నాకు ఎలాంటి బాధ తెలియకుండా నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేసిన బాబా,గురువుగారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై

సాయి బాబా       …       సాయి బాబా       …        సాయి బాబా       …      సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

గురుబంధువు-వళ్లిగారి శివప్రసాద్,నెల్లూరు-2

మా అండనీకుండ…నీకేలచింత?

బాబా పాద పద్మములకు,పూజ్యగురుదేవులు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీవారి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు సమర్పించుకుంటూ గతనెల నాకు కలిగిన దివ్యానుభూతిని గురుబంధువులతో,పాఠకులతో కూడా పంచుకోవాలన్న సత్సంకల్పంతో “సద్గురులీల” ద్వారా పంచుకొంటున్నoదులకు చాలా ఆనందంగా ఉంది.

ఆరోజు 16-11-2009 సోమవారం సాయంత్రం గం||5.45లకు,రోజులాగానే స్నానం చేసి ఇంటిలో బాబా,గురువుగారి పూజ పూర్తి చేసుకొని,బాబా మందిరం (చిల్డ్రన్స్ పార్కు)వెళ్ళడానికి సిద్ధమయ్యాను.

ఉన్నట్లుండి శరీరమంతా చెమటలతో నిండిపోయింది.కాళ్ళు,చేతులు స్వాధీనం తప్పుతున్నట్లు అనిపించింది.

ఇక మందిరానికి వెళ్ళలేమనే నిశ్చయం కలిగి,నా భార్య సువర్చలతో నా పరిస్థితి వివరించాను.

ప్రతిసారి ఏ బాధ కలిగినా గురువుగారికి చెప్పుకొని బాబా ఊదీతో స్వాంతన పొందేవాడిని.

కానీ ఆరోజు ఆమెకు ఏమి ప్రేరణ కలిగిందో,వెంటనే మా అమ్మాయి సుచరితకు ఫోన్ ద్వారా తెలిపింది.ఇక మా అమ్మాయి కూడా వెంటనే బయలుదేరి,నన్ను మొదట డా||ప్రభాకర్ రావుగారి వద్దకు తీసుకెళ్లింది.

అప్పటికే మా అల్లుడు చి|| చంద్రప్రసాద్ నాయుడు,డాక్టరుగారి వద్ద ఉన్నాడు.

డాక్టరుగారు అన్ని పరీక్షలు చేసి మా అల్లుడుగారితో వెంటనే ఆలస్యము చేయకుండా కార్డియాలజిస్ట్ వద్దకు తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది.

అక్కడ నుండి అటే పొగతోటలో ఉన్న అనసూయా ఇనిష్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీసుకెళ్లడం జరిగింది.

అక్కడ కూడా డా||మురళీ శంకర్ రెడ్డి గారు పరీక్షలనంతరం అప్పటి కప్పుడే రాత్రి 8.30గం||ల కల్లా ఐ.సి.యులో పెట్టడం జరిగింది.

మరుసటి రోజు 17-11-2009 నాకు తెలిసిన విషయమేమిటంటే,గుండెకు రక్తప్రసరణ జరిపే కవాటాలు పూర్తిగా మూసుకొని పోయినట్లు,రక్తప్రసరణ అక్కడి దాకా వెళ్లి వెనుకకు ప్రసరిస్తున్నట్లు వైద్య చరిత్రలో అసాధారణ విషయమని,కేవలం దైవకృప ఉంటేగాని జీవించి ఉండడం అసాధ్యమని మా అల్లుడిగారితో చెప్పి,వెంటనే అంజియోగ్రామ్తీయడానికి ఏర్పాట్లు చేసి,ఆపరేషన్ థియేటరులోనికి తీసుకువెళ్ళడం జరిగింది.

ముఖ్యంగా గురుబంధువులు ఇక్కడ గుర్తించవలసిన విషయమేమిటంటే 17-11-2009 అంజియోగ్రామ్,మళ్ళీ మరుసటి రోజు 18వ తేదీ గుండెకు అంజియోప్లాస్ట్  చేసి స్టెంట్ బిగించిన రోజున ఆపరేషన్ థియేటర్ లో నాకు ఎలాంటి బాధగాని,నొప్పిగానితెలియకుండ బాబా,గురూజీలు నా బాధను వారే భరించి నన్ను కాపాడారు.

ఆపరేషన్ థియేటర్ లో అయిదుమంది డాక్టర్లున్నారు.ప్రతినిమిషం వారు నన్ను అడుగుతూనే ఉన్నారు.నొప్పిగా ఉందా,నొప్పి కలిగితే చెప్పండి,మాట్లాడండి” అంటూ వారు అడుగుతూనే ఉన్నారు.

నా తలక్రింద,బాబా,గురూజీలతో కూడ,ఊదీ,సాయిసచ్చరిత్ర ఉంది.ఇక నేకేలభయం?కనీసం ఆరెండు రోజులు మత్తుకూడా యివ్వలేదు.ఆనొప్పి బాబా,గురూజీలే భరించి,ఆ బాధ నుండి విముక్తుణ్ణి చేసారు.

తేదీ 16-11-2009 నుండి 25-11-2009వరకు పది రోజులు ఏ.ఐ.ఎమ్.ఎస్ లోనే ఉంచి,25వ తేదీన రాత్రి 8 గంటలకు డిస్చార్జి చేసారు.

మా అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చింది.ప్రస్తుతం అమ్మాయి ఇంట్లోనే విశ్రాంతిగా ఉన్నాను.

చెన్నై నుండి మా బావగారు శ్రీ సురేంద్రబాబుగారి అమ్మాయి సుచిత్రాదేవి వచ్చి,నా ఆపరేషన్ జరిగిన రోజు,నా ఆరోగ్యవిషయం పూజ్య గురుదేవులకు మెసేజ్ పంపినట్లు తెలిపారు.అప్పుడు గురుదేవులు ఋషికేశ్ లో ఉన్నట్లు కూడ తెలిపారు.

ఇప్పటికీ నాకు అర్థంకాని జవాబు రాని ప్రశ్న.నా బాధను ఎవరు భరించారు?డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేటట్లుగా గుండెకు సంబంధించిన రెండు శస్త్ర చికిత్సలు ఎలాంటి బాధ నాకు తెలియకుండా విజయవంతంగా పూర్తి చేయించి,నన్ను సంపూర్ణ ఆరోగ్య వంతునిగా చేసిన బాబావారికి,గురుదేవులు శ్రీసాయినాథుని శరత్ బాబూజీ వారికి ఏమిచ్చి,ఋణం తీర్చుకొనగలను?
అందుకే కృతజ్ఞతగా,తనివితీరా మీ అందరితో నాకు కలిగిన అనుభవాన్ని పంచుకొంటున్నారు.
జీవితాంతం వారి పాదపద్మములకు,ప్రణామములర్పించుకొంటూ,వారి నామస్మరణే ధ్యేయంగా ఉంచుకొనగలగడం తప్ప…

గురుబంధువు-వళ్లిగారి శివప్రసాద్,నెల్లూరు-2.

సెల్:9247486079

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై

సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles