Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
పాణయ్యకు శ్రీరంగంలో కొలువై ఉన్న రంగనాథుడంటే చాలా ఇష్టం. ఆ పరిసరాల్లోనే నిచుళాపురం అనే ఊరు ఉంది. అక్కడే పాణయ్య ఉండేవాడు.
కావేరీలో స్నానం చేసి, ఇసుక తెచ్చి, ఆ ఇసుకతో బొమ్మను (మూర్తిని) చేసుకుని దానినే రంగనాధునిగా భావిస్తూ, వీణ భుజాన తగిలించుకుని దానిని మీటుతూ భక్తి కీర్తనలు పాడేవాడు.
ఎవరో ఒక భక్తుడు రంగనాథుని ప్రసాదం ఇచ్చేవాడు. గంగి గోవు పాలు గరిటడైనను చాలు అన్నట్లు, ఆ గుప్పెడు ప్రసాదం చాలదా? ఆ పరమ వైష్ణవునకు.
ఆ ప్రసాదమే అమృతం ఆయనకు. చీకటి పడుతుండగానే ఇంటికి పోయేవాడు.
ఎల్లప్పుడు వీణను ధరించి, హరి సంకీర్తనం చేసే పాణయ్యను అందరూ తిరుప్పాణన్ అనే వారు.
ఒకసారి ఆయన అలా పాడుకుంటున్నాడు. అదే సమయానికి శ్రీరంగంలో రంగనాథుని అర్చించే సారంగుడనే వైష్ణవ తిలకుడు శిష్య బృందంతో కావేరీ నదికి పోతున్నాడు.
ఆయన, ఆయన భక్తులు కావేరిలో స్నానం చేసి, బిందెతో కావేరీ జలాలు తెచ్చి శ్రీరంగనాథుని అర్చించాలి. దూరంగా పాణయ్య పాడుతున్నాడు.
వినే వారికి ప్రాణాలు లేచి వచ్చినట్లున్నాయి. కాని పాణయ్య దైవ మత్తులో ఉన్నాడు తాను దారికి అడ్డముగా ఉన్నాననే ద్యాస లేకుండా గానం చేస్తున్నాడు.
పాణయ్యను దూరంగా జరగమని సారంగుని శిష్యులు చెప్పారు. అవి పాణయ్య చెవుల పడలేదు. పాణయ్యపై వారు రాళ్లు రువ్వారు. ఒడలంతా రక్తం కారుతోంది. అప్పటికి బాహ్య స్మృతి కలుగ లేదు పాణయ్యకు.
సారంగుడు, ఆయన శిష్య గణం వేరే దారిన వెళ్ళారు పావన కావేరీ తీరానికి.
స్నానం చేసి, బిందెడు నీటితో రంగని సన్నిధికి చేరారు వారు. రంగని ఒడలంతా నెత్తురు. ఈ వార్త గుడి దాటింది. ఊరంతా పాకిపోయింది. కారణం ఎవరికి అర్ధం కాలేదు.
ఆ రాత్రికి సారంగుని కలలో రంగడు కనిపించాడు. రంగని కన్నులు ఎర్రగా ఉన్నాయి.
“నా భక్తుడైన పాణయ్యకు అవమానం జరింగింది. ఇవిగో నా భక్తునిపై పడ్డ రాళ్ల దెబ్బలు నేను భరించాను. పాణయ్యకు రేపు నా దర్శనం చేయించు” అని రంగడు అదృశ్యుడయ్యాడు.
ఈ విషయం శ్రీరంగం అంతా ప్రాకింది.
మరునాడు ఊరి జనం వెంటరాగా సారంగుడు పాణయ్యను రంగని మందిరానికి ఆహ్వానించాడు.
“ఆలయం పవిత్రమైనది. నేను అడుగిడజాలను” అన్నాడు పాణయ్య. పాణయ్యను తన భుజాలపై ఎక్కించుకొని దైవ మందిరములోనికి తీసుకు వెళ్లి రంగని దర్శనం చేయించాడు సారంగుడు.
సరాసరి పాణయ్య రంగని ముఖాన్ని దర్శించలేదు. పాదాల నుండి ప్రారంభించి పైపైకి దృష్టిని తుదకు ముఖం పైన కేంద్రీకరించాడు. అది క్రమము.
ఇలాగే బీ.వి.నరసింహస్వామి, సాయి పాదానందకు సాయిబాబాను ఎలా దర్శించాలో చెప్పారు. పాణయ్య పన్నిద్దరాళ్వార్లలో ఒకరైనాడు.
అయోనిజునిగా పాణయ్య కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు భూలోకంలో అవతరించాడు.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- కరుణ కోసం తపన…. మహనీయులు – 2020… నవంబర్ 22
- నాడే కాదు – నేడు కూడా!…..సాయి@366 జూలై 24…Audio
- వాడే వీడు! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 2
- పరీక్షలు …. మహనీయులు – 2020… ఏప్రిల్ 23
- ఆనందదాయకుడు…. మహనీయులు – 2020 – జనవరి 23
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments