గురువుగారి అనుగ్రహం.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై

సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

సద్గురు లీలానుగ్రహం.

పి.భానుమూర్తి,బోధన్

నవంబర్15,2010 తేదీన నా పెళ్లి ముహూర్తము నిర్ణయించారు.

ఎలాగైనా తాళిబొట్టును గురువుగారి ఆశీస్సులు,హస్త స్పర్సతో తీసుకోవాలి అనే కోరిక నాలో ఉంది.

గురువుగారు ఎక్కడ వున్నా తాళి తీసుకొని గురువుగారి వద్దకు వెళ్లాలని అక్టోబర్ నెల చివరలో అనుకొంటుండగా,అదే సమయంలో గురువుగారు శిరిడీ వచ్చారని తెలియగానే వెంటనే నేను తాళి తీసుకొని శిరిడీ బయలుదేరాను.

శిరిడీలో అమ్మగారికి నా వివాహము గురించి చెప్పి,గురువుగారి ఆశీస్సులకై తాళిబొట్టును అమ్మగారికి ఇచ్చాను.

తరువాత రోజు సాయంత్రం సత్సంగం అయిన తరువాత నేను ఇచ్చిన తాళిబొట్టును గురువుగారి ఆశీస్సులతో అమ్మగారు నా చేతిలో పెట్టారు.
అమ్మగారి పాదదర్శనము మరియు ఆశీస్సులు తీసుకున్నాను.

తర్వాత రోజు రాత్రి గురువుగారు చెన్నై బయలుదేరేటప్పుడు దర్శనం చేసుకునే భాగ్యం లభించింది.

గురువుగారికి నా పెళ్లి విషయం చెప్పాను.

గురువుగారు నవంబర్ 13వ తేదీన మహాసమాధి చెందారు.అది నాకు చాలా బాధ కలిగించింది.నా పెళ్లి వాయిదా వేయండి అని ఇంట్లో అడిగాను.ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు.నవంబర్ 15,2010న నా పెళ్లి జరిగింది.

అదే రోజు రాత్రి నేను,నా భార్య,నా చెల్లి,బావ,మరో ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి శిరిడీ బయలుదేరాను.

గురువుగారిని చివరిసారి శిరిడీలో మేము మంగళవారం నవంబర్ 16,2010 రాత్రి దర్శనం చేసుకున్నాము.

పెళ్ళికి ముందు,తరువాత కూడా గురువుగారి ఆశీస్సులు తీసుకోవాలన్న నా కోరిక ఈ విధంగా నెరవేరింది.

ఇంటివద్ద వివాహ విందు నవంబర్17న ఏర్పాటు  చేసారు.కనీసం దానికైనా వాయిదా వేయమని అడిగాను.మా బంధువులు దానికి ఒప్పుకోలేదు.

అందుకని గురువుగారి దర్శనము చేసుకొని అదేరోజు రాత్రి తిరిగి ఇంటికి బయలుదేరాము.

ఇంటివద్ద వివాహ విందు ఆరుబయట స్థలములో ఏర్పాటు చేయడం జరిగింది.కాని ఉదయం నుండి ఆకాశం మేఘావృతం అయివుంది.

పరిస్థితి గమనించిన మా నాన్నగారు ఒకవేళ వర్షం పడి ఏదైనా ఆటంకం ఏర్పడినా ఫంక్షన్ కోసం ఇంటికి దగ్గరలో ఉన్న ఒక హాల్ మాట్లాడి వుంచారు.

మేము అనుకున్న దానికంటే ఎక్కువ జనం వచ్చారు.భోజనం అందరికీ సరిపోవాలి,ఏఒక్కరూ ఇబ్బంది పడకూడదు,ఎలాగా అని మేము ఆలోచిస్తుండగా,శిరిడీ నుండి గురుబంధువు ఒకరు ఫోన్ చేసారు.
నేను అతనితో వర్షం ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి.విందుకు ఏర్పాటు చేసిన పదార్థాలు అందరికి సరిపోయే విధంగా ఉండాలని గురువుగారిని ప్రార్థించమని చెప్పాను.
సరిగ్గా మా అమ్మ మా ఇంట్లో బాబా,గురువుగారికి నైవేద్యం పెట్టే సమయంలోనే అతను ఫోన్ చేసాడు.

విందు మొదలై సక్రమంగా జరుగుచుండగా మేము అనుకున్న దానికన్నా 150 మందికి పైగా బంధుమిత్రులు రావడం చూసి మరలా వంట చేసారు.కానీ ముందుగా వండిన పదార్థాలే అందరికి సరిపోయాయి.

తరువాత వంట చేసిన పదార్థాల నుండి ఒక స్పూన్ కూడా తీయకుండా ఆనందంగా పూర్తి అయింది.అది అంతా గురువుగారి అనుగ్రహమే.
గురువుగారు భౌతికంగా మనతో లేకపోయినా
ఆయన మాటలు,
ఆ అందమైన నవ్వు,
నడుస్తూ వస్తున్నప్పుడు ఆ రాజసం,
ఆ దర్శనాలు    -మా మనస్సులో,కళ్ళలో ఎప్పటికి చెరిగిపోని మధురస్మృతులు.
మా జీవితాంతం వారి ఆశయాలకు అనుగుణంగా నడచుకోవాలని వారి పాదాల చెంత ప్రార్థిస్తున్నాము.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై

సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles