నాకు డాక్టరు శ్రీసాయియే,శ్రీ గురువుగారే.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై

సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

వళ్లిగారి శివప్రసాద్,నెల్లూరు-2

నాడు శ్రీ సాయిబాబా

“ పిలిస్తే పలుకుతాను.నా సమాధి మాట్లాడుతుంది,

నా మట్టి సమాధానమిస్తుంది.

నన్నే స్మరిస్తూ నన్ను నమ్ముకొన్నవారిని,చివరికంటా గమ్యం చేరుస్తాను”

అని పలికి తమ వాగ్దానాలు నెరవేరుస్తున్నట్లే,

నేడు పూజ్యశ్రీ గురుదేవులు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీగారు,తమను నమ్ముకొన్న వారిని ఏ విధంగా కాపాడుకుంటూ వస్తున్నారో తోటి గురుబంధువులతో పంచుకోడానికి,గురువుగారి అనుమతి అర్థిస్తున్నాను.

సద్గురు లీల ఆగష్టు 2007 సంచికలో గురుదేవులు మా కుటుంబాన్ని ఏ పరిస్థితిలో తమ దరిచేర్చుకొని,స్వాంతన కల్గించి,మా జీవితాలను స్థిరపరచిన విషయం గురుబంధువులందరికీ అవగతమైoదనే అనుకుంటున్నాను.

ఇక ఇప్పుడు శ్రీ శిరిడీ సాయినాథుని ఆశీస్సులతో,గురుదేవుల కృపాకటాక్షములతో,మా ఇంట జరిగే సత్సంగ విషయాలు కూడా తోటి గురుబంధువులతో పాలు పంచుకోడానికి,శ్రీ గురుదేవులు పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములర్పించుకుంటూ,వారి అనుమతి,ఆశీస్సులు తప్పక లభిస్తాయని నమ్మకంతో వ్రాస్తున్నాను.

మా ఇంట సత్సంగ కార్యక్రమం 2002 సంవత్సరము ప్రారంభము నుండి ప్రతి గురువారం సా 7-30 నుండి 9 గంటల వరకు జరుగుతుంది.

మొదట కుటుంబ సభ్యులకే పరిమితమైన సత్సంగ కార్యక్రమం,పూజ్య గురుదేవుల కృపాకటాక్షములతో దినదిన ప్రవర్థమానమై వెలుగొందింది.

మా అల్లుడు చి||చంద్రప్రసాద్ నాయుడు సత్సంగానికి హాజరయ్యే భక్తులకు సాయిసచ్చరిత్ర గ్రంధాలు ఇవ్వాలని తలచుకొని శిరిడీ వెళ్ళే తమ పరిచయస్తుల ద్వారా,తాము వెళ్ళేప్పుడు,యిక మేము వెళ్ళేప్పుడు,గ్రంథాలు తెప్పించి,అందరికి ఉచితంగా యిచ్చేవారు.ఆ సంఖ్య 101 నుండి 116 కూడా దాటిందనే అనుకుంటాను.

గురువుగారిని ప్రత్యక్షంగా చాలామంది కేవలం వారి గురించిన లీలలు,అనుభవాలు విని,మా ఇంటి సత్సంగంలో పాల్గొని సాయినామ జపంతో గురునామస్మరణలతో,తమ జన్మలు ధన్యం చేసుకొంటూ ఉండేవారు.

గురుదేవుల అనుగ్రహంతో,అనేక మంది తమ ఉద్యోగాలలో పదోన్నతులు పొంది యున్నారు.

వారు ఆవిధంగా పదోన్నతులు పొంది,సంతోషంగా సత్సంగంలో పాల్గొన్నందులకు,మాకు పదోన్నతి లభించింది.మేము కూడా శిరిడీ వెళ్తాము.గురువుగార్ని దర్శించుకొంటాము.

శ్రీ సాయినాథుని ఆశీస్సులతో తిరిగి వస్తాము అని చెబుతూ ఉంటే శ్రీ సాయి,గురుదేవుల ఆశీస్సులు అనుగ్రహం మా పట్ల సంపూర్ణంగా ఉందనే నమ్మకం మాకు చాలా ఆనందం కలిగిస్తుంది.

అప్పుడప్పుడు గురుదేవుల తల్లిదండ్రులను సత్సంగ కార్యక్రమానికి ఆహ్వానిస్తే,వారు కూడా వచ్చి,మా సత్సంగ సభ్యులందర్ని ఆశీర్వదించి వెళ్తుండేవారు.
ఆ అదృష్టం కేవలం గురుకృపయే,వారి కృపలేనిదే ఏదీ జరగదు.

ముఖ్యంగా గురుబంధువులందరికీ ఒక విచిత్ర స్వానుభవ సంఘటన వివరించాల్సి ఉంది.

అది 2004 సం|| ఆగష్టు 5వ తారీఖు గురువారం సత్సంగం 9-30 గం||లకు పూర్తయ్యింది.

పిల్లలు,పెద్దలు అంతా సాయినామ సంకీర్తన,గురునామ స్మరణలతో ఆరోజు కార్యక్రమం చాలా బాగా జరిగింది.

రాత్రి 1.30 గం||లకు హఠాత్తుగా చెమటలు పట్టి మెలుకవ కల్గింది.ఏం జరుగుతుందో తెలియడంలేదు.అక్కడే ఉన్న నా భార్యను మాత్రం లేపాను.క్రిందపడిపోయానట.

కుమార్తె,అల్లుడు,భార్య అందరూ కంగారుగా అరుస్తూ పిలుస్తున్నారట.నాకేమీ తెలియడం లేదు.సుమారు 20 ని||ల పాటు ఇదే పరిస్థితట,ఇక నన్ను డాక్టరు వద్దకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.క్రింద ఉన్న కారు తీయడానికి ప్రసాదు వెళ్ళాడట.

ఒక్కసారిగా నాకు స్పృహ రావడం,లేవడం జరిగిపోయింది.నన్ను డాక్టరు వద్దకు తీసుకు వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అప్పటికే స్పృహలోకొచ్చిన నేను నాకు డాక్టరు శ్రీసాయియే శ్రీ గురువుగారే.నేను రాను అని చెప్పి అక్కడే ఉన్న ఊదీ తీసుకొని,గ్లాసు నీటిలో కలిపి త్రాగి కాసేపు బయటకు వచ్చి,చల్లగాలిలో కాసేపు అటు,ఇటూ తిరిగి వెళ్లి పడుకున్నాను.హాయిగా నిద్రపోయాను.

ఇక్కడ నన్ను కాపాడింది కేవలం శ్రీ సాయియే.గురువుగారే.వారి కృపాకటాక్షాలే.నా నమ్మకం వమ్ము కాలేదు.

శ్రీసాయినాథుని పూజ్యశ్రీ గురుదేవులను పరిపూర్ణంగా నమ్మితే,అగమ్యగోచరమైన పరిస్థితులలో తామే మార్గదర్శులై ఏదో రూపంలో తమదైనరీతిలో కాపాడుతారు.
సాయిలీలలు,సాయి నామస్మరణ,గురునామ స్మరణ చేసుకొనే భక్తులకు,వారు తమ కృపాకటాక్షాలను అందిస్తూ,వారిని వెన్నంటి కాపాడుకుంటారు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు రాజాదిరాజయోగిరాజపరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథుని పాదపద్మములకు,పూజ్యశ్రీ గురుదేవుల చరణములకు మరోసారి సాష్టాంగ ప్రణామములు సమర్పించుకుంటూ – వళ్లిగారి శివప్రసాద్,నెల్లూరు-2

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై

సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles