అసహ్యము!…..సాయి@366 జూన్ 21….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


ఆధ్యాత్మిక బాటలో పయనించే వారి పద్ధతి వేరుగా ఉంటుంది. వారికి కష్టం, సుఖం అంటే తేడా తెలియదు. ఇంకా ఇష్టం, అయిష్టం అనేవి ఉండవు. అంతా ఒకటే.

కుక్కలు, ఇతర జంతువులు భుజించినవి తినేవాడు సాయి. గజానన్‌ మహారాజూ అంతే. యోగులందరు అలానే ప్రవర్తిస్తారు.  అటువంటి వారిలో తెలుగు వారు కూడా ఉన్నారు.

ఒక రోజు నడింపల్లి వీరయ్య తాత నడింపల్లి పొలిమేర వల్లకాటికి పోతుంటే దారిలో ఒక చచ్చిన పాము కనపడింది.

ఆ పామును ముక్కలు ముక్కలుగా చేశాడాయన. వల్లకాడులో మంట చల్లారిన ఒక చితి నిప్పుల్లో కాల్చి తిన్నాడు.

ఆయనకు ఎట్టి జుగుప్సా లేదు. చూచే వారికి, వినే వారికి మాత్రమే జుగుప్స

అవధూత వెంకటాంబ, రావి చెరువులో చచ్చిన పింజరి పామును, పురుగులూరే చచ్చిన కుక్క మాంసమును, మురిగిన కప్పలను తినేది.

శారీరక స్పృహ లేదు ఆవిడకు. పేడ దిబ్బ గుంటలోని మురుగు నీరు త్రాగింది ఆమె.

అవధూత స్థాయికి చేరిన వారు, చేరబోయే వారికి సహ్యము, అసహ్యము ఉండవు.

సాయి సాహిత్యంలో కూడా ఇటువంటి జుగుప్సాకర సంఘటనలు ఎక్కువగా లేవు గాని, అక్కడక్కడా ఉన్నాయి.

కుశాభావ్‌ అనే సాయి భక్తుడు సాయిబాబా చేసిన వమనంలోని గడ్డలను తిన్నాడు. సాయి తినవద్దు అన్నట్లు కొడుతున్నా అతను తిన్నాడు.

ఇక ఉపాసనీ జీవితంలో కూడా జగుప్సాకర విషయాలున్నాయి.

ఉపాసనీ షిరిడీలో ఉన్నప్పుడు కుష్టు వ్యాధి తీవ్రంగా ఉన్న ఒక వ్యక్తిని చూచాడు.

ఆయన వ్యాధిగ్రస్తునకు స్నానం చేయించి, బట్టలు వేశారు. ఆ స్నానం చేయించిన నీటినే ఆయన త్రాగారు కూడా.

కుష్టు వ్యాధిగ్రస్తునకు చేయు సేవ బుద్ధిని పరిశుద్ధం చేస్తుంది. ఇంకా ఉన్నత పథంలోనికి కూడా తీసుకుపోతుంది.

ఈ విషయాన్ని ఆయన జూన్‌ 21, 1924న తెలియచేశారు.

ఇతరుల స్థితిని గాని, ఆహారాన్ని గాని చూచి జుగుప్స చెందకుందుముగాక!

అంతా ఈశ్వర సృష్టి అని మనము గ్రహిస్తే జుగుప్సకు చోటే ఉండదు.

అట్టి ఏకత్వాన్ని మనకు సాయి ప్రసాదించు గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles