసి గురువుగా ఆయనను అంగీకరించారు? అని అనుకున్నారు.
కానీ ఒకసారి బాబా తిరగలిలో గోధుమ పిండిని విసరటం చూశాడు. గ్రామ శివార్లలో చల్లిన పిండి గ్రామంలో వ్యాపించిన కలరా వ్యాప్తిని అడ్డుకుంది. ఈ సంఘటన అతనికి ఒక మలుపు. అదే సాయి సచ్చరిత్ర అనే విశ్వవిద్యాలయ స్థాపనకు పునాది రాయి వేసింది. దానితో అతనిలో బాబా పట్ల విశ్వాసం పెరిగింది. తరువాత బాబా తమ వరద హస్తాన్ని దభోల్కర్ తలపై వేసి శ్రీ సాయి సచ్చరిత్ర రూపంలో సాయి విశ్వవిద్యాలయం నిర్మించటానికి అనుమతి ఇచ్చారు.
ఈ విశ్వవిద్యాలయంలోని కొన్ని పాఠాలు:
1) విశ్వాసము మరియు పట్టుదల ఎల్లప్పుడూ మీతో ఉండనివ్వండి.
2) మీరు శాంతితో జీవించాలని అనుకుంటే క్రమంగా మీ నిర్బంధ కోరికలను తగ్గించండి. ఇతరులకి సంబంధించిన వాటిని దొంగిలించవద్దు. కష్టపడండి. మీరు విత్తేమి వేస్తే అదే దక్కుతుంది. అది మాత్రమే మిమ్మల్ని మంచి స్థితిలో నిలబెడుతుంది.
3) ఒక వ్యక్తి పని చేస్తాడు, ఇతరులు ఫలితాలను పొందుతారు, ఇది ఇక్కడ ఎలా సాధ్యమవుతుంది? ఇంట్లో కూర్చుని సుఖాన్ని అనుభవిస్తూ లంచం ఇవ్వటం ద్వారా లబ్ధి పొందాలనుకుంటే, ఈ విశ్వవిద్యాలయంలో మీరు మొదటి తరగతి పొందలేరు. ఛాన్సలర్ మార్గనిర్దేశంలో అధ్యయనం చేసేవారు వారి ప్రశ్నలకు సరైన సమాధానాలను పొందుతారు.
4) మీ అహాన్ని వదిలేయండి. ఎవరు కోరికలను విడనాడలేరో వారు బ్రహ్మజ్ఞానం పొందలేరు.
ఈ విశ్వవిద్యాలయంలో ఏ వ్యయం లేదా ప్రవేశరుసుము లేకుండా ఎవరైనా ప్రవేశాన్ని పొందుతారు. పగలు, రాత్రి గడియారంతో పనిలేకుండా పనిచేయడం ఈ విశ్వవిద్యాలయం యొక్క ప్రత్యేకత. ఇందులో నేర్చుకున్న వాటిని ఆచరించే ప్రదేశం – జీవితం.
ప్రతి విద్యార్ధి ప్రత్యేకమైన వారే. ప్రతి ఒక్కరి కోసం, వారికి తగిన విధంగా ఇక్కడి ఛాన్సలర్ అప్రమత్తంగా పని చేస్తారు. కొందరికి కలలు లేదా ఇతరమార్గాల ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది. ఛాన్సలర్ సాయి, “నేను ఇక్కడ ఉన్నప్పటికీ, మీరు సప్త మహాసముద్రాలు అవతల ఉన్నప్పటికీ, మీరు చేసే ప్రతిదీ ఇక్కడ నాకు తెలిస్తుంది” అంటారు.
యూనివర్సిటీలో అనేక ఆసక్తికరమైన సంఘటనలు నేర్చుకోవడానికి ఉదాహరణలుగా ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ ఒక పరీక్ష ఎదుర్కొన్నారు. అది గురువు ఆజ్ఞలకు శిష్యులు విధేయులేనా, కాదా అని నిర్ధారించే పరీక్ష. స్వచ్ఛమైన బంగారం కూడా అగ్ని ద్వారా పరీక్షింపబడాలి.
ఒక బ్రాహ్మణుడిగా ఉన్నప్పటికీ, ఒక ఆయుధం తీసుకుని కాకాసాహెబ్ దీక్షిత్ ఏ సంకోచమూ లేకుండా మేకను చంపడానికి సిద్ధపడి సాయి ఛాన్సలర్ యొక్క పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. ఈ యూనివర్సిటీలో ‘నేను, నాది’ అనే మనస్తత్వాన్ని యూనివర్శిటీ ఛాన్సలర్ సాయి యొక్క పాదాల వద్ద సమర్పించాలి. మీ కర్మల యొక్క కర్తృత్వాన్ని అర్పించాలి. గురువు ఆదేశాలచే ఏర్పాటు చేయబడిన యూనివర్సిటీ నియమాల ప్రకారం నడుచుకోవాలి.
అహం లేకుండా చర్య జరిగితే, పరిపూర్ణతకు ఎక్కువ సమయం పట్టదు. ఒక విద్యార్థి పుండలీకరావు, “మీ వైఖరిలో అహంకారం లేనట్లయితే, మీరు ఆత్మజ్ఞానం సాధించడానికి అర్హులు. మీరు సులభంగా జీవితసాగరాన్ని దాటగలరు” అని సలహా ఇచ్చారు.
ఈ యూనివర్సిటీ ఛాన్సలర్ సాయి విద్యార్థులకు వాగ్దానం చేసారు – అధ్యయనం చేసే వారు వారి సామర్ధ్యం ప్రకారం విజయవంతం అవుతారు. ప్రతి ఒక్కరూ తమ అర్హతను బట్టి వారు అడిగేది పొందుతారు. అందరూ ఈ విశ్వవిద్యాలయంలో సహాయం పొందుతారు. ఇతరులతో మీ పురోగతిని పోల్చవద్దు. మోసం అనుమతించబడదు. ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అంకితభావం మరియు స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. నియమాలను అనుసరించే వారు సులభంగా విజయాన్ని పొందుతారు.
ఈ యూనివర్సిటీలో బిలియన్ డాలర్లను ఖర్చు చేసిన తరువాత కూడా పొందలేని ఆనందాన్ని, మనశ్శాంతిని ఎలా సాధించాలో నేర్చుకుంటారు.
గత జన్మ కర్మఫలాల వలన ప్రస్తుతం కలిగే సుఖదుఃఖాలను ఎవరూ నివారించలేరు. ప్రార్థన మరియు భగవంతుని యొక్క నామం గుర్తుంచుకొనుట ద్వారా వారి సంబంధిత తరగతిలో విజయం తెస్తుంది.
source: http://www.saiamrithadhara.com/mainhome.html
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- భారీ వర్షంలో కూడా పిండి తడవకుండా ఉంది(సాయి లీలామ్మ గారి అనుభవం)
- శ్రీ సాయి దత్తావతారం మూడవ బాగం – శ్రీ పాద శ్రీ వల్లభుడు, సాయి ఒక్కరే
- సాయి కృపతో ధన్యమైన జీవితం
- “సాయి సచ్చరిత్ర” జయంతి…..సాయి@366 నవంబర్ 26….Audio
- నమ్మకం, ఓర్పుతో సదా సాయి ని యెల్లప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే సాయి ఖచ్చితంగా దయని చూపిస్తారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments